ప్రధాన మంత్రి కార్యాలయం

‘యశోభూమి’ గా పిలిచే ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్యొక్క ఒకటో దశ ను సెప్టెంబర్ 17 వ తేదీ న న్యూ ఢిల్లీ లోని ద్వారక లో దేశ ప్రజల కుఅంకితం చేయనున్న ప్రధాన మంత్రి


సుమారు 5,400 కోట్ల రూపాయల ఖర్చు తో తయారైనమరియు 8.9 లక్షల చదరపు మీటర్ లకు పైబడిన ప్రాజెక్టు క్షేత్రం లో అభివృద్ధిపరచిన‘యశోభూమి’ ప్రపంచం లో అతి పెద్దదైనఎమ్ఐసిఇ గమ్యస్థానాలల్లో ఒకటి అవుతుంది

‘యశోభూమి’ లో ఒక భవ్యమైన కన్వెన్శన్ సెంటర్, అనేక ఎగ్జిబిశన్ హాల్స్ మరియు ఇతర సదుపాయాలు ఉన్నాయి

ఈ కన్ వెన్శన్ సెంటర్ 11,000 మంది కి పైగాప్రతినిధులు కూర్చొనగలిగేందుకు తగిన ఏర్పాట్ల తో పాటు 15 కన్ వెన్శన్ రూమ్ స్, ఒక గ్రాండ్ బాల్ రూమ్ మరియు13 సమావేశ గదుల తో రూపుదిద్దుకొంది

ఈ కన్ వెన్శన్ సెంటర్లో దేశం లో కెల్లా అతి పెద్దదైనటువంటి ఎల్ఇడి మీడియా ఫసాడ్ అమరి ఉంది

అత్యంత అధునాతనమైనసీటింగ్ సదుపాయం తో ముస్తాబైన కన్ వెన్శన్ సెంటర్  ప్లీనరీ హాలు సందర్శకుల కు ప్రపంచ శ్రేణిఅనుభవాన్ని అందిస్తుంది

‘యశోభూమి’ దిల్లీ ఎయర్ పోర్ట్మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గం తో జత కలుస్తుంది

ప్రధాన మంత్రి ద్వారక సెక్టర్ 21 నుండి ‘యశోభూమి ద్వారక సెక్టర్25’ అనే ఒక క్రొత్త మెట్రో స్టేశన్ వరకు ఉండే దిల్లీ ఎయర్ పోర్ట్మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గం తాలూకు విస్తరణ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు

Posted On: 15 SEP 2023 4:37PM by PIB Hyderabad

యశోభూమిగా పిలిచేటటువంటి ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ (ఐఐసిసి) యొక్క ఒకటో దశ ను న్యూ ఢిల్లీ లోని ద్వారక లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ న ఉదయం 11 గంటల కు దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి ద్వారక సెక్టర్ 21 నుండి క్రొత్త మెట్రో స్టేశన్ అయిన యశోభూమి ద్వారక సెక్టర్ 25’ వరకు విస్తరణ పనులు పూర్తి అయిన దిల్లీ ఎయర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గాన్ని కూడా ప్రారంభించనున్నారు.

 

 

దేశం లో సమావేశాల ను, సమ్మేళనాల ను మరియు ప్రదర్శనల ను నిర్వహించడానికంటూ ఒక ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల వసతి ని ఏర్పరచాలన్న ప్రధాన మంత్రి యొక్క దార్శనికత ను ద్వారక లో యశోభూమికార్యకలాపాల నిర్వహణ ను మొదలు పెట్టడం ద్వారా పటిష్టం చేయడం జరుగుతుంది.

 

 

మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ లకు పైబడిన ప్రాజెక్టు విస్తీర్ణం తో మరియు 1.8 లక్షల చదరపు మీటర్ ల కు మించిన మొత్తం నిర్మిత క్షేత్రం తో కలుపుకొని యశోభూమిప్రపంచం లో అతి పెద్దదైన ఎమ్ఐసిఇ (మీటింగ్స్, ఇన్ సెన్ టివ్స్, కాన్ఫరెన్సెస్ ఎండ్ ఎగ్జిబిశన్స్) సదుపాయాలు అమరిన ప్రదేశాల లో తనది అయినటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకోనుంది.

