ప్రధాన మంత్రి కార్యాలయం

జి-20 దేశాల కు చెందిన వ్యాపారం మరియు పెట్టుబడి శాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించిప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం యొక్క పాఠం

Posted On: 24 AUG 2023 9:12AM by PIB Hyderabad

మహానుభావులు , మహిళలు మరియు సజ్జనులారా, నమస్కారం.

పింక్ సిటీ.. జయ్ పుర్ లోకి మీకు చాలా స్నేహపూర్వకం అయినటువంటి స్వాగతం. ఈ ప్రాంతం తన హుషారైన మరియు వాణిజ్యపరం గా ఉత్సాహం కలిగిన ప్రజల రీత్యా ప్రసిద్ధికెక్కింది.

మిత్రులారా,

చరిత్ర పర్యంతం గమనిస్తే వ్యాపారం అనేది ఆలోచనల యొక్క, సంస్కృతుల యొక్క మరియు సాంకేతిక విజ్ఞానం యొక్క ఆదాన ప్రదానాని కి దారి తీసింది అని తెలుస్తుంది. ఇది ప్రజల ను చేరువ చేసింది. వ్యాపారం మరియు ప్రపంచీకరణ లు కోట్ల కొద్దీ ప్రజల ను కటిక బీదరికం వలయం లో నుండి బయటకు తీసుకు వచ్చాయి.

మహానుభావులారా,

ప్రస్తుతం, భారతదేశ ఆర్థిక వ్యవస్థ పట్ల ప్రపంచ దేశాల లో ఆశావాదం మరియు విశ్వాసం వ్యక్తం కావడాన్ని మేం గమనిస్తున్నాం. భారతదేశాన్ని దాపరికం లేనిదిగాను, అవకాశాలు మరియు ఐచ్ఛికాల నిలయం గాను చూడడం జరుగుతున్నది. గడచిన తొమ్మిది సంవత్సరాల లో భారతదేశం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా మారింది. ఇది మా యొక్క నిలకడ కలిగిన ప్రయాసల ఫలితమని చెప్పాలి. మేం 2014 వ సంవత్సరం లో రిఫార్మ్‌,పెర్ఫార్మ్‌ ఎండ్ ట్రాన్స్ ఫార్మ్ల తో కూడిన యాత్ర ను మొదలుపెట్టాం. మేం పోటీ తత్వాన్ని, పారదర్శకత్వాన్ని వృద్ధి చెందింప చేసుకొన్నాం. మేం డిజిటైజేశన్ పరిధి ని విస్తరించాం, అలాగే నూతన ఆవిష్కరణల ను ప్రోత్సహించాం. మేం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లను ఏర్పాటు చేయడం తో పాటు, ఇండస్ట్రియల్ జోన్ లను నిర్మించాం. మేం ప్రతిదానికి జాప్యం తప్పని స్థితి నుండి ఎర్ర తివాచీ పరచే వైఖరి దిశ లో సాగి, మరి ఎఫ్ డిఐ సంబంధి విధానాల ను సరళతరం చేసివేశాం. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు తయారీ కి ఊతాన్ని ఇచ్చాయి. అన్నింటిని మించి, మేం విధాన పరమైన స్థిరత్వాన్ని తీసుకు వచ్చాం. రాబోయే కొన్ని సంవత్సరాల లో భారతదేశాన్ని ప్రపంచం లోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా తీర్చిదిద్దాలి అని మేం కంకణం కట్టుకొన్నాం.

మిత్రులారా,

మహమ్మారి మొదలుకొని భౌగోళిక-రాజకీయ ఉద్రికత్తల వరకు, వర్తమాన ప్రపంచ సవాళ్ళు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ను పరీక్షించాయి. జి-20 సభ్యత్వ దేశాల స్థాయి లో చూసినట్లయితే, అంతర్జాతీయ వ్యాపారం మరియు పెట్టుబడుల పరం గా విశ్వాసాన్ని తిరిగి పాదుగొల్పవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం భవిష్యత్తు కాలం లో ఎదురయ్యే దిగ్భ్రాంతికర స్థితుల ను తట్టుకొని నిలబడ గలిగేటటువంటి గ్లోబల్ వేల్యూ చైన్ లను నిర్మించి తీరాలి. ఈ సందర్బం లో, ఒక జనరిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ మేపింగ్ గ్లోబల్ వేల్యూ చైన్స్ ను సృష్టించాలన్న భారతదేశం యొక్క ప్రతిపాదన ముఖ్యమైంది. ఈ ఫ్రేమ్ వర్క్ ఉద్దేశ్యాల లో మన ముందున్న బలహీనతల ను మదింపు చేయడం, రిస్కుల ను వీలైనంత తక్కువ స్థాయి కి పరిమితం చేయడం తో పాటు ఆటుపోటుల ను తట్టుకొని సాగేటటువంటి తత్వాన్ని వృద్ధి చెందింప చేయడం వంటివి భాగం గా ఉన్నాయి.

