ప్రధాన మంత్రి కార్యాలయం

నేశనల్ జూడిశల్ డేటా గ్రిడ్ ప్లాట్ ఫార్మ్ పరిధి లోభారతదేశ సర్వోన్నత న్యాయస్థానం చేరడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 14 SEP 2023 2:48PM by PIB Hyderabad

పెండింగు లో ఉన్న కేసుల ట్రాకింగు కు తోడ్పాటు ను అందించేటటువంటి నేశనల్ జూడిశల్ డేటా గ్రిడ్ ప్లాట్ ఫార్మ్ పరిధి లో భారతదేశం యొక్క సర్వోన్నత న్యాయస్థానం చేరుతుంది అని భారతదేశం ప్రధాన న్యాయమూర్తి చేసిన ప్రకటన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఈ విధం గా ఉపయోగించుకోవడం వల్ల పారదర్శకత్వం అధికం అవుతుంది మరి మన దేశం లో న్యాయం అందజేత వ్యవస్థ లో వృద్ధి నమోదు అవుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ఎఎన్ఐ ఒక పోస్టు ను ఎక్స్ మాధ్యం లో పెట్టిన మీదట ఈ అంశం పై ప్రతిస్పందిస్తూప్రధాన మంత్రి -

 

‘‘సర్వోన్నత న్యాయస్థానం మరియు భారతదేశం ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) శ్రీ డి.వై. చంద్రచూడ్ తీసుకొన్న ఒక ప్రశంసనీయమైనటువంటి నిర్ణయం ఇది. సాంకేతిక విజ్ఞానాన్ని ఈ విధం గా ఉపయోగించుకోవడం వల్ల పారదర్శకత్వం పెరుగుతుంది మరి మన దేశం లో న్యాయాన్ని అందజేసే వ్యవస్థ లో వృద్ధి నమోదు అవుతుంది.’’ అని ఎక్స్ మాధ్యం లోనే ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/ST
 



(Release ID: 1957392) Visitor Counter : 134