ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దక్షిణాఫ్రికా, గ్రీస్ ల పర్యటన ఫలవంతం చేసుకుని తిరిగి వచ్చిన ప్రధానమంత్రికి బెంగళూరులో అద్భుత స్వాగతం

Posted On: 26 AUG 2023 10:04AM by PIB Hyderabad

దక్షిణాఫ్రికా, గ్రీస్  దేశల్లో నాలుగు రోజుల పాటు పర్యటించిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరు వచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్  శిఖరాగ్ర సదస్సులో పాల్గొని అనంతరం గ్రీస్  సందర్శించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు స్థానిక నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఉభయ దేశాల్లోను భారతీయ సమాజానికి సంబంధించిన ప్రజలనున కూడా ఆయన కలుసుకున్నారు. చంద్రయాన్-3 మూన్  లాండర్  చంద్ర మండలంపై దిగడాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్  విధానంలో ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి ఇస్రో టీమ్  తో సంభాషించడానికి బెంగళూరు వచ్చారు.

హెచ్ఏఎల్  కు వెలుపల ప్రధానమంత్రి శ్రీ మోదీకి పౌరులు ఘన స్వాగతం పలికారు. అక్కడ సమావేశమైన పౌరులనుద్దేశించి మాట్లాడేందుకు  సమాయత్తం అవుతూ ‘‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్  జై అనుసంధాన్’’   నినాదంతో తన ఉపన్యాసం ప్రారంభించారు. భారతదేశ అద్భుత విజయంపై దక్షిణాఫ్రికా, గ్రీస్ లో కూడా ఇదే తరహా ఉత్సాహం కనిపించిందని శ్రీ మోదీ అన్నారు.

ఇస్రో టీమ్  ను కలవడానికి ఆయన ఉత్సాహం ప్రకటిస్తూ అందుకే విదేశీ పర్యటన నుంచి నేరుగా బెంగళూరు రావాలని తాను నిర్ణయించుకున్నానని ప్రధానమంత్రి చెప్పారు. ప్రొటోకాల్  కు  సంబంధించిన ఇబ్బందులేవీ లేకుండా చూడాలన్న తన అభ్యర్థనను ఆమోదించినందుకు గవర్నర్, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.  

అక్కడకు ఎంతో ఉత్సాహంగా వచ్చిన ప్రతీ ఒక్కరికీ ప్రధానమంత్రి ధన్యవాదాలు చెబుతూ ఆయన చంద్రయాన్  టీమ్  ను కలవడానికి ఇస్రో కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.

 

***


(Release ID: 1952626) Visitor Counter : 104