ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్ధిక సంవ‌త్స‌రం 2023-24లో 2023 జూలై వరకు కేంద్ర ప్ర‌భుత్వ ఖాతాల నెల‌వారీ స‌మీక్ష‌

Posted On: 31 AUG 2023 5:02PM by PIB Hyderabad

 ఆర్ధిక సంవ‌త్స‌రం 2023-24లో  2023 జూలై వరకు ఏకీకృతం చేసిన  కేంద్ర ప్ర‌భుత్వ ఖాతాల నెల‌వారీ స‌మీక్ష‌ నివేదిక విడుదల అయ్యింది. ముఖ్యాంశాల‌ను  దిగువ‌న  ఇవ్వ‌డం జ‌రిగిందిః -

కేంద్ర ప్రభుత్వానికి 2023 జూలై వరకు  7,75,107 కోట్ల‌ రూపాయల ఆదాయం  ( 2023-24 మొత్తం ఆదాయంలో 28.5% లో 6.3%) సమకూరింది. దీనిలో పన్నుల రూపంలో   రూ.5,82,585 కోట్ల ఆదాయం (కేంద్రానికి నిక‌రంగా), రూ. 1,78,804  ప‌న్నేత‌ర ఆదాయం, రూ.  13,718   రుణ ర‌హిత మూల‌ధ‌న ఆదాయం ఉంది.  రుణ ర‌హిత మూల‌ధ‌న ఆదాయంలో  రూ.8,253 కోట్ల రుణాల వ‌సూలు కాగా, రూ.5,465 కోట్లు ఇత‌ర మూల‌ధ‌న ర‌శీదులు ఉన్నాయి.  ప‌న్నుల వాటా  పంపిణీలో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రూ.3,09,521 కోట్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కూ కేంద్రం  బ‌దిలీ చేసింది. . ఇది గ‌త ఏడాది  ఇదే కాలంలో బ‌దిలీ చేసిన మొత్తంతో పోలిస్తే ఈ మొత్తం రూ.1,08,413 కోట్లు ఎక్కువ‌.

కేంద్ర ప్ర‌భుత్వం వెచ్చించిన మొత్తం వ్య‌యం రూ. 13,80,700 కోట్లు ( 2023-24 లో 30. 7%)గా ఉంది. ఇందులో రూ. 10,63,621 కోట్లు ఆదాయ‌పు ఖాతా,,రూ. 3,17,079 కోట్లు మూల‌ధ‌న ఖాతా వ్యయాలుగా ఉన్నాయి. మొత్తం రెవెన్యూ వ్యయంలో  రూ2,99,889 కోట్లు వ‌డ్డీ చెల్లింపులు, రూ. 1,40,996 కోట్లు ప్ర‌ధాన స‌బ్సిడీల రూపంలో  ఖ‌ర్చు అయ్యాయి.

 

***


(Release ID: 1953939) Visitor Counter : 121