వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పునరుత్పాదక శక్తిలో దేశాన్ని ఏకీకృతం చేయడానికి కట్టుబడి ఉన్న భారతదేశ నాయకత్వం ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది : శ్రీ పీయూష్ గోయల్


జి20 న్యూఢిల్లీ నాయకుల ప్రకటన లో వివరించిన స్వచ్ఛమైన, స్థిరమైన, సమ్మిళిత శక్తి పరివర్తనను నొక్కి చెప్పే ఫలితాలను అమలు చేయాలని నొక్కి చెప్పిన - శ్రీ గోయల్


భారత-మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్, గ్రీన్ హైడ్రోజన్, కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా ప్రపంచాన్ని మరింత చేరువ చేయడం ద్వారా ప్రపంచ నాయకత్వానికి భారతదేశ నిబద్ధతను వ్యక్తం చేసిన - శ్రీ గోయల్


పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేయడం ద్వారా మరిన్ని ప్రపంచ మార్కెట్లను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సదస్సుకు హాజరైన వారిని కోరిన - శ్రీ గోయల్


భారతదేశ ఇంజనీరింగ్ నైపుణ్యం, ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో చురుకుగా పాల్గొనే సామర్థ్యాన్ని కలిగి ఉంది : శ్రీ గోయల్

Posted On: 15 SEP 2023 5:32PM by PIB Hyderabad

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దేశాన్ని సమగ్రపరచడానికి భారతదేశ నాయకత్వం కట్టుబడి ఉందని, పునరుత్పాదక ఇంధన ప్రయత్నంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పేర్కొన్నారు.   ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన 'స్వచ్ఛమైన విద్యుత్తు పై ఎం.ఎన్.ఆర్.ఈ-సి.ఐ.ఐ. 4వ అంతర్జాతీయ సదస్సు, ప్రదర్సన’ లో భాగంగా జరిగిన ‘ప్రపంచ సరఫరా వ్యవస్థ స్థితిస్థాపకతను సాధించడంలో భారతదేశాన్ని భాగస్వామిగా ఉంచడం’ అనే సెషన్‌ లో కేంద్ర మంత్రి కీలక ప్రసంగం చేస్తూ,   జి-20 న్యూఢిల్లీ నాయకుల ప్రకటనలో వివరించిన స్వచ్ఛమైన, స్థిరమైన, న్యాయమైన, సరసమైన, సమ్మిళిత ఇంధన పరివర్తనను నొక్కి చెప్పే ఫలితాలను అమలు చేయడం గురించి వివరించారు. 

 

 

భారతదేశ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్, గ్రీన్ హైడ్రోజన్, కనెక్టివిటీ ప్రాజెక్టుల వంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచ నాయకత్వం, సరిహద్దులకు అతీతంగా ప్రపంచాన్ని దగ్గరగా తీసుకురావడం పట్ల భారతదేశ నిబద్ధతను శ్రీ పీయూష్ గోయల్ తెలియజేశారు.   భారతదేశం కేవలం ప్రపంచ సరఫరా వ్యవస్థ లో పాల్గొనడానికి మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మరింత స్థిరమైన, సమ్మిళితమైన, పరస్పరం అనుసంధానం చేయడంలో గణనీయంగా దోహదపడుతుందని ఆయన నొక్కి చెప్పారు.  ఆయన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను ఉటంకిస్తూ, “వ్యాపారాలు విజయవంతంగా ఎల్లలు, సరిహద్దులు దాటి వెళ్ళాయి, అయితే ఇప్పుడు వ్యాపారాలను అట్టడుగు స్థాయికి మించి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది.  సరఫరా వ్యవస్థ స్థితిస్థాపకత, స్థిరత్వం పై దృష్టి సారించడం ద్వారా దీనిని నిర్వహించవచ్చు." అని చెప్పారు. 

 

 

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేయడం ద్వారా మరిన్ని ప్రపంచ మార్కెట్లను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి పెట్టాలని శ్రీ గోయల్ సదస్సుకు హాజరైన ప్రతినిధులను కోరారు.  స్వచ్ఛమైన విద్యుత్తు, ఆవిష్కరణ, తయారీలను అభివృద్ధి చేయడం కోసం విశ్వ విజేతలను సృష్టించడం పై మనం చూస్తున్న ఈ కాన్ఫరెన్స్ థీమ్ నుండి, భారతదేశ ముందుచూపు, ఆధునిక విధానాన్ని నిజంగా నిర్వచించే కీలక పదం "ఆవిష్కరణ" అని ఆయన పేర్కొన్నారు. 

 

 

ఇంజినీరింగ్, కన్సల్టెన్సీ లేదా ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ తో పాటు కన్‌స్ట్రక్షన్ (ఈ.పి.సి) కాంట్రాక్టుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో చురుగ్గా పాల్గొనే ఇంజనీరింగ్ నైపుణ్యాన్నీ, సామర్థ్యాన్నీ భారతదేశం కలిగి ఉందని మంత్రి నొక్కి చెప్పారు.  పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ అగ్రగామిగా అవతరించే అవకాశం భారతదేశానికి ఉందని, ప్రపంచ ఇంధన పరివర్తన లక్ష్యాలను సాధించడంలో ఇతర దేశాలతో సహకరించి, భాగస్వామ్యం కావాలని ఆయన పెద్ద కంపెనీలను కోరారు.

 

 

ప్రధానమంత్రి నాయకత్వంలో భారతదేశ జి-20 ప్రెసిడెన్సీ గురించి శ్రీ గోయల్ గర్వంగా మాట్లాడుతూ, ఇది భారతదేశం అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కారణాన్ని చాంపియన్ చేయడానికి, వారి సమస్యలను తెరపైకి తీసుకురావడానికి అనుమతించిందని చెప్పారు.  ఆర్థిక అవకాశాలను సృష్టించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, లక్షలాది ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి దేశం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.  వాతావరణ మార్పు, ప్రకృతి వైపరీత్యాలను పరిష్కరించడానికి, అందరికీ మంచి భవిష్యత్తును నిర్ధారించడానికి జి-20 నిర్ణయాలలో స్వచ్ఛమైన విద్యుత్ పై దృష్టి పెట్టడం చాలా అవసరం.

 

 

భారతదేశం యొక్క జి-20 ప్రెసిడెన్సీలో అపూర్వమైన డెలివరీలను నిర్ణయించడానికి ప్రధానమంత్రి ఇప్పటికే చర్యలు తీసుకున్నారని మంత్రి చెప్పారు.  డెలివరీల అమలు కోసం ప్రధానమంత్రి వాటాదారులు అందరి నుంచి క్రియాశీల భాగస్వామ్యం, సహకారం కోరారు. ప్రధానమంత్రి ఆఫ్రికన్ దేశాలను జి-20 పరిధిలోకి తీసుకురావడం గర్వించదగ్గ విషయమనీ, బ్రెజిల్ ఇదే పంథాలో కొనసాగుతుందని తెలుసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని శ్రీ గోయల్ పేర్కొన్నారు.  భారతదేశంతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సామాన్యుల జీవితాలను ప్రభావితం చేసే వేదికగా జి-20 ఇప్పుడు మారిందని ఆయన అన్నారు.

 

 

ఆర్థిక అవకాశాలు, ఉద్యోగ కల్పనకు దారితీసే సుస్థిర, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఆర్థికాభివృద్ధి బ్యాంకులు తక్కువ ధరకే ఫైనాన్సింగ్‌ ను అందించవలసిన ప్రాముఖ్యత గురించి కూడా మంత్రి నొక్కి చెప్పారు. 

 

 

***


(Release ID: 1957934) Visitor Counter : 152