రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశంలో ఎరువుల లభ్యత, వినియోగంపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
దేశంలో రైతుల అవసరాలకు సరిపడా 150 లక్షల ఎంటీలకు మించి ఎరువుల నిల్వలు ఉన్నాయి.డాక్టర్ మన్సుఖ్ మాండవీయ .
భూసారాన్ని రక్షించడానికి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగం ఎక్కువ చేసేందుకు విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది .. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
వ్యవసాయేతర ప్రయోజనాల కోసం యూరియా తరలి పోకుండా చూసేందుకు కేంద్రంతో కలిసి రాష్ట్రాలు పటిష్ట చర్యలు అమలు చేయాలి.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
Posted On:
22 AUG 2023 3:37PM by PIB Hyderabad
దేశంలో ఎరువుల లభ్యత, వినియోగంపై కేంద్ర రసాయనాలు మరియు ఎరువులు, ఆరోగ్యం ,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు ఇక్కడ రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో సమీక్షించారు. నానో యూరియా, నానో డీఏపీ పురోగతి, క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, ఇందుకు సంబంధించి రాష్ట్రాలు అమలు చేస్తున్న చర్యలను సమావేశంలో మంత్రి సమీక్షించారు.
ప్రస్తుతం దేశంలో రైతుల అవసరాలకు సరిపడా 150 లక్షల ఎంటీ కు మించి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ మాండవీయ తెలియజేశారు. కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్‌ను మాత్రమే కాకుండా రాబోయే రబీ సీజన్‌కు అవసరమైన ఎరువులు సరఫరా చేయడానికి నిల్వలు సరిపోతాయని మంత్రి వివరించారు.
భూసారాన్ని కాపాడేందుకు రసాయనిక ఎరువుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించడానికి చర్యలు అమలు చేయాలని డాక్టర్ మాండవ్య రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం . ప్రధానమంత్రి ప్రాణం పథకం కింద చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు. పుడమిని రక్షించడానికి ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు దశల వారీగా సల్ఫర్ కోటెడ్ యూరియా (యూరియా గోల్డ్), నానో యూరియా, నానో డిఎపి మొదలైన వాటిని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించిందని డాక్టర్ మాండవీయ తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న చర్యలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు హామీ ఇచ్చాయి.
ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల పనితీరును సమావేశంలో సమీక్షించారు. రైతుల అన్ని అవసరాలను ఒకే చోట తీర్చడం లక్ష్యంగా ఈ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పీఎంకేఎస్‌కేలను క్రమం తప్పకుండా సందర్శించి రైతులకు అవగాహన కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయం కోసం సరఫరా చేస్తున్న వ్యవసాయ గ్రేడ్ యూరియాను వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వినియోగించకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ యూరియా మళ్లింపును తగ్గించాలని, అక్రమ వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర వ్యవసాయ శాఖల ఫ్లయింగ్ స్క్వాడ్ సంయుక్త తనిఖీల ఆధారంగా అక్రమంగా యూరియా వినియోగిస్తున్న 45 యూనిట్ల పై కేసులు నమోదు అయ్యాయని మంత్రి తెలిపారు. 32 మిక్చర్ యూనిట్ల లైసెన్స్‌లను రద్దు చేసి, 79 మిక్స్‌డ్ యూనిట్ల అనుమతి రద్దు చేశామని మంత్రి వివరించారు. నిత్యావసర వస్తువుల చట్టం,బ్లాక్ మార్కెటింగ్ నిరోధక చట్టం కింద కఠిన చర్యలు అమలు చేస్తున్నామన్నారు. యూరియా అక్రమ వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. . అటువంటి నేరస్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా జీరో టాలరెన్స్ అనే భావనను ప్రతిధ్వనించింది.
ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, రసాయన ఎరువుల మితిమీరిన వినియోగాన్ని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి ప్రాణం పథకం, యూరియా గోల్డ్, నానో యూరియా, నానో డిఎపి వంటి కార్యక్రమాలను రైతులకు ప్రయోజనం కలిగే విధంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, ఎరువుల శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
***
(Release ID: 1951248)
Visitor Counter : 124