శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ సాంకేతిక సామర్థ్యాలతో పాటు ఆర్థిక బలాన్ని నిన్న ముగిసిన జీ 20 ఇండియా శిఖరాగ్ర సదస్సు ప్రదర్శించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.


ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో, ఈ ప్రభుత్వం సాంప్రదాయ విజ్ఞానం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క అత్యాధునిక సాంకేతికత మధ్య మేలు కలయికను సంస్థాగతీకరించింది: డాక్టర్ జితేంద్ర సింగ్

‘ఒక వారం ఒక ల్యాబ్’ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత, వివిధ సీ ఎస్ ఐ ఆర్ ప్రయోగశాలల ప్రయత్నాలను ఏకీకృతం చేయడానికి డాక్టర్ జితేంద్ర సింగ్ ‘ఒక నెల ఒక అంశం’ కార్యక్రమాన్ని పాటించాలని ప్రతిపాదించారు.

ప్రతి సీ ఎస్ ఐ ఆర్ ల్యాబ్‌లు వేర్వేరు విశిష్ట ప్రత్యేకతని కలిగి ఉన్నప్పటికీ, చాలా వుమ్మడి అంశాలతో తదుపరి దశలో మేము థీమ్‌ల ఆధారంగా విస్తృత అనుసంధానం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ఒక్కొక్క సీ ఎస్ ఐ ఆర్ ల్యాబ్‌ 10 విజయగాథలను ప్రచారం చేయగలవని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు

Posted On: 11 SEP 2023 4:50PM by PIB Hyderabad

నిన్న ముగిసిన జీ 20 ఇండియా శిఖరాగ్ర సదస్సు, భారత్ యొక్క సాంకేతిక సామర్థ్యాలను అలాగే ఆర్థిక బలాన్ని ప్రదర్శించిందని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; పీ ఎం ఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, స్పేస్ మరియు అటామిక్ ఎనర్జీ డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, ఈ ప్రభుత్వం సాంప్రదాయ జ్ఞానం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క అత్యాధునికత మేలు కలయికను సంస్థాగతీకరించింది. ప్రస్తుతం టీ కే డి ఎల్  (ట్రెడిషన్ అండర్ ప్రిమల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ)గా పిలువబడే సాంప్రదాయ నాలెడ్జ్ లైబ్రరీ మనకు ఉంది. ఈ ప్రభుత్వం నిర్మించిన భారత మండపం లేదా కొన్ని తాజా స్మారక చిహ్నాలు కూడా తరతరాలుగా మనకు సంక్రమించిన సాంప్రదాయ వారసత్వంతో అత్యాధునిక వైజ్ఞానిక నైపుణ్యం, సాంకేతికత మరియు వాస్తుశిల్పాల యొక్క ఉత్తమ సమ్మిళితం ను సూచిస్తాయి, ”అని ఆయన నేడు న్యూఢిల్లీ లో జరిగిన'' సీ ఎస్ ఐ ఆర్ - -నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్ (సీ ఎస్ ఐ ఆర్ -  ఎన్ ఐ ఎస్ పీ ఆర్ ) ఒక వారం ఒక లాబ్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రసంగిస్తూ అన్నారు.

 

జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఆమోదించబడిన న్యూ ఢిల్లీ డిక్లరేషన్ భారతదేశం యొక్క 'లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మిషన్' (లైఫ్)ను అమలు చేయడానికి మరియు ఐక్యరాజ్యసమితి యొక్క సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కృత్రిమ మేధస్సును ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది. ' హరిత ప్రగతి ఒప్పందం' ను స్వీకరించడం ద్వారా, జీ 20 సుస్థిరమైన మరియు హరిత వృద్ధికి తన అంకిత భావాన్ని పునరుద్ఘాటించింది.

 

జీ 20 శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిపోజిటరీ ని నిర్మించడానికి మరియు నిర్వహించడానికి భారతదేశ ప్రణాళికకు మద్దతు ఇచ్చింది మరియు డబ్ల్యూహెచ్ఓ-నిర్వహించే ఫ్రేమ్‌వర్క్‌లో గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్ ఏర్పాటును స్వాగతించింది.

