అంతరిక్ష విభాగం

చంద్రయాన్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం .... డాక్టర్ జితేంద్ర సింగ్ '

Posted On: 23 AUG 2023 7:06PM by PIB Hyderabad

 చంద్రుడిపై  భారతదేశం అడుగు పెట్టింది! ఇస్రో కు శుభాకాంక్షలు!".. .ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతం అయిన వెంటనే అంతరిక్ష శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేంద్ర శాస్త్ర, సాంకేతిక, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు,ప్రజా ఫిర్యాదులు, అణుశాస్త్ర శాఖ సహాయ మంత్రి (పూర్తి స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ స్పందన ఇది.  ఈ సాయంత్రం దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన వెంటనే డాక్టర్ జితేంద్ర సింగ్ చంద్రయాన్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ' ఇతరులు చంద్రుని ఊహిస్తున్నారు. ఇదే సమయంలో భారతదేశం  చంద్రుని తాకింది. కొంతమంది కలలు కంటున్నారు. భారతదేశం తన కలను సాకారం చేసుకుంది. త్రివర్ణ పతాకం చంద్రుని ఉపరితలంపై రెపరెపలాడుతూ భారతదేశం సాధించిన విజయాన్ని తెలియజేస్తోంది' అని డాక్టర్ జితేంద్ర సింగ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.  'ఆకాశమే హద్దు కాదు' అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు.  

చంద్రయాన్ విజయం తర్వాత డాక్టర్ జితేంద్ర సింగ్ మీడియాకి ఒక సంక్షిప్త ప్రకటన విడుదల చేశారు. దక్షిణ ధ్రువ ప్రాంతంలో తొలిసారిగా అడుగు పెట్టిన దేశంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన  ఇస్రో ఛైర్మన్, శ్రీ ఎస్. సోమనాథ్, మిషన్ డైరెక్టర్, శ్రీ మోహన్ కుమార్, మొత్తం ఇస్రో బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇంతవరకు చంద్రుని  దక్షిణ ధ్రువ ప్రాంతంలో భారతదేశం మినహా మరే ఇతర దేశం అడుగు పెట్టలేదు అని మంత్రి అన్నారు. ఖచ్చితమైన ప్రణాళిక , సూక్ష్మ వివరాలను నిర్ధారించడానికి నెలలు, సంవత్సరాల పాటు పగలు, రాత్రి కలిసి పని చేసి ఇస్రో బృందం  శ్రమ, కృషి, నిబద్ధతతో చంద్రయాన్-3 విజయం సాధించిందన్నారు. 

  అంతరిక్ష రంగంలో ప్రపంచంలో అగ్రగామి దేశం గా భారతదేశం తన స్థానాన్నిసుస్థిరం చేసుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్  అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అనుసరిస్తున్న విధానాలు విజయాన్ని సాధించడానికి ఉపకరించాయన్నారు.  భారతదేశ అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు రంగానికి అందుబాటులోకి రావాలని నిర్ణయించిన ప్రధానమంత్రి  భారతదేశ అంతరిక్ష శాస్త్రవేత్తలు తమ వ్యవస్థాపక తండ్రి విక్రమ్ సారాభాయ్ కలను సాకారం చేసుకునేందుకు, భారతదేశం తన  అపారమైన సామర్ధ్యం, ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం కల్పించారని డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. చంద్రయాన్ విజయంతో ప్రపంచ దేశాలకు భారతదేశం శక్తి సామర్ధ్యాలు పూర్తిగా అవగతం అయ్యాయని మంత్రి అన్నారు. 

విక్రమ్ దాని అల్గారిథం  సాధనాల సహాయంతో ప్రమాద రహిత ప్రదేశంలో ల్యాండ్ అయ్యిందని , ల్యాండర్‌కి వంపు చాలా తక్కువగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. విక్రమ్‌లోని కెమెరాలు చంద్రుని చిత్రాలను తీసి మిషన్ విజయాన్ని   ధృవీకరించాయని ,సెన్సార్లు కూడా విజయాన్ని నిర్ధారించాయి అని ఆయన తెలిపారు.

చంద్రుడిపై విక్రమ్ చేపట్టే   తదుపరి కార్యకలాపాల క్రమాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. విక్రమ్, ప్రజ్ఞాన్‌లు అవకాశం ఉన్న అన్ని రోజులలో ప్రయోగాలు జరిపి సమాచారాన్ని సేకరిస్తాయి అని మంత్రి తెలిపారు. 14 రోజుల పాటు  అన్ని పరికరాలు సమాచారం సేకరించి పంపుతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. 

 

ల్యాండర్‌పై, ధ్రువ ప్రాంతానికి సమీపంలో ఉన్న చంద్ర ఉపరితలం యొక్క ఉష్ణ లక్షణాల కొలతలను నిర్వహించడానికి CHASTE పరికరం , LRA (లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే), RAMBHA-LP- వంటి సాధనాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలియజేశారు. ఉపరితల ప్లాస్మా సాంద్రతను కొలవడానికి లాంగ్‌ముయిర్ ప్రోబ్, భవిష్యత్ ఆర్బిటర్‌ల ద్వారా చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను ఖచ్చితమైన స్థాన కొలత కోసం విక్రమ్ లో  అమర్చిన లేజర్ రిఫ్లెక్టర్, ILSA - ల్యాండింగ్ సైట్ చుట్టూ భూకంపాన్ని కొలవడానికి మరియు అర్థం చేసుకోవడానికి చంద్ర భూకంప చర్య కోసం పరికరం. లూనార్ క్రస్ట్, మాంటిల్ నిర్మాణం, LIBS- లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ, చంద్రుని ఉపరితలం,  చంద్రుని ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న రాళ్ల మూల కూర్పు (Mg, Al, Si, K, Ca,Ti, Fe)ను నిర్ణయించడానికి, APXS - ఆల్ఫా పార్టికల్ X-రే స్పెక్ట్రోమీటర్, ఉపరితలం ,ఆకృతిపై  అవగాహనను మరింత మెరుగుపరచడానికి రసాయన కూర్పు, ఖనిజ కూర్పును కొలవడానికి - నివాసయోగ్యమైన ప్రాంతాలను గుర్తించడానికి పరికరాలు పనిచేస్తాయని మంత్రి వివరించారు. 

 14 రోజుల తర్వాత సూర్యోదయం వరకు చంద్రుడిపై   రాత్రి  ఉష్ణోగ్రత అతి తక్కువగా  ఉంటుంది అని  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సూర్యోదయం తర్వాత   విక్రమ్, ప్రగాయాన్‌లకు సౌర విద్యుత్  ఉత్పత్తి మళ్లీ ప్రారంభమవుతుందని, దీంతో పరికరాలు తిరిగి పని ప్రారంభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.    ఇస్రో రూపొందించిన ఆర్బిటర్ ఎక్కువ కాలం పనిచేస్తుంది అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

 

<><><><>



(Release ID: 1951980) Visitor Counter : 162