 

 

రమారమి 5,400 కోట్ల రూపాయల ఖర్చు తో అభివృద్ధి పరచినటువంటి యశోభూమిని ఒక భవ్యమైన కన్ వెన్శన్ సెంటర్, అనేక ఎగ్జిబిశన్ హాల్స్ మరియు ఇతర సదుపాయాల తో అలంకరించడమైంది.

 

 

డెబ్భయ్ మూడు వేల చదరపు మీటర్ ల కు మించిన విస్తీర్ణం లో నిర్మాణం పూర్తి అయిన కన్ వెన్శన్ సెంటర్ లో ప్రధాన సభాభవనం, గ్రాండ్ బాల్ రూమ్స్ సహా 15 కన్ వెన్శన్ రూమ్స్, 13 సమావేశ గదులు ఉన్నాయి, వీటి మొత్తం సామర్థ్యం 11,000 మంది ప్రతినిధుల కు ఆశ్రయాన్ని ఇవ్వగలవు. కన్ వెన్శన్ సెంటర్ లో దేశం లోనే అతి పెద్దది అయినటువంటి ఎల్ఇడి మీడియా ఫసాడ్ ను కూడా అమర్చడమైంది. కన్ వెన్శన్ సెంటర్ లోని ప్లీనరీ హాలు దాదాపు 6,000 మంది అతిథులు ఆసీనులు అయ్యేందుకు ఏర్పాటుల ను చేయడమైంది. సభా భవనం లో అన్నింటి కంటే నవీనమైనటువంటి ఆటోమేటిక్ సీటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి అయితే చదునైన ఉపరితలం గానో, లేదా రక రకాల సీటింగ్ శ్రేణుల తో కూడిన అంచెల వారీ ఆడిటోరియమ్ తరహా లోనో మారిపోగలుగుతాయి. సభా భవనం లో ఉపయోగించిన కలప నేల లు మరియు శబ్ద గ్రహణ ప్రత్యేకత కలిగిన గోడ (ఎకుస్టిక్ వాల్) పేనెల్ సందర్శకుల కు ప్రపంచ శ్రేణి అనుభూతి ని పంచగలవు. అద్వితీయమైన పూల రేకు ల వంటి కప్పు ను కలిగిన గ్రాండ్ బాల్ రూమ్ సుమారు 2,500 మంది అతిథుల కు ఆశ్రయాన్ని ఇవ్వగలదు. దీనిలో ఒక విశాలమైనటువంటి ఆరుబయలు క్షేత్రం కూడా ఉంది. ఇది 500 మంది కూర్చొనేందుకు అనువైంది గా ఉంది. ఎనిమిది అంతస్తుల లో విస్తరించిన 13 మీటింగ్ రూమ్ స్ ఉన్నాయి, విధ విధాలైన సమావేశాల ను నిర్వహించేందుకు దీనిని ఉద్దేశించడమైంది.

 

 

 

యశోభూమిలో ప్రపంచం లోనే అతి పెద్దవైన ఎగ్జిబిశన్ హాల్స్ సరస న చేరే ఒక ఎగ్జిబిశన్ హాల్ కూడా కొలువుదీరింది. 1.07 లక్షల చదరపు మీటర్ ల కు పైగా విస్తీర్ణం లో కట్టిన ఎగ్జిబిశన్ హాల్స్ ను ప్రదర్శన లు, ట్రేడ్ ఫేర్స్ మరియు వ్యాపార ప్రధానమైన కార్యక్రమాల ను నిర్వహించడాని కి ఉపయోగించనున్నారు. ఈ హాల్స్ ను ఒక వైభవోపేతమైనటువంటి ఫోయర్ తో జోడించడమైంది. దీని కప్పు ను రాగి తో ప్రత్యేకత కలిగివుండేది గా రూపొందించడం జరిగింది, ఇది విభిన్న స్కైలైట్ మాధ్యం ద్వారా అంతరిక్షం లోని వెలుగు ను వడ కడుతుంది. ఫోయర్ లో ప్రసార మాధ్యాల కు కేటాయించిన గదులు, వివిఐపి లౌంజ్ లు, సామానుల ను భద్రపరచుకొనేందుకు సౌకర్యాలు, సందర్శకుల కు సమాచారాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన కేంద్రం, టికెటింగ్ ల వంటి విభిన్న సహాయక క్షేత్రాలు ఉంటాయి.

