భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
“పిఎల్‌ఐ-ఆటో స్కీమ్ సమీక్ష - ఆత్మనిర్భర్త ద్వారా శ్రేష్ఠత” అనే అంశంపై రేపు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సదస్సు
- సదస్సుకు అధ్యక్షత వహించనున్న డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే
- పిఎల్‌ఐ పథకం పనితీరు సమీక్షించడానికి భాగస్వామ్య పక్షాల వారందరినీ ఒకచోట చేర్చడమే లక్ష్యంగా సదస్సు
Posted On:
28 AUG 2023 1:01PM by PIB Hyderabad
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఐ) రేపు అంటే ఆగస్టు 29, 2023న ఇండియా హాబిటాట్ సెంటర్‌లో పిఎల్ఐ-ఆటో స్కీమ్ సమీక్ష - ఆత్మనిర్భర్త ద్వారా శ్రేష్ఠత” అనే అంశంపై సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే అధ్యక్షత వహిస్తారు. భాగస్వామ్య పక్షాల వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడాన్ని ఈ సదస్సు లక్ష్యంగా పెట్టుకుంది. పీఎల్ఐ-ఆటో దరఖాస్తుదారులు, పీఎంఏ, టెస్ట్ ఏజెన్సీలు మొదలైనవి పథకం పనితీరును సమీక్షించడానికి, వారి జ్ఞానం & అనుభవాలను పంచుకోవడానికి, అన్ని సందేహాలను& సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. ఈ పథకం ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను అర్థం చేసుకోవడంపై ఈవెంట్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఎంహెచ్ఐ క్లీనర్ మొబిలిటీని ప్రోత్సహించడానికి, ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ యొక్క పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వివిధ కార్యక్రమాలను చేపట్టింది. ఆటోమోటివ్ రంగంలో మంత్రిత్వ శాఖ వివిధ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్లను ప్రారంభించింది. వాటిలో ఒకటి ఆటోమొబైల్ & ఆటో కాంపోనెంట్ల కోసం పిఎల్ఐ పథకం (రూ. 25,938 కోట్లు). ఈ పథకాల యొక్క క్యాస్కేడింగ్ ప్రభావం ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి దారి తీస్తుంది. 2030 నాటికి భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచేలా చేస్తుంది. ఎంహెచ్ఐ ఆటోమోటివ్ ఇండస్ట్రీ యొక్క పిఎల్ఐ-ఆటో దరఖాస్తుదారులను పథకం యొక్క కీలకమైన వాటాదారులలో ఒకరిగా పరిగణిస్తుంది. ప్రధానమంత్రి ఊహించిన విధంగా "ఆత్మనిర్భర్త ద్వారా శ్రేష్ఠత" అనే విజన్ను నెరవేర్చడానికి పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి ఎంహెచ్ఐ కట్టుబడి ఉంది. ఎంహెచ్ఐ ప్రకారం, ఆటోమోటివ్ పరిశ్రమ మద్దతు మరియు వృద్ధి లేకుండా దేశంలో అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏఏటీ) ఉత్పత్తుల యొక్క లోతైన స్థానికీకరణ మరియు అభివృద్ధి అనే లక్ష్యం సాధించబడదు. ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీని పెంపొందించడానికి ఆర్థిక మద్దతుతో పాటు అనుకూలమైన వాతావరణాన్ని అందించడం ద్వారా ఈ ముఖ్యమైన పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకుంటుంది.
***
(Release ID: 1953071)
Visitor Counter : 132