మంత్రిమండలి
azadi ka amrit mahotsav

చంద్రయాన్-3 మిశన్ యొక్క చరిత్రాత్మక సాఫల్యాన్ని ఉత్సవం గా జరుపుకోవడంపై  మంత్రిమండలి తీర్మానం

Posted On: 29 AUG 2023 4:09PM by PIB Hyderabad

జాబిల్లి చెంత కు చేరుకోవడం కోసం తలపెట్టిన చంద్రయాన్-3 మిశన్ యొక్క చరిత్రాత్మక సాఫల్యాన్ని యావత్తు దేశం ఒక ఉత్సవం వలె జరుపుకొంటున్నది. కేంద్ర మంత్రిమండలి కూడా ఈ సంబురం లో మమేకం అయింది. మన శాస్త్రవేత్త ల యొక్క ఈ సుప్రతిష్ఠిత కార్యసాధన ను మంత్రిమండలి ప్రశంసిస్తున్నది. ఇది మన స్పేస్ ఏజెన్సీ యొక్క విజయం మాత్రమే కాదు, ఇది భారతదేశం యొక్క పురోగతి లో ఒక ప్రకాశవంతమైన సూచిక; అంతేకాకుండా, ప్రపంచ రంగస్థలం మీద మన బలాని కి గుర్తు గా కూడా ఉన్నది. ఆగస్టు 23 వ తేదీ ని ‘‘జాతీయ అంతరిక్ష దినం’’ గా పాటించనుండడాన్ని మంత్రిమండలి స్వాగతిస్తున్నది.

 

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ.. ‘ఇస్ రో’) యొక్క ప్రయాసల కు గాను మంత్రిమండలి ఇస్ రో కు అనేకానేక అభినందనల ను తెలియజేస్తున్నది. మన శాస్త్రవేత్త ల నిరంతర కృషి ఫలితం గా, చంద్రుని దక్షిణ ధృవాని కి సమీపం లో అడుగిడిన ప్రపంచం లోని ఒకటో దేశం అన్న ఖ్యాతి ని భారతదేశం సంపాదించుకొన్నది. జాబిల్లి పై కాలుపెటట్టడం, అదీను ముందు గా నిర్దేశించుకొన్న పరామితుల ను తు.చ. తప్పక అనుసరిస్తూ ఆ కార్యాన్ని పూర్తి చేయడం దాని కి అదే ఒక మహత్తరమైన కార్యసిద్ధి అని చెప్పాలి. అన్ని సవాళ్ల ను అతిగమిస్తూ చందమామ యొక్క దక్షిణ ధృవాని కి దగ్గర లో కాలూనడం అనేది మన శాస్త్రవేత్త లు జ్ఞానాన్ని అన్వేషించడం కోసం ప్రతి ఒక్క హద్దు ను దాటిపోవడానికి ఎలాగ తయారు గా ఉంటారో అనే భావన కు ఒక నిదర్శన గా ఉన్నది. ప్రజ్ఞాన్రోవర్ ద్వారా మనకు ఏ యే సమాచారాల సంబంధి ఖజానా అందుబాటు లోకి వస్తూ ఉందో వాటి అండదండల తో మన జ్ఞానాన్ని విస్తరింపచేసుకొంటూ అపూర్వమైన విషయాల ను కనుగొనేందుకు ఒక బాట సిద్ధమై, చంద్ర గ్రహం తాలూకు రహస్యాల ను గ్రహించడం తో పాటు గా మునుముందుకు దూసుకు పోవడం లో కూడాను తోడ్పాటు లభించ గలదు.

