యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

19వ ఆసియా క్రీడల కోసం ఐ ఓ ఏ అధికారిక ఉత్సవ దుస్తులు మరియు క్రీడాకారులకు కిట్స్ ను ప్రత్యేకంగా రూపొందించింది.


ఆసియాడ్ కోసం 38 క్రీడా విభాగాలలో 634 మంది అథ్లెట్లతో కూడిన భారతదేశం యొక్క అతిపెద్ద బృందానికి వైభవోపేతమైన ఐ ఓ ఏ వీడ్కోలు వేడుకకు కేంద్ర క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఐ ఓ ఏ ప్రెసిడెంట్ పీ టీ ఉష హాజరయ్యారు .

ఇది కేవలం యూనిఫాం మాత్రమే కాదు, ఇది మన క్రీడాకారులకు సగర్వ గౌరవం మరియు గుర్తింపు కు చిహ్నం: శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 06 SEP 2023 1:44PM by PIB Hyderabad

సెప్టెంబరు 23 నుండి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న  2022 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందం కోసం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మంగళవారం (సెప్టెంబర్ 5) అధికారిక ఉత్సవ దుస్తులు మరియు క్రీడాకారులకు క్రీడా కిట్‌ను ఆవిష్కరించింది.

 

ఐ ఓ ఏ  వీడ్కోలు వేడుకను నిర్వహించింది, దీనికి కేంద్ర సమాచార & ప్రసారాలు మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, ఐ ఓ ఏ ప్రెసిడెంట్ మరియు ప్రముఖ పరుగు క్రీడాకారిణి పీ టీ ఉష మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

భారత హాకీ గోల్‌కీపర్లు పిఆర్ శ్రీజేష్ (పురుషులు), సవితా పునియా (మహిళలు), షూటింగ్ సంచలనం మను భాకర్ మరియు 2018 ఆసియా క్రీడల షాట్‌పుట్ స్వర్ణ పతక విజేత తజిందర్‌పాల్ సింగ్ టూర్ అనేక ఇతర విభాగాలకు చెందిన క్రీడాకారులలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.

 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ  మహిళల కోసం ఖాకీ ఆకృతి గల చీర మరియు మగ ఆటగాళ్లకు ఖాకీ కుర్తాలను వేడుక దుస్తులుగా ప్రత్యేకంగా  రూపొందించారు.

 

పురుష కోసం అథ్లెట్ల బంధ్‌గాలా జాకెట్ మరియు మహిళల కోసం హై నెక్ బ్లౌజ్ భారతీయ మూలాంశాలను సజావుగా మిళితం చేస్తూ రూపొందించారు.  ప్రపంచ వేదికపై భారతదేశ ఘన సాంస్కృతిక వస్త్రాన్ని సూచించే అత్యుత్తమ భారతీయ ఛాయాచిత్రాలతో ముద్రించబడ్డాయి. సుస్థిరత్వాన్ని ప్రకృతి అనుకూలతను ప్రోత్సహించే రీసైకిల్ ఫ్యాబ్రిక్‌లతో దుస్తులను రూపొందించారు.

 

ఈ సందర్భంగా శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, “ఇది కేవలం యూనిఫాం మాత్రమే కాదు, ఇది మన క్రీడాకారులకు గర్వం మరియు గుర్తింపునకు చిహ్నం. యూనిఫాం భారతదేశం యొక్క స్వావలంబనను సగర్వంగా సూచిస్తుంది. దేశ వైవిధ్య ఘన వారసత్వం అలాగే మన వస్త్ర సౌందర్య నాయకత్వాన్ని ప్రదర్శిస్తుంది. జట్టు యువ మరియు నవ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని నాకు నమ్మకం ఉంది. మన   క్రీడాకారులు గత చారిత్రాత్మక పతకాల స్థాయి లో ప్రదర్శన వుంటుంది అలాగే మరింత ఎక్కువ పతకాలతో తిరిగి వస్తాము. మన అథ్లెట్లకు వెన్నుదన్నుగా నిలవాలని, వారిని ఉత్సాహపరచాలని నేను దేశాన్ని కోరుతున్నాను.