మహానుభావులారా,

వ్యాపారం లో గణనీయమైన మార్పుల ను ప్రవేశపెట్టగలిగిన శక్తి సాంకేతిక విజ్ఞానాని కి ఉందన్నది తోసిరాజనలేనిది. భారతదేశం ఒక ఆన్ లైన్ సింగిల్ ఇన్ డైరెక్ట్ టాక్స్.. అదే జిఎస్ టి.. కి మళ్ళడం అనేది అంతర్ రాష్ట్ర వ్యాపారాన్ని వర్థిల్ల జేసేటటువంటి ఒక అంతర్గత బజారు ను సృష్టించడానికి సాయపడింది. మా యొక్క యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ - ఫేస్ ప్లాట్ ఫార్మ్ వ్యాపార సంబంధి లాజిస్టిక్స్ ను చౌకదిగాను మరియు పారదర్శకమైనటువంటిది గాను తీర్చిదిద్దుతుంది. ఓపెన్ నెట్ వర్క్ ఫార్ డిజిటల్ కామర్స్అనేది మరొక గేమ్ ఛేంజర్ గా నిలవనుంది. అది మా యొక్క డిజిటల్ మార్కెట్ ప్లేస్ ఇకో-సిస్టమ్ లో ప్రజాస్వామ్యీకరణ కు బాట ను పరచనుంది. మేం చెల్లింపు వ్యవస్థల కై మా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్-ఫేస్ తో ఇప్పటికే ఈ కృషి ని ఆరంభించివున్నాం. ప్రక్రియల ను డిజిటైజ్ చేయడం మరియు ఎలక్ట్రానిక్ కామర్స్ (ఇ-కామర్స్) యొక్క ఉపయోగాన్ని అనుసరించడం అనేవి బజారు లభ్యత ను వృద్ధి చెందింప చేసే సత్తా ను కలిగివున్నాయి. మీ సమూహం హై లెవల్ ప్రిన్సిపల్స్ ఫార్ ద డిజిటలైజేశన్ ఆఫ్ ట్రేడ్ డాక్యుమెంట్స్అనే అంశం పై కసరత్తు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ సిద్ధాంతాలు దేశాల కు సరిహద్దుల కు ఆవల ఎలక్ట్రానిక్ వ్యాపార సంబంధి నిర్ణయాల ను అమలు పరచడం లో మరియు నియమ పాలన తాలూకు భారాల ను తగ్గించడం లో దోహద పడగలుగుతాయి. సరిహద్దుల కు అతీతం గా ఇ-కామర్స్ విస్తరిస్తున్న కొద్దీ ఆ క్రమం లో సవాళ్ళు సైతం తల ఎత్తుతున్నాయి. మనం పెద్ద విక్రేతల కు మరియు చిన్న విక్రేతల కు మధ్య సమాన ప్రతిస్పర్థ కు పూచీ పడేటందుకు గాను ఉమ్మడి గా కృషి చేయవలసిన అవసరం ఉన్నది. సరి అయిన ధర ను కనుగొనడం లో, మరి అదే విధం గా సమస్యల ను పరిష్కరించే యంత్రాంగాల విషయం లో వినియోగదారులకు ఎదురయ్య సమస్యల ను కూడా మనం పరిష్కరించవలసిన అవసరం ఎంతయినా ఉంది.

