హోం మంత్రిత్వ శాఖ
ఎటువంటి పరిస్థితిలోనైనా తన ప్రజలకు దన్నుగా నిలిచేవాడే నిజమైన నాయకుడు అన్న కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
విజయవంతమైన మూన్‌మిషన్, చంద్రయాన్ 3 వెనుక గల ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకునేందుకు గ్రీస్ నుంచి బెంగుళూరుకు నేడు నేరుగా వెళ్ళిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ
బెంగళూరులో శాస్త్రవేత్తలను ఉద్దేశించిన ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం ఆకాశపు అంచులను తాకిన భారత అద్బుత విజయానికి నివాళి
లూనార్ మిషన్ చంద్రయాన్ 3 విజయాలకు సంకేతంగా నిలుస్తుంది కనుక 23 ఆగస్టు భారత్‌కు చారిత్రాత్మక రోజు
భారతీయ శాస్త్రవేత్తల విజయం వెనుక ఉన్నకథ భవిష్యత్ తరాలకు చేరాలని ఆ రోజును జాతీయ అంతరిక్ష దినంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేడు ప్రకటించారు
తిరంగా ఆత్మగౌరవ పతాకను చేబూని అంతరిక్ష అన్వేషణలో నూతన శిఖరాలను అధిరోహించేందుకు భారతీయ శాస్త్రవేత్తలకు స్ఫూర్తినివ్వడాన్ని ఈ నిర్ణయం కొనసాగిస్తుంది
భారత చంద్రయాన్ మిషన్ చారిత్రిక విజయంతో మన శాస్త్రవేత్తలు కాలపు తిన్నెలపైఐ చెరగని ముద్రను వేశారు
ఏ వైఫల్యం శాశ్వతం కాదని మనకు గుర్తు చేసేందుకు చంద్రయాన్ -2 కూలిన ప్రదేశానికి తిరంగా అని నామకరణం, చంద్రయాన్ -3 దిగిన స్థానానికి శివశక్త
Posted On:
26 AUG 2023 2:39PM by PIB Hyderabad
ప్రతి పరిస్థితిలోనూ తన ప్రజల పక్షాన నిలిచేవాడే నిజమైన నాయకుడని కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. విజయవంతమైన చంద్రయాన్ 3 మూన్ మిషన్‌కు బాద్యులైన ఇస్రో శాస్త్రవేత్తలను కలిసేందుకు ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గ్రీస్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళడంపై ఎక్స్‌పై పలు పోస్ట్‌లలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆకాశపు అంచులను తాకిన భారత అద్భుత విజయానికి ఒక నివాళిగా శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఉందన్నారు.
చంద్రుని మిషన్ చంద్రయాన్ 3 విజయ సాధనకు సంకేతంగా ఉన్నందున ఆగస్టు 23 అన్నది భారత్ దేశానికి ఒక చారిత్రాత్మక దినమని, కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అన్నారు. ప్రతి భవిష్యత్ తరానికీ ఈ మిషన్ ను విజయవంతం చేయడం వెనుక ఉన్న భారతదేశ శాస్త్రవేత్తల కథను చేరేందుకు నేడు ఆ రోజును అంతరిక్ష దినంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ప్రకటించారని, పేర్కొన్నారు. ఈ నిర్ణయం అన్నది తిరంగా ఆత్మగౌరవ పతాకను చేబూని, అంతరిక్ష అన్వేషణలో కొత్త శిఖరాలను అందుకునేందుకు భారతీయ శాస్త్రవేత్తలకు స్ఫూర్తినివ్వడాన్ని ఈ నిర్ణయం కొనసాగిస్తుందన్నారు.
భారత చంద్రయాన్ మిషన్ చారిత్రిక విజయంతో మన శాస్త్రవేత్తలు కాలపు తిన్నెలపైఐ చెరగని ముద్రను వేశారని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ విజయానికి గుర్తుగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ చంద్రయాన్ -3 దిగిన స్థానానికి శివశక్తి అని, ఏ వైఫల్యం శాశ్వతం కాదని మనకు గుర్తు చేసేందుకు చంద్రయాన్ -2 కూలిన ప్రదేశానికి తిరంగా అని నామకరణం చేశారన్నారు.
***
(Release ID: 1952507)
Visitor Counter : 148