ఆర్థిక మంత్రిత్వ శాఖ
భారత్, బంగ్లాదేశ్ మధ్య 14వ "జాయింట్-గ్రూప్-ఆఫ్-కస్టమ్స్" సమావేశం
Posted On:
22 AUG 2023 5:36PM by PIB Hyderabad
భారత్, బంగ్లాదేశ్ మధ్య 14వ "జాయింట్-గ్రూప్-ఆఫ్-కస్టమ్స్" (జె.జి.సి) సమావేశం 2023 ఆగస్టు, 21, 22 తేదీల్లో న్యూఢిల్లీ లో జరిగింది. ఈ సమావేశానికి భారతదేశం తరఫున కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి సభ్యుడు (కస్టమ్స్), బంగ్లాదేశ్ తరఫున జాతీయ రెవెన్యూ మండలి సభ్యుడు (కస్టమ్స్: ఆడిట్, ఆధునికీకరణ, అంతర్జాతీయ వాణిజ్యం) సహ అధ్యక్షత వహించారు.
కస్టమ్స్ సహకారం, సీమాంతర సులభతర వాణిజ్యానికి సంబంధించిన సమస్యలను చర్చించడానికి భారత్-బంగ్లాదేశ్ జాయింట్-గ్రూప్-ఆఫ్-కస్టమ్స్ సమావేశాలు ప్రతీ ఏటా జరుగుతాయి. అనుసంధానతను పెంపొందించడంలో, భూ సరిహద్దుల వద్ద సున్నితమైన కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వాణిజ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఈ సమావేశాలు కీలక పాత్ర పోషిస్తాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి 62 ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ల్యాండ్ బార్డర్ క్రాసింగ్ పాయింట్లు, రైల్వే స్టేషన్లు, నదీ తీరాలు, పోర్టులు ఉన్నాయి.
2022 మే, 17వ తేదీ నాటి సర్క్యులర్ ప్రకారం ఏదైనా ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐ.సి.డి) వద్ద కస్టమ్స్ క్లియరెన్స్ సౌకర్యంతో, మూసి ఉంచిన కంటైనర్లలో రైలు ద్వారా బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి ఎగుమతులను ప్రారంభించడం వంటి అనేక వాణిజ్య సులభతర చర్యలు ఇటీవల భారతదేశం చేపట్టింది. సరిహద్దు వాణిజ్య పాయింట్ల వద్ద రద్దీని తగ్గించదాడానికి కూడా ఇది హాయపడుతుంది. 2022 సెప్టెంబర్, 9 తేదీ నాటి సర్క్యులర్ భారతదేశంలోని ఐ.సి.డి. ల నుండి బంగ్లాదేశ్ కు అంతర్గత జలమార్గాలను ఉపయోగించి కార్గోను ఎగుమతి చేయడానికి వీలుగా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా, జల మార్గాలు, రోడ్డు మార్గాలను ఉపయోగించి ఏదైనా మూడో దేశానికి ఉద్దేశించిన బంగ్లాదేశ్ కు చెందిన కంటైనర్ ఎగుమతి కార్గోను భారతదేశం ద్వారా రవాణా చేయడానికి 2022 సెప్టెంబర్, 14 తేదీ నాటి సర్క్యులర్ జారీ చేయబడింది. అదేవిధంగా, 2023 ఫిబ్రవరి, 7వ తేదీ నాటి సర్క్యులర్ ఢిల్లీ ఎయిర్ కార్గోను ఉపయోగించి ఏదైనా మూడో దేశానికి బంగ్లాదేశ్ ఎగుమతి కార్గోను రవాణా చేయడానికి అనుమతించింది.
కొత్త ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ప్రారంభం, ఓడరేవు పరిమితులను సడలించడం, రోడ్డు, రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధి, వస్తువులు చేరకముందే కస్టమ్స్ సమాచారాన్ని పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం, కస్టమ్స్ సహకారంపై ద్వైపాక్షిక ఒప్పందం వంటి అనేక ద్వైపాక్షిక అంశాలపై 14వ జె.జి.సి. సమావేశం చర్చించింది. 13వ జె.జి.సి. సమావేశంలో నిర్ణయించిన విధంగా, ట్రయల్ రన్ లను పూర్తి చేసి, చట్టోగ్రామ్, మోంగ్లా పోర్ట్‌ల వినియోగంపై ఒప్పందాన్ని (ఏ.సి.ఎం.పి) అమలు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు, ఏ.సి.ఎం.పి. యొక్క సంబంధిత ట్రాన్సిట్ మాడ్యూల్స్ యొక్క ఎలక్ట్రానిక్ కనెక్టివిటీపై చర్చలను ప్రారంభించినందుకు, భారతదేశం బంగ్లాదేశ్‌కు ధన్యవాదాలు తెలిపింది.
పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉండటం తో ద్వైపాక్షిక సమావేశం విజయవంతంగా ముగిసింది.
****
(Release ID: 1951265)
Visitor Counter : 167