 

 

యశోభూమిలో సందర్శకులు తిరుగాడే ప్రాంతాలు అన్నిటిని ఏ విధం గా రూపు దిద్దారంటే, ఈ కన్ వెన్శన్ సెంటర్ ల వెలుపలి ప్రదేశాలు నిరంతరత ను సూచిస్తూ ఉంటాయి. అది టెరాజో ఫ్లోర్స్ రూపం లో భారతీయ సంస్కృతి నుండి ప్రేరణ ను పొందిన వస్తువుల తో, సామగ్రి తో తయారైంది. దీనిలో ఇత్తడి పూత పనితనం తో ఉన్న రంగోలి నమూనాల ను, సస్పెండెడ్ సౌండ్ ఎబ్జోర్బెంట్ మెటల్ సిలెండర్ లను, ఇంకా కాంతి యొక్క విన్యాసాన్ని పోలిన గోడల ను ఏర్పాటు చేయడమైంది.

 

 

యశోభూమిదీర్ఘకాలం పాటు దృఢం గా నిలచి ఉండేటట్లు గా తయారు అయింది. అది ఎలాగ అంటే వ్యర్థ జలాల ను 100 శాతం మేరకు తిరిగి ఉపయోగించుకోవడం, వాన నీటి ని నిలవ చేసేందుకు తగిన ఏర్పాటులతో పాటు గా అత్యాధునికమైన వ్యర్థ జలాల పునర్వినియోగ ప్రణాళిక ను కూడా సిద్ధం చేయడమైంది. మరి ఈ పరిసరాల కు సిఐఐ యొక్క ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) నుండి ప్లాటినమ్ సర్టిఫికేశన్ లభించింది.

 

 

సందర్శకుల రక్షణ కోసమని యశోభూమిలో ఉన్నత స్థాయి సాంకేతికత తో కూడినటువంటి సురక్ష వ్యవస్థ ను కూడా పొందుపరచడమైంది. 3,000 కు పైగా కార్ లను నిలిపి ఉంచేందుకు అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ ను 100 కు పైగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్ లతో తీర్చిదిద్దడం జరిగింది.

 

 

క్రొత్త మెట్రో స్టేశన్ యశోభూమి ద్వారక సెక్టర్ 25’ ను ప్రారంభించడం తోనే యశోభూమిదిల్లీ ఎయర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గం తో కూడాను జత పడనుంది. క్రొత్త మెట్రో స్టేశన్ కు మూడు సబ్ వే లు ఉంటాయి - వాటిలో 735 మీటర్ ల పొడవైన సబ్ వే ఈ స్టేశను ను ఎగ్జిబిశన్ హాల్స్ తో, కన్ వెన్శన్ సెంటర్ తో మరియు సెంటర్ ఎరినా తో కలుపుతుంది; మరొక సబ్ వే ద్వారక ఎక్స్ ప్రెస్ వే లో ప్రవేశం/ నిష్క్రమణ మార్గాల ను కలుపుతుంది; కాగా మూడో సబ్ వే మెట్రో స్టేశను ను యశోభూమియొక్క రాబోయే కాలం లోని ఎగ్జిబిశన్ హాల్స్ తాలూకు ఫోయర్ ను కలుపుతుంది.

 

ఎయర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మార్గం లో రాక పోక లు జరిపే మెట్రో రైళ్ళ వేగాన్ని సైతం దిల్లీ మెట్రో గంట కు 90 కి.మీ. నుండి గంట కు 120 కి.మీ. కి పెంచనుంది. ఫలితం గా యాత్ర కు పట్టే కాలం తగ్గిపోతుంది. న్యూ ఢిల్లీనుండి యశోభూమి ద్వారక సెక్టర్ 25’ వరకు చేరుకోవడానికి మొత్తం దాదాపు గా 21 నిమిషాల సేపు పట్టనుంది.

 

 

 

***



(Release ID: 1957937) Visitor Counter : 162