ప్రధాన మంత్రి కార్యాలయం
‘నా మట్టి-నా దేశం’ కార్యక్రమంలో పాల్గొనండి: పౌరులకు ప్రధాని పిలుపు
Posted On:
01 SEP 2023 8:19PM by PIB Hyderabad
‘నా మట్టి-నా దేశం’ కార్యక్రమంలో ప్రజలంతా పాలు పంచుకుని, విజయవంతం చేయాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ ఆదర్శాన్ని దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టితో రూపొందించిన ‘వాటిక’ సాకారం చేయగలదని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ మేరకు దేశీయాంగ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ‘ఎక్స్’ ద్వారా చేసిన పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“అనేకానేక శుభాకాంక్షలు! ‘నా మట్టి-నా దేశం’ కార్యక్రమం మన ఐక్యత-సమగ్రతలను మరింత బలోపేతం చేస్తుంది. ఈ కార్యక్రమం కింద దేశం నలుమూలల నుంచి సేకరించిన మట్టితో ఒక ‘అమృత వనం’ సృష్టించబడుతుందని నా దృశ విశ్వాసం. ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ భావనను ఇది సాకారం చేస్తుంది. ఈ ‘అమృత కలశ యాత్ర’లో మనమంతా పెద్దఎత్తున భాగస్వాములం అవుదాం” అని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
(Release ID: 1954481)
Visitor Counter : 286
Read this release in:
Marathi
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam