సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

2023 జూన్-జూలైకి సంబంధించి 'సచివాలయం సంస్కరణలు ' 7వ నివేదిక విడుదల


88.94 % ప్రజా ఫిర్యాదులు పరిష్కారం ( అందిన 9.70 లక్షల ఫిర్యాదుల్లో 8.63 లక్షల ఫిర్యాదులు పరిష్కారం)

తరగతుల వారీగా అందిన ఫిర్యాదులను పరిష్కార సమయం ఆధారంగా విభజిస్తున్న అన్ని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలు

3.22 లక్షల ఫైళ్లను స్వయంగా పరిశీలించి, 1.49 లక్షల ఫైళ్లను తొలగించిన సిబ్బంది

2023 జూన్-జూలై కాలానికి 100% ఇ-రసీదులు కలిగి ఉన్న 10 మంత్రిత్వ శాఖలు/విభాగాలు

40.64 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని వినియోగంలోకి తెచ్చిన అధికారులు. 7,186 ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహణ, పనికిరాని వస్తువుల విక్రయం ద్వారా రూ.37.56 కోట్ల ఆదాయం

Posted On: 22 AUG 2023 12:04PM by PIB Hyderabad

23.12.2022న జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో తీసుకున్న నిర్ణయాల మేరకు 2023 జూన్-జూలైకి సంబంధించి  'సచివాలయం సంస్కరణలు 7వ నివేదికను  విడుదల  పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం విడుదల చేసింది. 

2023 జూన్-జూలైకి సంబంధించి  'సచివాలయం సంస్కరణలు నివేదిక 7వ నివేదిక ముఖ్య అంశాలు:-

1.     స్వచ్ఛత కార్యక్రమాలు, జాప్యం  తగ్గింపు

a.     3.22 లక్షల ఫైళ్లను పరిశీలించారు. పనికిరావని  గుర్తించిన 1.96 లక్షల ఫైళ్లలో 1.49 లక్షల ఫైళ్లను తొలగించారు. 

b.    అందిన  9.70 లక్షల ఫిర్యాదుల్లో  8.63 లక్షల ప్రజా ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి (పరిష్కార రేటు-88.94%)

c.     జూన్-జూలై, 2023లో 40.64 లక్షల చదరపు అడుగుల స్థలం జరిగి వినియోగంలోకి వచ్చింది. 

d.    జూన్-జూలై, 2023లో పనికి రాని వస్తువుల విక్రయం  ద్వారా రూ.37.56 కోట్ల ఆదాయం లభించింది. 

 

e.     7,186 ప్రాంతాల్లో  పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. 

2.     నిర్ణయం తీసుకోవడంలో సామర్థ్యాన్ని పెంచడం

a.     అన్ని మంత్రిత్వ శాఖలు/ ప్రభుత్వ శాఖలు  జాప్యం జరుగుతున్న అంశాలను  గుర్తించాయి.   పాక్షికంగా ఆలస్యం/పూర్తిగా ఆలస్యం జరుగుతున్న విభాగాలను గుర్తించారు.(60 పూర్తిగా ఆలస్యం; 19 పాక్షికంగా ఆలస్యం)

b.    43 మంత్రిత్వ శాఖలు/విభాగాలు ప్రతినిధి బృందం 2021-2023 క్రమాన్ని సమీక్షించిసవరించాయి

 

c.     40 మంత్రిత్వ శాఖలు/ విభాగాల్లో డెస్క్ ఆఫీసర్ విధానం  అమలులో ఉంది. 

3.     ఇ-ఆఫీస్ అమలు , విశ్లేషణ

a.     ఇ-ఆఫీస్ 7.0 అమలు  కోసం గుర్తించిన మొత్తం 75 మంత్రిత్వ శాఖలు ఇ-ఆఫీస్ 7.0ని అమలు చేస్తున్నాయి. 

b.    కేంద్ర సచివాలయంలో  9.24 లక్షల యాక్టివ్ ఫిజికల్ ఫైళ్లు  27.44 లక్షల క్రియాశీల ఇ-ఫైళ్లు ఉన్నాయి 

c.     జూన్, 2023 నెలలో 10 మంత్రిత్వ శాఖలు/విభాగాలు 100% ఇ-రసీదులు కలిగి ఉన్నాయి

d.    జూన్‌లో ఇ-రసీదులు మే 2023లో 91.43% నుండి 91.92%కి పెరిగాయి

4.     ఉత్తమ విధానాలు 

 

a.      టెలికమ్యూనికేషన్ శాఖ  : ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమం కోసం   టెలికమ్యూనికేషన్స్ శాఖ సంచార్ భవన్‌లో ఒక స్క్రాప్ రూమ్ ను  జిమ్‌గా మార్చింది.  23 జూన్ 2023న  జిమ్‌ ప్రారంభమయ్యింది. 

b.    బయోటెక్నాలజీ శాఖ  : దరఖాస్తుదారులు ప్రతిపాదనలను సమర్పించడానికిఅన్ని పథకాల వివరాలు  రూపొందించడానికి, సిబ్బందికి  ఒకేచోట  సమాచారం అందించడానికి వీలుగా ఇ-బుక్, INTRADBT eProMIS ప్రారంభమయింది.  ప్రతిపాదనల విడుదల  కోసం  వేచి ఉండకుండా ఏడాది పొడవునా  వివిధ పరిశోధన, అభివృద్ధి పధకాల  క్రింద పోటీ పరిశోధన మంజూరు ప్రాజెక్ట్ ప్రతిపాదనలను సమర్పించడానికి  బయోటెక్నాలజీ విభాగం  eProMIS ద్వారా  దరఖాస్తుదారులను స్వీకరిస్తుంది. 

 

 

c.     డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ : ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంపొందించడం,  శిక్షణ కోసం శాఖ  అనేక చర్యలు చేపట్టింది. వార్షిక కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్‌తో పాటు, శాఖలో పనిచేస్తున్న  మొత్తం ఉద్యోగులలో 30% మంది దక్షత ప్రోగ్రామ్‌లో తమ శిక్షణా మాడ్యూళ్లను పూర్తి చేశారు.  ఉద్యోగులందరికీ అందుబాటులో ఉండేలా ఇంట్రానెట్ పోర్టల్‌ను శాఖ  అభివృద్ధి చేసింది,. సమాచార వ్యాప్తి , పరిపాలనా విధానాల డిజిటలైజేషన్‌లో సహాయపడుతుంది. పోర్టల్‌లో కాన్ఫరెన్స్ రూమ్ బుకింగ్స్టేషనరీ కోసం ఆన్‌లైన్ అభ్యర్థన, VIP రిఫరెన్స్‌ల స్థితి, OMలు/ఆర్డర్‌ల అప్‌లోడ్నోటీసు బోర్డుడ్యాష్‌బోర్డ్నిర్దిష్ట రోజున జరిగే  సమావేశాలుముఖ్యమైన ఫారమ్‌ల డౌన్‌లోడ్ మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలు దీనిలో పొందుపరిచారు. 



(Release ID: 1951251) Visitor Counter : 99