నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2023 8:50AM by PIB Hyderabad
గణేశ చతుర్థి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు, విజయాలు, ఆరోగ్య శ్రేయస్సును కల్పించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“గణేశ చతుర్థి పర్వదినం సందర్భంగా దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. విఘ్నాలను హరించే వినాయకుని ఆరాధనతో ముడిపడిన ఈ పవిత్ర పండుగ మీ అందరికీ మంచి భవిష్యత్తు, విజయాలతోపాటు ఆరోగ్యశ్రేయస్సును ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను... గణపతి బప్పా మోరియా! ‘సర్వ దేశవాసియానాం గణేశ చతుర్థ్యీచ్య హార్దిక్ శుభేచ్ఛా! గణపతి బప్పా మోరియా!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/AK