రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే బోర్డు చైర్ పర్సన్, సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి జయ వర్మ సిన్హా అత్యున్నత పదవిలో నియమితులైన మొదటి మహిళ శ్రీమతి జయ వర్మ సిన్హా
Posted On:
01 SEP 2023 11:06AM by PIB Hyderabad
రైల్వే బోర్డు చైర్ పర్సన్, సీఈఓగా శ్రీమతి జయ వర్మ సిన్హా ఈరోజు బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ నియామకాల కమిటీ శ్రీమతి నియామకానికి ఆమోదం తెలిపింది. అత్యున్నత రైల్వే బోర్డు చైర్‌పర్సన్,సీఈఓగా నియమితులైన మొదటి మహిళ శ్రీమతి జయ వర్మ సిన్హా.
దీనికి ముందు శ్రీమతి. జయవర్మ సిన్హా రైల్వే బోర్డు సభ్యురాలిగా (ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్) పనిచేశారు.భారతీయ రైల్వేల సరుకు రవాణా, ప్రయాణీకుల సేవలను శ్రీమతి సిన్హా పర్యవేక్షించారు.
శ్రీమతి జయ వర్మ సిన్హా 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్ టీఎస్)లో చేరారు. భారతీయ రైల్వేకు 35 సంవత్సరాలకు పైగా ఆమె సేవలు అందిస్తూ వస్తున్నారు. రైల్వే బోర్డ్ మెంబర్ (ఆపరేషన్స్ బిజినెస్ డెవలప్‌మెంట్), , ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అదనపు సభ్యురాలు , వంటి పలు కీలక పదవుల్లో శ్రీమతి జయ వర్మ సిన్హా పనిచేశారు. రైల్వే బోర్డులో వాణిజ్య, ఐటీ, విజిలెన్స్‌లో విస్తరించి ఉన్న విభిన్న పదవులను ఆమె నిర్వర్తించారు.ఆగ్నేయ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా నియమితులైన మొదటి మహిళ కూడా శ్రీమతి జయ వర్మ సిన్హా గుర్తింపు పొందారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా శ్రీమతి జయ వర్మ సిన్హా పని చేసిన సమయంలో కోల్‌కతా నుండి ఢాకా వరకు ప్రసిద్ధ మైత్రి ఎక్స్‌ప్రెస్ ప్రారంభమయింది.
అలహాబాద్ విశ్వవిద్యాలయం లో చదివిన శ్రీమతి సిన్హా ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి చూపిస్తారు.
***
(Release ID: 1954051)
Visitor Counter : 268