 

వేగం గా మారిపోతున్నటువంటి సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణ ల కాలం లో మన శాస్త్రవేత్త లు జ్ఞానాని కి, సమర్పణ భావాని కి మరియు ప్రావీణ్యాని కి ఉజ్వల మార్గదర్శులు గా నిలచారని మంత్రిమండలి గట్టిగా నమ్ముతున్నది. వారి యొక్క విశ్లేషణ సామర్థ్యం, సరిక్రొత్త వెదకులాట ల పట్ల వారి లో ఉన్న నిబద్దత .. ఇవి దేశాన్ని విజ్ఞానశాస్త్రం రంగం లో పురోగమింప చేస్తున్నవి. అన్నిటి కంటే మెరుగైన కార్యాల ను సాధించాలనే భావన, ఎల్ల వేళ ల సరిక్రొత్త అన్వేషణల లో తల మునుకలు గా ఉండడం, ఇంకా సవాళ్ల కు ఎదురొడ్డి నిలచే స్వభావం లతో ప్రపంచం అంతటా వారి యొక్క గౌరవం ఇనుమడించింది. వారి సాఫల్యం ఇతరుల కు కూడా పెద్ద పెద్ద ఆలోచనల ను చేసేందుకు మరియు ఆ యొక్క కలల ను పండించుకొనేందుకు ప్రేరణ ను ఇచ్చాయి.

 

భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమం చంద్రయాన్-3 యొక్క విజయం లో మహిళా శాస్త్రవేత్త లు పెద్ద సంఖ్య లో వారి యొక్క తోడ్పాటు ను అందించడం చూస్తే అది మంత్రిమండలి కి గర్వకారణం గా ఉంది. అంతేకాదు, ఈ కార్యసిద్ధి రాబోయే సంవత్సరాల లో కూడాను మహత్త్వాకాంక్ష కలిగిన మహిళా శాస్త్రవేత్తల కు అనేక మంది కి స్ఫూర్తి ని ఇస్తూనే ఉంటుంది.

 

భారతదేశం యొక్క అంతరిక్ష కార్యక్రమం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క దృష్టికోణాని కి మరియు మార్గదర్శక ప్రాయమైనటువంటి ఆయన యొక్క నాయకత్వానికి గాను మంత్రిమండలి ఆయన పట్ల అభినందనల ను వ్యక్తం చేస్తున్నది. ఆయన నేతృత్వం లో ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ యావత్తు మానవ జాతి యొక్క సంక్షేమాని కి సంకల్పాన్ని చెప్పుకొని ముందుకు కదులుతున్నది. ప్రధాన మంత్రి యొక్క అచంచలమైనటువంటి బరోసా మన శాస్త్రవేత్తల కు ప్రతి సారి సర్వశ్రేష్ఠం అయినటువంటి పనితీరు ను కనబరచేందుకు ప్రేరణ ను ఇస్తున్నది.

 

గడచిన 22 సంవత్సరాల కాలం లో, మొదట గుజరాత్ కు ముఖ్యమంత్రి గాను మరి ఆ తరువాత భారతదేశాని కి ప్రధాన మంత్రి గాను శ్రీ నరేంద్ర మోదీ కి చంద్రయాన్ మిశన్ లు అన్నిటితోను భావోద్వేగ పరమైన అనుబంధం ఉంటూ వస్తున్నది. పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారు ఈ తరహా మిశన్ ను ఒకదాని ని గురించి తొలుత ప్రకటించినప్పుడు, శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ కు ముఖ్యమంత్రి గా సేవల ను అందిస్తూ ఉన్నారు. 2008 వ సంవత్సరం లో చంద్రయాన్- 1 ని ఫలప్రదం గా పరీక్షించగా ఆయన ఇస్ రో కు వెళ్లి శాస్త్రవేత్తల కు అభినందనల ను తెలియజేశారు. 2019 వ సంవత్సరం లో చంద్రయాన్- 2 మిశన్ తన లక్ష్యాల వద్దకు చేరుకోలేకపోయినప్పుడు, ప్రధాన మంత్రి నుండి శాస్త్రవేత్తల కు లభించిన ఊరడింపు మన శాస్త్రవేత్తల లో స్థైర్యాన్ని బలపరచింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రేరణ మన శాస్త్రవేత్తల లో చంద్రయాన్ మిశన్ పరం గా క్రొత్త శక్తి ని నింపివేసింది.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్ల వేళ ల విజ్ఞానశాస్త్రాని కి మరియు నూతన ఆవిష్కరణల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ వచ్చారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో దేశం లో ప్రవేశపెట్టిన అనేక సంస్కరణ లు పరిశోధనల ను, నూతన ఆవిష్కరణల ను సులభతరం చేసి వేశాయి. అంతరిక్ష రంగం లో ప్రైవేటు రంగాని కి మరియు మన స్టార్ట్-అప్ సంస్థల కు మరిన్ని అవకాశాలు దక్కే విధం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్య ల ను చేపట్టారు. ప్రధాన మంత్రి యొక్క మార్గదర్శకత్వం లో, అంతరిక్ష విభాగం అధీనం లో పని చేసే ఒక స్వతంత్ర సంస్థ రూపం లో ఇన్-స్పేస్ (IN-SPACe) ను 2020 వ సంవత్సరం జూన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్-స్పేస్ ఉద్దేశ్యమల్లా పరిశ్రమ, విద్య బోధన రంగం మరియు స్టార్ట్- అప్ ల తో ఒక ఇకో-సిస్టమ్ ను రూపొందించడమూ; ఆ ఇకో-సిస్టమ్ వల్ల భారతదేశం గ్లోబల్ స్పేస్ ఇకానమి లో తన వంతు భాగస్వామ్యాన్ని పెంచుకోవడమూను. అంతరిక్ష రంగం లో భారతదేశాన్ని సరిక్రొత్త శిఖరాల కు చేర్చే మాధ్యం గా ఇన్- స్పేస్ మారింది. హ్యాకథన్ లపై శ్రద్ధ తీసుకోవడం తో భారతదేశం లో యువతీ యువకుల కు అనేక అవకాశాల కు తలుపు లు తెరచుకొన్నాయి.

