సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పారిశుధ్య కార్యకలాపాల యాంత్రీకరణకు జాతీయ కార్యాచరణ (నమస్తే) కార్యక్రమం.


చేతులతో మురుగుకాల్వలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసేపారిశుధ్యపనివారి పునరావాసానికి ,వ్యవస్థీకృత చర్యలకు ఈ పథకాన్ని నిర్దేశించారు.

Posted On: 25 AUG 2023 2:30PM by PIB Hyderabad

మురుగుకాల్వలు, సెప్టిక్ ట్యాంకులను చేతితో శుభ్రం చేసే పనివారి (ఎస్.ఆర్.ఎం.ఎస్)ల పునరావాసానికి ,
స్వయం ఉపాధి పధకాలు, ఇతర పథకాల ద్వారా కృషి జరుగుతుండడంతో , చేతులతో మురుగునీటి కాల్వలు, డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం చాలావరకు
తొలగించడం జరిగింది. అయితే అక్కడక్కడా ఇప్పటికీ ప్రమాదకర పద్ధతులలో  మురుగుకాల్వలుశుభ్రం చేయడం, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల తొలగింపునకు సంబంధించి అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నట్టు
పత్రికలలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి అంశాలను ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిక తీసుకెళ్లి,
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాధితులకు 10 లక్షల రూపాయలు ఇప్పించేలా చూడడం జరుగుతోంది. ఇందులో ప్రధాన సమస్య,
మురుగుకాల్వలను, సెప్టిక్ ట్యాంకులను ప్రమాదకర రీతిలో ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా  శుభ్రం చేస్తుండడం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం.
ప్రమాదకర పద్ధతులలో మురుగుకాల్వలు, సెప్టిక్ ట్యాంక్ల పనులు చేయడాన్ని నిరోధించేందుకు, ఈ పనులు చేసే వారి భద్రత,
ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, సామాజిక న్యాయం, సాధికారతా మంత్రిత్వశాఖ (ఎం.ఒ.ఎస్.జె.ఇ), గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ
సంయుక్తంగా ఒక కార్యాచరణను చేపట్టింది. దాని పేరు  నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్  ఎకోసిస్టమ్ – నమస్తే పథకం. ప్రస్తుతం ఉన్న ఎస్.ఆర్.ఎం.ఎస్ పథకంలోని అంశాలను నమస్తే పథకంలో కూడా ఉంచడం జరిగింది.
 ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా, 4800 కు పైగా గల నగర స్థానిక సంస్థలు (యు.ఎల్.బి)లలో 2025–26 మధ్య రూ 349.70 కోట్ల రూపాయల వ్యయంతో అమలు చేయనున్నారు.

