అంతరిక్ష విభాగం
సూర్యుడిపై తొలి మిషన్‌ను ప్రారంభించేందుకు ఇస్రో సిద్ధం
Posted On:
29 AUG 2023 5:12PM by PIB Hyderabad
చంద్రయాన్ మిషన్ విజయవంతం అయిన స్వల్ప కాలంలోనే, భారత్ సూర్యుడిపై తన తొలి మిషన్ ఆదిత్య - ఎల్2తో సిద్దంగా ఉందని, దానిని ప్రయోగించేందుకు ఇస్రో సంసిద్ధంగా ఉందని, బహుశ అది 2 సెప్టెంబర్ నాడు జరగవచ్చని కేంద్ర శాస్త్ర& సాంకేతిక శాఖ సహాయమంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి), పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
మైన్‌పురీలో జరిగిన ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రపంచమంతా భారత చంద్రయాన్ మిషన్‌ను వేడుకగా జరుపుకోవడంతో, సన్ మిషన్‌పై ప్రజల ఆసక్తి రెట్టింపు అయిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
ఈ విజయానికి పూర్తి కీర్తిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి కట్టబెడుతూ, మరే ప్రభుత్వం చేయని విధంగా గతకాలపు సంకెళ్ళ నుంచి భారతదేశ అంతరిక్ష రంగాన్ని విముక్తం చేసే సాహసోపేత నిర్ణయాన్ని ప్రధానమంత్రి తీసుకోకపోయి ఉంటే ఇదంతా సాధ్యపడేది కాదని అన్నారు.
దీని ఫలితంగా, నేడు నాలుగేళ్ళ స్వల్పకాలంలోనే ఇస్రో ఆర్ధిక వనరులు పెరిగాయని, స్టార్టప్‌ల సంఖ్య 4 నుంచి 150కి పెరిగిందని, భారతదేశ ఉపగ్రహ ప్రయోగ సౌకర్యం హఠాత్తుగా ఎదిగిపోయిందని, ఐరోపా ఉపగ్రహాలను కూడా ప్రయోగించే స్థాయికి వెళ్ళిందని అన్నారు. భారత్ 260 మిలియన్ యూరోలకు పైగా తన ప్రయోగాలతో ఆర్జించగా, అమెరికన్ ఉపగ్రహం ప్రయోగించినందుకు భారత్ 150 మిలియన్ డాలర్లకన్నా అధికంగా ఆర్జించింది.
శాస్త్రవేత్తల సమాజపు గౌరవాన్ని ప్రధాని మోడీ పెంచినందుకే, నేడు సూర్యుడిపైకి తొలి అంతరిక్ష మిషన్‌ను ప్రయోగించే ఆత్మవిశ్వాసం, నమ్మకం మనకు వచ్చాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
తొలి సూర్యుడి అంతరిక్ష మిషన్ ఆదిత్య ఎల్-1, ఏడు పేలోడ్లు (ఏడు రకాల పరికరాల)తో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్‌వి)ని ఉపయోగించనున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. సూర్యుడు- భూమి వ్యవస్థలో లాగరేంజ్ పాయింట్ 1 (ఎల్ 1- కేంద్ర పరాజ్ముఖ బలాన్ని సమతులం చేసే కేంద్రం) చుట్టూ గల కాంతివలయంపై అంతరిక్షణ నైక ఆధారపడుతుందని, ఇది భూమి నుంచి 1.5 మిలియన్ కిలో మీటర్లలో ఉంటుందని, కాంతివలయంలో ఉపగ్రహాన్ని ఉంచడం వల్ల ఎటువంటి గ్రహణాలూ అడ్డురాకుండా నిరంతరం సూర్యుడిని చూసే ప్రధాన లాభం ఉంటుందని ఆయన చెప్పారు.
కుజ, చంద్ర మిషన్ల తర్వాత, ఆదిత్య ఎల్-1 అటువంటి మూడవ మిషన్ అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అది సూర్యుడి నుంచి వచ్చే శక్తి/ ఇంధన మూలాలను అధ్యయనం చేస్తుందన్నారు.
****
(Release ID: 1953400)
Visitor Counter : 233