రాష్ట్రపతి సచివాలయం
దాదీ ప్రకాశమణి జ్ఞాపకార్థం తపాళా బిళ్ళను విడుదల చేసిన భారత రాష్ట్రపతి
Posted On:
25 AUG 2023 12:56PM by PIB Hyderabad
బ్రహ్మకుమారీల మాజీ అధిపతి దాదీ ప్రకాశమణి జ్ఞాపకార్ధం రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో శుక్రవారం (ఆగస్టు 25, 2023)న పోస్టేజ్ స్టాంపును భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ తపాలా బిళ్ళను సమాచార మంత్రిత్వ శాఖ తపాలా విభాగపు మై స్టాంప్ అన్న చొరవ కింద దాదీ ప్రకాశమణి 16వ వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆధ్యాత్మికత ద్వారా భారత్‌లో, విదేశాలలోనూ భారతీయ విలువలను వ్యాప్తి చేయడంలో దాదీ ప్రకాశమణి గొప్ప పాత్ర పోషించారని రాష్ట్రపతి అన్నారు. ప్రపంచంలోనే మహిళా నాయకత్వంలోని అతిపెద్ద సంస్థగా బ్రహ్మకుమారీస్ ఆమె నాయకత్వంలో అవతరించింది. నిజమైన నాయకురాలిలా, ఆమె బ్రహ్మకుమారీల కుటుంబానికి సవాళ్ళతో కూడిన పరిస్థితుల్లో కూడా విశ్వాసం, ధైర్యంతో అండగా నిలవడమే కాక ఎల్లవేళలా వారికి మార్గదర్శనం చేశారు.
జీవితం తాత్కాలికమైనదనీ, ఒక వ్యక్తి తాను చేసిన పనుల వల్ల మాత్రమే వారిని గుర్తించుకుంటారనేది ప్రపంచంలో అతిపెద్ద సత్యమని రాష్ట్రపతి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉదాత్తమమైన పనులు చేయాలని ఆమె అన్నారు. భౌతికంగా దాదాజీ మన మధ్య ఉండకపోవచ్చని, కానీ ఆమె ఆధ్యాత్మిక, ఉదాత్త వ్యక్తిత్వపు జ్ఞాపకాలు, మానవాళి సంక్షేమం కోసం ఆమె ఇచ్చిన సందేశం అన్నీ కూడా ఎల్లప్పుడూ మన మధ్య సజీవంగా ఉంటాయని, రానున్న తరాలకు స్ఫూర్తిని ఇస్తాయని ఆమె పంచుకున్నారు.
ఇటీవలి కాలంలో చంద్రయాన్ -3 మిషన్ విజయం గురించి మాట్లాడుతూ, భారత శాస్త్రవేత్తలు సాధించిన అపూర్వ విజయాన్ని మనందరం వీక్షించామని అన్నారు. చంద్రుడిపై దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశం భారత అని ఆమె అన్నారు. చంద్రయాన్ -3 మిషన్ ద్వారా చంద్రుని భూభాగం నుంచి సేకరించిన నూతన సమాచారం మొత్తం ప్రపంచానికి లాభాలను చేకూరుస్తుందనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి-
***
(Release ID: 1952200)
Visitor Counter : 151