శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

సిఎస్ఐఆర్ - ఎన్ఎంఎల్, కేఏఎంపి : ఏఐ, ఎంఎల్ పై పెంపొందించుకునే కార్యక్రమం


నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ మ్యాపింగ్ ప్లాట్‌ఫామ్ (కేఏఎంపి) కింద నమోదు చేసుకున్న 5వ తరగతి నుండి 12వ తరగతి చెందిన 800 మంది పైగా విద్యార్థులు - సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్సిపిఆర్ చొరవతో కూడిన నాలెడ్జ్ అలయన్స్ సెషన్‌లో పాల్గొన్నారు.

Posted On: 16 SEP 2023 10:36AM by PIB Hyderabad

జంషెడ్‌పూర్‌లోని సిఎస్ఐఆర్ కి చెందిన నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీలో సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ సుమన్ తివారీ, నాలెడ్జ్ అండ్ అవేర్‌నెస్ మ్యాపింగ్ ప్లాట్‌ఫామ్ (కేఏఎంపి) కింద చేరిన 5 నుండి 12వ తరగతికి చెందిన 800 మందికి పైగా విద్యార్థుల కోసం నాలెడ్జ్ షేరింగ్ సెషన్‌ను నిర్వహించారు - ఇది సిఎస్ఐఆర్ -నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సిపిఆర్), ఎన్ సి పి ఎల్ చొరవ. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఇటీవలి సంవత్సరాలలో ఎంతో దృష్టిని ఆకర్షించడమే కాకుండా రెండు దగ్గరి సంబంధం ఉన్న రంగాలు అని డాక్టర్ తివారి వివరించారు. అవి అనేక సాంకేతిక పురోగతులకు కారణమయ్యాయి, మన జీవితంలోని వివిధ అంశాలఎంతో ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఈ ప్రత్యేకమైన సిఎస్ఐఆర్ - ఎన్ఎంఎల్, కేఏఎంపి వర్క్‌షాప్‌లో తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాలను పరిశోధిస్తామని చెప్పారు. ఏఐ, ఎంఎల్  వెనుక ఉన్న రహస్యాలను బయటకు తీయాల్సి ఉందని చెప్పారు. 

సిఎస్ఐఆర్ - ఎన్ఎంఎల్, కేఏఎంపి గురించి:

సిఎస్ఐఆర్-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ (సిఎస్ఐఆర్-ఎన్ఎంఎల్) అనేది ఖనిజాలు, లోహాలు, మెటీరియల్స్ - సైన్స్, టెక్నాలజీ, పారిశ్రామిక సేవలు, మానవ వనరుల అభివృద్ధి కి సంభందించిన, వివిధ కోణాలలో పరిశోధనకు అంకితం అయిన ఒక ప్రధాన భారతీయ పరిశోధనా సంస్థ.  సిఎస్ఐఆర్ - ఎన్ఎంఎల్  జంషెడ్‌పూర్‌లోని ప్రధాన పరిశోధనా అంశాలు: మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెటల్ ఎక్స్‌ట్రాక్షన్, రీసైక్లింగ్, మినరల్ ప్రాసెసింగ్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, ప్రాసెసెస్, ఎనలిటికల్, అప్లైడ్ కెమిస్ట్రీ మొదలైనవి.

కేఏఎంపి అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (ఎన్ఐఎస్సిపిఆర్), పారిశ్రామిక భాగస్వామి  నైసా కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చొరవ. ఇది విద్యార్థుల స్వాభావిక సామర్థ్యాలను వెలికితీసే సృజనాత్మకత, అర్థవంతమైన అభ్యాసం, విమర్శనాత్మక పఠనం, ఆలోచనా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించింది.

 <><><>



(Release ID: 1958237) Visitor Counter : 101