 

చంద్రుని ఉపరితలం పైన రెండు బిందువుల కు తిరంగాపాయింట్’ (చంద్రయాన్-2 యొక్క పాదముద్ర) అని, శివశక్తిపాయింట్ (చంద్రయాన్-3 అడుగుపెట్టిన ప్రదేశం) అని పేరుల ను పెట్టడాన్ని కూడా మంత్రిమండలి స్వాగతిస్తున్నది. ఈ పేరుల ను పెట్టడం మన గౌరవశాలి ఇతిహాసాని కి మరియు ఆదునికత కలగలసిన భావన కు.. ఈ రెంటి కి కూడాను అనుగుణం గా ఉన్నది. ఈ పేరు లు ఒక్క నామాలు మాత్రమే కాక అంత కంటే ఎక్కువ. అవి వేల సంవత్సరాల మన వారసత్వం మరియు ఈనాటి మన విజ్ఞానశాస్త్ర సంబంధి మహత్త్వాకాంక్షల తో కూడిన భారతదేశాన్ని ఒక సూత్రం లో ముడి పెడుతున్నాయి.

 

చంద్రయాన్-3 యొక్క సాఫల్యం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క ‘‘జయ్ విజ్ఞాన్, జయ్ అనుసంధాన్’’ విజన్ యొక్క సఫలత గా కూడా ఉంది. ఈ సాఫల్యం తో మన స్టార్ట్-అప్ సంస్థల కు మరియు ఎమ్ఎస్ఎమ్ఇ లకు నూతన మార్గాలు ఆహ్వానాన్ని పలుకుతున్నాయి. ఈ సాఫల్యం తో భారతదేశం లోని యువత కు ముందడుగు వేసేందుకు అంతు లేని అవకాశాలు అందిరాబోతున్నాయి. రాబోయే కాలం లో అంతరిక్ష రంగం క్రొత్త క్రొత్త విషయాల ను కనుగొనే మరియు లక్షల కొద్దీ యువతీ యువకుల కై ఉపాధి అవకాశాల ను అందుబాటులోకి తీసుకు వచ్చే మాధ్యం గా మారగలదు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరో మారు వసుధైవ కుటుంబకమ్ భావన ను సాకారం చేశారు. చంద్రయాన్-3 మిశన్ యొక్క విజయం తో అందేటటువంటి జ్ఞానం విస్తృత మానవాళి కి మేలు చేయడం కోసం, మరీ ముఖ్యం గా అంతగా అభివృద్ధి చెందని గ్లోబల్ సౌథ్ దేశాల శ్రేయానికై ఎక్కడలేని లాభాల ను కొనితేగలదు. భారతదేశం లో అవుతున్న అభివృద్ధి మొత్తం ప్రపంచం యొక్క సంక్షేమానికి బాట ను పరచగలదు.