 

క్రీడాకారులకు అధికారిక స్పోర్ట్స్ అపెరల్ పార్ట్‌నర్‌ జే ఎస్ డబ్ల్యూ ఇన్‌స్పైర్చే రూపొందించబడిన ప్లేయింగ్ కిట్‌ను, భారత క్రికెట్ జట్టు జెర్సీని కూడా రూపొందించిన ప్రతిభావంతులైన కాశ్మీరీ డిజైనర్ ఆకిబ్ వానీ రూపొందించారు. ఇది మన దేశ సుసంపన్నత ను నిర్వచించే అద్భుతమైన వైవిధ్యం మరియు ఏకత్వానికి దృశ్యమానం చేసే  వైవిధ్యభరితమైన కళారూపాల నుండి ప్రేరణ పొందింది.  ప్రతి క్రీడాకారుడు తమ సొంత రాష్ట్రంలోని కొంత భాగాన్ని మైదానంలోకి తీసుకువెళ్తున్నట్టు భావించే విధంగా రూపొందించారు.

 

ఐఓఏ ప్రెసిడెంట్ డా.పి.టి.ఉష మాట్లాడుతూ, భారతదేశం గర్వించేలా చేసేందుకు ప్రతి క్రీడాకారుడు ఉత్తమ ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. "మేము 2022 ఆసియా క్రీడల కోసం చాలా కాలం నుంచి వేచి ఉన్నాము. భారతదేశం 634 మంది అథ్లెట్లను తన అతిపెద్ద జట్టును పంపుతున్నందుకు సంతోషిస్తున్నాము. ఈ జట్టు భారత్‌కు అత్యుత్తమ పతకాలను సాధించే అవకాశం ఉందని మేము నమ్ముతున్నాము, ”అని ఆమె చెప్పారు. "మన క్రీడాకారులే  మనకు సర్వసం వారిని బాగా చూసుకునేందుకు మేము అన్ని ప్రయత్నాలు చేసాము." రోయింగ్‌లో 33 మంది సభ్యులతో,  అథ్లెటిక్స్ తర్వాత అతిపెద్ద యూనిట్‌గా హాంగ్‌జౌ వెళ్లి పతకాన్ని సాధించవచ్చు.  15 మంది సభ్యుల ఎస్పోర్ట్స్ బృందం కూడా ఆసియా క్రీడలలో మంచి. ప్రతిభను కనబరిచగలదు. 2018లో జరిగిన ఆసియా క్రీడల చివరి ఎడిషన్‌లో 16 స్వర్ణాలతో సహా 70 పతకాలను భారత బృందం కైవసం చేసుకుంది. జే ఎస్ డబ్ల్యూ ఇన్‌స్పైర్, రిలయన్స్ ఫౌండేషన్, అదానీ స్పోర్ట్స్‌లైన్ మరియు శాంసోనైట్ 2022 ఆసియా క్రీడలకు టీమ్ ఇండియాకు ప్రధాన స్పాన్సర్‌లుగా ఉండగా, బోరోసిల్, స్కేచర్స్, అమూల్, ఎస్ ఎఫ్ ఏ, ఐనాక్స్ గ్రూప్ మరియు ది లీలా ప్యాలెస్ హోటల్స్ మరియు రిసార్ట్‌లు అసోసియేట్ స్పాన్సర్‌లు మరియు భాగస్వాములుగా చేతులు కలిపాయి.

 

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐ ఓ ఏ)  అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐ ఓ సి), కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా మరియు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఒలింపిక్ కమిటీల  యొక్క అనుబంధ సభ్యునిగా ఉన్న పాలకమండలి. 1927లో స్థాపించబడిన ఐ ఓ ఏని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇది భారతదేశంలో స్పోర్ట్స్ నిర్వహణ మరియు అథ్లెట్ల సంక్షేమం యొక్క వివిధ అంశాలను నిర్వహిస్తుంది. ఐ ఓ సి, సీ జీ ఎఫ్, ఓ సీ ఏ మరియు ఏ ఎన్ ఓ సి యొక్క ఒలింపిక్ క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలు మరియు ఇతర అంతర్జాతీయ బహుళ-క్రీడా ఈవెంట్‌లలో పాల్గొనే క్రీడాకారులు లేదా జట్ల ప్రాతినిధ్యాన్ని కూడా పర్యవేక్షిస్తుంది. ఐ ఓ సి మరియు ఓ సీ ఏ సభ్యునిగా, ఐ ఓ ఏ యొక్క ప్రాథమిక లక్ష్యం దేశంలో ఒలింపిక్ ఉద్యమాన్ని అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం మరియు రక్షించడం. ఐ ఓ ఏ క్రీడా విద్య మరియు ఒలింపిక్ అధ్యయనాల అభివృద్ధికి వివిధ వాటాదారులతో వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంది.

****


(Release ID: 1955232) Visitor Counter : 140