నమస్తే కార్యక్రమంలోని ముఖ్యాంశాలు:
1. మురుగు కాల్వల శుద్ధి, సెప్టిక్ ట్యాంక్ వర్కర్ల (ఎస్ ఎస్ డబ్ల్యు) వివరాలు సేకరణ. సంబంధిత నగర స్థానిక సంస్థలనుంచి
వారి వివరాలు సేకరించి , ప్రొఫైలింగ్ క్యాంప్ ల ద్వారా వారి సమగ్ర వివరాల నమోదు.
2. వృత్తిపరమైన భద్రతా చర్యలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వ్యక్తిగత రక్షణ కిట్లను ఎస్.ఎస్.డబ్ల్యు   లకు ఇస్తారు.
3. ప్రమాదకర పరిశుభ్రతా కార్యక్రమాలలో, పారిశుద్ధ్య స్పందన యూనిట్లకు రక్షణ పరికరాల సహాయం ఉండేట్టు చూస్తారు.
4. ఆరోగ్య బీమా పథకాల ప్రయోజనాల వర్తింపు: గుర్తించిన ఎస్.ఎస్.డబ్ల్యులు, వారి కుటుంబాలకు  రక్షణ కవచం   కల్పిస్తారు.
వీరిని ఆయుష్మాన్ భారత్– ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన,(ఎబి–పిఎంజెఎవై) కిందికి తెస్తారు.
చేతితో మురుగునీటి శుద్ధి, సెప్టిక్ ట్యాంకుల పనులు చేసే వారిలో ఇంతకు ముందు పై పథకాల కిందికి రాని
వారిని , వారి కుటుంబాలను గుర్తించి, వారికి ఎబి –పిఎంజెఎవై కింద ప్రీమియంను,  నమస్తే పథకం కింద చెల్లిస్తారు.
5.జీవనోపాథి సహాయం: ఈ కార్యాచరణ పథకం యాంత్రీకరణను, ఎంటర్ప్రైజ్ డవలప్మెంట్ను ప్రోత్సహిస్తుంది.
జాతీయ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.ఎస్.ఎ.ఎఫ్.డి.సి) ఆర్ధిక సహాయ మద్దతు నిస్తుంది.
చేతితో డ్రైనేజి శుద్ధిపనులు, సెప్టిక్ ట్యాంకుల పనులు చేసే కార్మికులకు పారిశుధ్య పనులకు సంబంధించిన పరికరాలు కొనుగోలు చేసేందుకు
స్వచ్ఛ ఉద్యమి యోజన కింద వాహనాలు కొనుగోలు చేసేందుకు , వారు పారిశుధ్యవ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు నిధులు సమకూర్చడం జరుగుతుంది.
దీనికితోడు, గుర్తించిన స్కావెంజర్లకు, వారి పై ఆధారపడిన వారికి పెట్టుబడి సబ్సిడీతో పాటు స్వయంఉపాధి పథకాలను కొనసాగిస్తారు.
6. మరుగుదొడ్లను చేతులతోశుభ్రంచేసే సఫాయి పనిలో ఉన్న వారిని, వారిపై ఆధారపడిన వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చి వారికి నెలకు 3 వేల రూపాయల
వంతున రెండు సంవత్సరాల పాటు స్టయిఫండ్ ఇస్తారు.

7.ఎం.ఒ.ఎస్.జె.ఇ, ఎం.ఒ.హెచ్.యు.ఎ కార్యక్రమాల మేళవింపు:
ఎస్.ఎస్.డబ్ల్యెల భద్రత ఎం.ఒఎస్.జె.ఇ, ఎం.ఒ.హెచ్.యు.ఎల సంయుక్త బాధ్యత. అందువల్ల నమస్తే కార్యక్రమంకింద,
రెండు మంత్రిత్వశాఖలు, నమస్తే పథకాన్ని అమలుచేస్తాయి. ఈ కార్యాచరణ ప్రస్తుత ఎస్.ఆర్.ఎం.ఎస్, స్వచ్ఛభారత్ మిషన్ (ఎస్.బి.ఎం)
దీనదయాళ్ అంత్యోదయ యోజన– నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ (డిఎవై–ఎన్.యు.ఎల్.ఎం), ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి వంటివాటికి నిధులు అందుబాటులో ఉండేట్టు చూస్తుంది. అలాగే ఎస్.ఎస్.డబ్ల్యులకు ఆర్థిక భద్రత,సామాజిక, వృత్తిపరమైన భద్రత ఉండేట్టుచూస్తుంది.
8. ఐఇసి ప్రచారం: నగర స్థానికసంస్థలు, ఎన్.ఎస్.కె.ఎఫ్.డి.సి ల సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐఇసి ప్రచారాన్ని చేపట్టడం జరుగుతుంది. నమస్తే కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం కల్పించడం జరుగుతుంది.
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా హోర్డింగ్లను వివిధ ప్రముఖ ప్రదేశాలలో స్థానిక భాషలలో ఉంచి ప్రచారం చేయడం జరుగుతోంది. సామాజిక మాధ్యమాలను పబ్లిసిటీకి విస్తృతంగా వాడుతారు.
9. ఎం.ఐ.ఎస్, వెబ్ సైట్: నమస్తే వెబ్సైట్ ద్వారా ఎం.ఐ.ఎస్ అమలు పర్యవేక్షణ చేస్తారు.
గతంలోని ఎస్.ఆర్.ఎం.ఎస్ పథకం కింద గత 9 సంవత్సరాలలో సాధించిన ప్రగతి కి సంబంధించిన వివరాల లింక్...
నమస్తే పథకం అమలు కు రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకోవలసిన చర్యలు, పథకం ముఖ్యాంశాల లింక్....

 

***


(Release ID: 1952820) Visitor Counter : 187