 

అంతరిక్ష రంగం లో భారతదేశం వేస్తున్న ముందంజ లు కేవలం విజ్ఞానశాస్త్రం సంబంధి మహత్తర కార్యసాధన ల కంటే మిన్న అయినటువంటివి అని మంత్రిమండలి నమ్ముతున్నది. అవి పురోగతి కి, ఆత్మనిర్భరత కు మరియు ప్రపంచ నేతృత్వం యొక్క దృష్టికోణాని కి అద్దం పడుతున్నాయి. అవి ఉనికి లోకి వస్తున్నటువంటి న్యూ ఇండియాకు కూడా ప్రతీక లు గా కూడాను ఉన్నాయి. ఈ అవాకాశాన్నుండి బోలెడన్ని లాభాల ను పొందవలసిందిగా భారతదేశం యొక్క పౌరుల కు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. అదే జరిగితే రాబోయే కాలం లో మానవ నిర్మిత ఉపగ్రహాల తాలూకు కమ్యూనికేశన్ మరియు వాతావరణ అధ్యయనం సంబంధి విజ్ఞానశాస్త్రం మొదలు వ్యవసాయం, ఇంకా విపత్తుల నిర్వహణ వరకు విభిన్న రంగాల లో క్రొత్త క్రొత్త అవకాశాలు ఏర్పడగలవు. మన నూతన ఆవిష్కరణ ల ప్రభావం క్షేత్ర స్థాయి లో నేరు ప్రభావాన్ని ప్రసరించేటట్టుగాను, అవి మన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను బలపరచేవిగాను, మన డిజిటల్ ఇకానమి ని పటిష్టపరచేటటువంటివి గాను ఉండడం తో పాటు గా వివిధ రంగాల కు క్రిటికల్ డేటా ను అందించేవి గా కూడాను ఉండేలా మనం పూచీ పడవలసి ఉన్నది.

విజ్ఞానశాస్త్రం, సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కరణల తో కూడిన ఈ యుగం లో, మంత్రిమండలి విద్య జగతి తో అనుబంధం కలిగిన మహానుభావుల కు చేస్తున్న విజ్ఞప్తి ఏమిటి అంటే వారు దేశ యువజనుల కు విజ్ఞానశాస్త్రం తో జతపడేటట్లు గా వారి లో ప్రేరణ ను పాదుగొల్పాలన్నదే. చంద్రయాన్-3 యొక్క సాఫల్యం అంతరిక్ష రంగం లో యువత కు ఆసక్తి ని పెంచివేసేందుకు మనకు ఒక చాలా పెద్దదైనటువంటి అవకాశాన్ని అందించేసింది. అంతరిక్షం మరియు విజ్ఞానశాస్త్రం రంగాల లో యువతరం లో ఆకర్షణ పెరిగిందా అంటే మన దేశం ఉన్నతి కి క్రొత్త అవకాశాలు లభిస్తాయన్న మాటే.

 

ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి చంద్రయాన్ మిశన్ తో జతపడిన ప్రతి ఒక్క వ్యక్తి అందించినటువంటి తోడ్పాటు కు వారందరి కి పేరు పేరు న ప్రశంసల ను మరియు అభినందనల ను మంత్రిమండలి తెలియజేస్తున్నది. చంద్రయాన్-3 తాలూకు సాఫల్యం భారతదేశం తన సామర్థ్యం తో, మక్కువ తో మరియు సమర్పణ భావం తో ఏదయినా సాధించగలుగుతుంది అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తున్నది. చంద్రయాన్ గెలుపు తరువాత ఉత్సాహం తో మరియు గర్వం తో ఉప్పొంగుతున్న మన దేశం యొక్క పౌరులు కలిసికట్టు గా 2047వ సంవత్సరానికల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి దేశం గా ఆవిష్కరించాలన్న సంకల్పాన్ని తప్పక నెరవేర్చడానికి వారి ని వారు పునరంకితం చేసుకొంటారన్న విశ్వాసాన్ని మంత్రిమండలి వ్యక్తం చేస్తున్నది.

 

***

 


(Release ID: 1953300) Visitor Counter : 261