గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

జిల్లా స్థాయిలో 75 అమృత్ సరోవర్ (చెరువులు) నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోని పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హర్యానా, బీహార్ మరియు రాజస్థాన్‌లోని కొన్ని జిల్లాలు


66,278 అమృత్ సరోవర్ నిర్మాణం / పునరుద్ధరణ

Posted On: 19 AUG 2023 3:23PM by PIB Hyderabad

మిషన్ అమృత్ సరోవర్‌ పథకం కింద  ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువులు నిర్మించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, హర్యానా, బీహార్,రాజస్థాన్ రాష్ట్రాల్లో  కొన్ని జిల్లాలు లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్నాయి.  ఈ జిల్లాలు  75 చెరువుల  లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదు.

మిషన్ అమృత్ సరోవర్‌ పథకం కింద 1,12,277 చెరువులను ప్రభుత్వం గుర్తించింది. వీటిలో  81,425 చెరువుల నిర్మాణం పని ప్రారంభమైంది.  66,278 చెరువుల నిర్మాణం /పునరుజ్జీవం కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. 

నేపథ్యం: 

ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత్ సరోవర్‌లను (చెరువులు) నిర్మాణం /పునరుద్ధరణ ద్వారా స్థిరమైన నీటి వనరులను అందించడం లక్ష్యంగా మిషన్ అమృత్ సరోవర్‌ పథకం  అమలు జరుగుతోంది. మిషన్ అమృత్ సరోవర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022  ఏప్రిల్ 24 న ప్రారంభించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా మిషన్ అమృత్ సరోవర్‌ పథకం జాతీయ స్థాయి లక్ష్యాన్ని సాధించింది. మిషన్ అమృత్ సరోవర్‌ పథకం కింద జాతీయ స్థాయిలో  50,000 చెరువుల నిర్మాణం/పునరుద్ధరణ జరిగింది. 

మొత్తం ప్రభుత్వ విధానంతో మిషన్ అమృత్ సరోవర్‌ పథకం అమలు జరుగుతోంది. పథకం అమలులో  8 కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు పాల్గొంటున్నాయి.  గ్రామీణాభివృద్ధి శాఖ, భూ వనరుల శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ , పర్యావరణం మరియు వాతావరణ మార్పు, రైల్వే మంత్రిత్వ శాఖ, రోడ్డు, రవాణా,  రహదారుల మంత్రిత్వ శాఖ కలిసి సమన్వయంతో పథకాన్ని అమలు చేస్తున్నాయి. పథకం అమలుకు అవసరమైన సాంకేతిక సహాయాన్ని  భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) అందిస్తోంది. . మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ,15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన  గ్రాంట్లు, వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ వంటి పీఎం కెఎస్ వైసబ్ స్కీమ్‌లు, రాష్ట్రాల స్వంత పథకాలతో పాటు హర్ ఖేత్ కో పానీ వంటి వివిధ పథకాలను తిరిగి కేంద్రీకరించడం ద్వారా మిషన్ అమృత్ సరోవర్‌ పథకం   రాష్ట్రాలు, జిల్లాలలో అమలు జరుగుతోంది. పథకం అమలులో ప్రజలు, ప్రభుత్వేతర సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు.  

 

***

 



(Release ID: 1950631) Visitor Counter : 159