ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి దక్షిణ ఆఫ్రికా కు మరియు గ్రీస్  కు బయలుదేరి వెళ్ళే కంటే ముందు జారీ చేసిన ప్రకటన

Posted On: 22 AUG 2023 6:17AM by PIB Hyderabad

దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా ఆహ్వానించిన మీదట నేను 2023 ఆగస్టు 22 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు బిఆర్ఐసిఎస్’ (‘బ్రిక్స్’) పదిహేనో శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం దక్షిణ ఆఫ్రికా గణతంత్రాన్ని సందర్శించనున్నాను. దక్షిణ ఆఫ్రికా అధ్యక్షత న జోహాన్స్ బర్గ్ లో జరుగనున్న పదిహేనో బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఇది.

బ్రిక్స్ వివిధ రంగాల లో ఒక బలమైన సహకారం సంబంధి కార్యక్రమాల పట్టిక ను అమలు పరుస్తోంది. గ్లోబల్ సౌథ్ దేశాలు అన్నింటా చేపట్టితీరవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరియు బహుళ పార్శ్విక వ్యవస్థ లో సంస్కరణలు సహా సమస్యాత్మక అంశాలపై చర్చించడం మరియు పర్యాలోచన జరపడం కోసం బ్రిక్స్ ఒక వేదిక వలె మారింది అనే విషయానికి మేం ప్రాధాన్యాన్ని ఇస్తున్నాం. భవిష్యత్తు లో ఏయే రంగాల లో సహకారం అవసరమో అనేది గుర్తించడం తో పాటు గా సంస్థాగత అభివృద్ధి పై సమీక్ష ను జరపడం కోసం ఒక ప్రయోజనకారి అవకాశాన్ని ఈ శిఖర సమ్మేళనం అందించనుంది.

జోహాన్స్ బర్గ్ లో నేను మకాం పెట్టిన కాలం లో, బ్రిక్స్ శిఖర సమ్మేళనం సంబంధి కార్యక్రమాల లో భాగం గా నిర్వహించే ‘బ్రిక్స్-ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ కార్యక్రమం లో కూడాను నేను పాలుపంచుకోనున్నాను. ఈ కార్యక్రమం లో భాగం పంచుకోవలసింది గా ఆహ్వానించినటువంటి అనేక అతిథి దేశాల తో భేటీ కావాలని నేను ఆశపడుతున్నాను.

జోహాన్స్ బర్గ్ కు విచ్చేసే నాయకుల లో కొంత మంది తో ద్వైపాక్షిక సమావేశాల లో పాలుపంచుకోవాలని కూడా నేను ఉత్సుకత తో ఉన్నాను.

గ్రీస్ ప్రధాని శ్రీ కిరియాకోస్ మిత్సోతాకిస్ ఆహ్వానించిన మీదట, 2023 ఆగస్టు 25 వ తేదీ న దక్షిణ ఆఫ్రికా నుండి పయనమై గ్రీస్ లోని ఏథెన్స్ కు పయనమవుతాను. ఈ ప్రాచీనమైనటువంటి దేశాని కి ఇది నా తొలి యాత్ర కానుంది. నలభై సంవత్సరాల అనంతరం గ్రీస్ ను సందర్శిస్తున్న ఒకటో భారతదేశం ప్రధాన మంత్రి ని అయ్యే గౌరవం నాకు లభించనుంది.

మన రెండు నాగరకత ల మధ్య గల సంబంధాలు రెండు వేల సంవత్సరాల కంటే పురాతనం అయినటువంటివి. ఆధునిక కాలం లో, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన మరియు బహుళవాదం ల యొక్క తాలూకు ఉమ్మడి విలువ ల ద్వారా మన సంబంధాలు బలపడ్డాయి. వ్యాపారం మరియు పెట్టుబడి, రక్షణ, సాంస్కృతిక సంబంధాలు మరియు ఇరు దేశాల మధ్య ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి వివిధ రంగాల లో సహకారం మన రెండు దేశాల ను మరింత చేరువ కు తీసుకు వస్తోంది.

బహుముఖీనమైనటువంటి మన సంబంధాల లో ఒక క్రొత్త అధ్యాయం గ్రీస్ కు నేను జరిపే యాత్ర తో ఆరంభం అవుతుందని నేను ఆశిస్తున్నాను.

 

***


(Release ID: 1951128)