మహానుభావులారా,

వ్యాపార వ్యవస్థ నియమాల పై ఆధారపడివుండే, ఎటువంటి దాపరికాని కి తావు ఇవ్వనటువంటి, అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి మరియు బహుళ పార్శ్వాల తో కూడుకొన్నటువంటి వ్యాపార వ్యవస్థ ఏర్పాడాలి, మరి ఆ వ్యవస్థ కు కేంద్ర స్థానం లో ప్రపంచ వ్యాపార సంస్థ (డబ్ల్యుటిఒ) నిలచి ఉండాలి అని భారతదేశం నమ్ముతున్నది. డబ్ల్యుటిఒ యొక్క పన్నెండో మంత్రుల స్థాయి సమావేశం లో భారతదేశం గ్లోబల్ సౌథ్ యొక్క ఆందోళనల ను గురించి వకాల్తా పుచ్చుకు వాదించింది. లక్షల కొద్దీ రైతుల మరియు చిన్న వ్యాపార సంస్థల యొక్క ప్రయోజనాల ను కాపాడాలన్న అంశం లో ఏకాభిప్రాయాన్ని మనం సాధించగలిగాం. సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థలు ( ఎమ్ఎస్ఎమ్ఇ స్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో పోషిస్తున్నటువంటి కీలకమైన పాత్ర ను పట్టి చూస్తూ మనం ఎమ్ఎస్ఎమ్ఇ ల విషయంలో ఎక్కువ శ్రద్ధ ను వహించవలసి ఉంది. ఎమ్ఎస్ఎమ్ఇ లలో 70 శాతం ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి మరి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (గ్లోబల్ జిడిపి) లో వాటి తోడ్పాటు 50 శాతం వరకు ఉంది. వాటి కి మన సమర్థన ను నిరంతరాయం గా కొనసాగించవలసి ఉంది. వాటికి సాధికారిత ను కల్పించామా అంటూ గనక అది సామాజిక సాధికారిత గా రూపుదాల్చుతుంది. మన దృష్టి లో ఎమ్ఎస్ఎమ్ఇ స్ అంటే - సూక్ష్మ, లఘు మరియు మధ్యతరహా వాణిజ్య సంస్థల కు గరిష్ఠ సమర్థన అని అర్థం అన్నమాట. భారతదేశం మా ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ అయినటువంటి గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ ద్వారా ఎమ్ఎస్ఎమ్ఇ స్ ను సార్వజనిక కొనుగోలు ప్రక్రియ తో జతపరచింది. మేం పర్యావరణం విషయం లో శూన్య దోషం మరియు శూన్య ప్రభావంతాలూకు స్వభావాన్ని అవలంబించడం కోసం మా ఎమ్ఎస్ఎమ్ఇ రంగం కలసి పని చేస్తున్నాం. ప్రపంచ వ్యాపారం లో మరియు గ్లోబల్ వేల్యూ చైన్స్ లో వాటి వంతు భాగస్వామ్యాన్ని పెంచాలన్నది భారతదేశం అధ్యక్షత తాలూకు ప్రాథమ్యం గా ఉంటూ వచ్చింది. ఎమ్ఎస్ఎమ్ఇ లకు నిరంతరాయ సమాచార ప్రవాహాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిపాదించిన జయ్ పుర్ ఇనిశియేటివ్ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది చాలినంత స్థాయి లో లేనటువంటి బజారు లభ్యత మరియు వ్యాపారం సంబంధి సమాచారం ల పరం గా ఎమ్ఎస్ఎమ్ఇ లు ఎదుర్కొంటున్న సవాలు ను పరిష్కరించ గలుగుతుంది అన్నారు. గ్లోబల్ ట్రేడ్ హెల్ప్ డెస్క్ ను ఉన్నతీకరించారా అంటే ప్రపంచ వ్యాపారం లో ఎమ్ఎస్ఎమ్ఇ ల భాగస్వామ్యం పెరుగుతుందన్న నమ్మకం కూడా నాలో ఉంది.

మహానుభావులారా,

అంతర్జాతీయ వ్యాపారం మరియు పెట్టుబడి ప్రక్రియల లో విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పడం ఒక కుటుంబం వలె మన అందరి యొక్క సమష్టి గా బాధ్యత ఉన్నది. గ్లోబల్ ట్రేడింగ్ సిస్టమ్ క్రమ క్రమం గా మరింత ఎక్కువ ప్రాతినిధ్యం తో కూడినటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని ముందుకు సాగిపోయే భావి వ్యవస్థ గా మార్పు చెందేటట్లు గా చూడటం కోసం మీరంతా కలిసికట్టుగా పని చేస్తారన్న విశ్వాసం నాలో ఉంది. మీ చర్చోపచర్చలు సఫలం అవ్వాలని నేను కోరుకొంటున్నాను. మీకు అనేకానేక ధన్యవాదాలు.

 

***



(Release ID: 1951997) Visitor Counter : 117