 

జి 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పిఎం మోడీ చొరవతో సింగపూర్, బంగ్లాదేశ్, ఇటలీ, యుఎస్ఎ, బ్రెజిల్, అర్జెంటీనా, మారిషస్ మరియు యుఎఇ నాయకులు ప్రపంచ జీవ ఇంధన కూటమి (జిబిఎ) ప్రారంభించడం ఒక మైలురాయి. జీ బీ ఏ జీవ ఇంధనాల అభివృద్ధి మరియు విస్తృతమైన కార్యాచరణ కోసం ప్రపంచ సహకారాన్ని ప్రోత్సహించే ఒక ఉత్ప్రేరక వేదికగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

“ప్రధాని మోదీ ఆధ్వర్యంలో భారతదేశం జీవ ఇంధనాల రంగానికి దిశానిర్దేశం లో ముందున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇన్నేళ్లుగా మనం అనుసరించిన పని విధానం నుండి మనం ప్రగతి దిశ గా ఎదుగుతున్న సందర్భం కూడా ఇదే"అని  అన్నారు. అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ సంస్థ ప్రభుత్వేతర సంస్థల నుండి 70 శాతం వరకు నిధులు సమీకరించుకుంటుందని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.

 

 

'వన్ వీక్ వన్ ల్యాబ్'  కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత, వివిధ సీ ఎస్ ఐ ఆర్ ప్రయోగశాలల ప్రయత్నాలను ఏకీకృతం చేయడానికి డాక్టర్ జితేంద్ర సింగ్ 'వన్ మంత్ వన్ థీమ్' కార్యక్రమాన్ని పాటించాలని ప్రతిపాదించారు.

 

"ప్రతి (సీ ఎస్ ఐ ఆర్) ల్యాబ్‌లు వేర్వేరు విశిష్ట ప్రత్యేకత ని కలిగి ఉన్నప్పటికీ, చాలా వుమ్మడి థీమ్‌ను కలిగి ఉన్నాయి, కాబట్టి తరువాతి దశలో, మేము థీమ్‌ల ఆధారంగా విస్తృత అనుసంధానం సాధిస్తాం," అని ఆయన చెప్పారు, ఆదిత్య ఇస్రో, డీ ఎస్ టీ సి ఎస్ ఐ ఆర్ నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్, టాటా ఇన్స్టిట్యూట్ మొదలైన వాటితో సహా అన్ని విభాగాలు వనరులను సేకరించి 'సమిష్టి శాస్త్ర'  విధానాన్ని మిషన్ వివరిస్తుంది.

 

సీ ఎస్ ఐ ఆర్

ఎన్ ఐ ఎస్ పీ ఆర్  దీప ధారిగా ఉంటుందని పేర్కొంటూ, సీ ఎస్ ఐ ఆర్ ల్యాబ్‌లు ఒక్కొక్కటి 10 విజయగాథలను ప్రచారం చేయగలవని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

“ ప్రయోగం ఎంత విలువైనది అయినప్పటికీ, అది ఎవరి కోసం ఉద్దేశించబడుతుందో వారికి చేరుకోకపోతే అది తన వాస్తవ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతుంది, లబ్ధిదారులను చేరుకోవాలనే ఆలోచన తో పని చేయాలని”అని ఆయన చెప్పారు.

 

ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ సైన్స్ మీడియా కమ్యూనికేషన్ సెల్‌ను ప్రారంభించి, అనేక ఎన్ ఐ ఎస్ పీ ఆర్  ప్రచురణలు మరియు జర్నల్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో  డిఎస్‌ఐఆర్ మరియు సిఎస్‌ఐఆర్ డిజి సెక్రటరీ డాక్టర్ ఎన్. కలైసెల్వి, సిఎస్‌ఐఆర్-ఎన్‌పిఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణు గోపాల్ ఆచంట మరియు సిఎస్‌ఐఆర్-ఎన్‌ఐఎస్‌సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్ వంటి ప్రముఖులు ప్రసంగించారు.

 

***


(Release ID: 1956448) Visitor Counter : 211