ప్రధాన మంత్రి కార్యాలయం
‘అఖిల భారతీయశిక్ష సమాగమ్’ ను జులై 29 వ తేదీ న దిల్లీ లోని భారత్ మండపమ్ లో ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
ఎన్ఇపి 2020 ప్రారంభమై మూడో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న వేళ ఏర్పాటవుతున్న రెండురోజుల ‘సమాగమ్’ ఇది
పిఎమ్ శ్రీ పథకం లో భాగం గా ఒకటో విడత నిధుల నువిడుదల చేయనున్న ప్రధాన మంత్రి
పన్నెండు భారతీయ భాషల లో అనువాదం అయిన విద్య మరియు నైపుణ్య పాఠ్యక్రమం సంబంధి పుస్తకాల ను విడుదలచేయనున్న ప్రధాన మంత్రి
Posted On:
28 JUL 2023 6:45PM by PIB Hyderabad
అఖిల భారతీయ శిక్ష సమాగమ్ ను 2023 జులై 29 వ తేదీ నాడు ఉదయం 10 గంటల వేళ లో దిల్లీ లోని ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. జాతీయ విద్య విధానం 2020 మూడో వార్షికోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భం కూడా ఇదే కాలం లో సంభవిస్తున్నది.
‘పిఎమ్ ఎస్ హెచ్ఆర్ఐ (పిఎమ్ శ్రీ) పథకం లో భాగం గా ఒకటో విడత నిధుల ను ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో విడుదల చేయనున్నారు. జాతీయ విద్య విధానం (ఎన్ఇపి) 2020 లో ప్రస్తావించిన విధం గా ఒక సమతాపూర్ణమైన సమాజం, అన్ని వర్గాల ను కలుపుకొని ముందుకు పోయేటటువంటి సమాజం మరియు బహుళవాద సమాజం యొక్క నిర్మాణం లో విద్యార్థులు తల మునుకలై, మంచి ఫలితాల ను రాబట్ట గలిగే పౌరులు గా ఈ పాఠశాల లు వారి ని తీర్చి దిద్దుతాయి. 12 భారతీయ భాషల లోకి అనువాదం అయినటువంటి విద్య మరియు నైపుణ్య పాఠ్యక్రమం సంబంధి పుస్తకాల ను కూడా ప్రధాన మంత్రి ఆవిష్కరించనున్నారు.
ప్రధాన మంత్రి దృష్టి కోణం నుండి ప్రేరణ ను పొంది, యువతీ యువకుల ను సన్నద్ధుల ను చేసే మరియు అమృతకాలం లో దేశాని కి నాయకత్వాన్ని అందించే సామర్థ్యాన్ని వారు సంపాదించుకొనేటట్టు చేసే ఉద్దేశ్యం తో ఎన్ఇపి 2020 ని ప్రారంభించడమైంది. భవిష్యత్తు కాలం లో ఎదురుకాగల సవాళ్ళ ను తట్టుకొని నిలబడగలిగేటట్లుగా వారిని సిద్ధం చేయడం తో పాటు గా వారు ప్రధాన మానవ విలువల పట్ల అవగాహన ను కలిగివుండేటట్టు చూడడం ఈ విధానం యొక్క ఉద్దేశ్యం గా ఉంది. ఈ విధానం అమలు లోకి వచ్చిన మూడు సంవత్సరాల లో పాఠశాల, ఉన్నత విద్య మరియు నైపుణ్య సంబంధి విద్య యొక్క పరిధులు క్రాంతికారి పరివర్తన కు బాట ను పరచింది. జులై 29 వ తేదీ మరియు 30 వ తేదీ లలో నిర్వహించే ఈ రెండు రోజుల కార్యక్రమం విద్యవేత్తల కు, ఈ రంగం లోని నిపుణుల కు, విధాన రూపకర్తల కు, పరిశ్రమ ప్రతినిధుల కు, గురువులకు మరియు పాఠశాల విద్యార్థుల కు, ఉన్నత విద్య మరియు నైపుణ్య శిక్షణ సంస్థల విద్యార్థులు సహా ఇతరుల కు ఎన్ఇపి 2020 అమలు కు సంబంధించినంతవరకు వారి యొక్క అంతర్ దృష్టి, సాఫల్య గాథలు మరియు సర్వోత్తమమైన అభ్యాసాల ను, విధి విధానాల ను వెల్లడి చేసేందుకు, అలాగే ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకు పోయే క్రమం లో తగిన వ్యూహాల ను రూపొందించడం కోసం ఒక వేదిక ను సమకూర్చనుంది.
అఖిల భారతీయ శిక్ష సమాగమ్ లో భాగం గా పదహారు సదస్సు లు ఉంటాయి. వాటి లో నాణ్యమైన విద్య మరియు పాలన ల లభ్యత, సమతావాది మరియు సర్వవర్గ విద్యార్థుల కు ఉద్దేశించిన విద్య బోధన, సామాజికం గా-ఆర్థికం గా ప్రయోజనాల కు నోచుకోనటువంటి వర్గం యొక్క అంశాలు, నేశనల్ ఇన్స్ టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్, భారతీయ జ్ఞాన వ్యవస్థ, విద్య యొక్క అంతర్జాతీయకరణ సహా ఇతర అంశాల పై చర్చలు జరుగుతాయి.
***
(Release ID: 1951597)
Visitor Counter : 116
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam