ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశం అధ్యక్షతన జీ-20 సమావేశం


గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జీ-20 ఆరోగ్య శాఖల మంత్రుల సమావేశంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా సాంప్రదాయ వైద్య విధానంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

ప్రాచీన జ్ఞానం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మేళవించి 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే విధానం అమలు చేస్తూ ఆరోగ్య సంబంధిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు సమిష్టి కృషి జరగాలి.... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

"ఆధునిక కాలంలో సహజ, మూలికా ఆధారిత ఔషధాలు, సౌందర్య సాధనాల వినియోగం సాంప్రదాయ వైద్యం విధానం ప్రాముఖ్యతకు నిదర్శనం"--- డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

" ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ వైద్య విధానం అభివృద్ధికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రధాన కేంద్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నెలకొల్పిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ సహకరిస్తుంది... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించడం, ప్రజలకు సాధికారత కల్పించడం, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో సాంప్రదాయ వైద్యం కీలక పాత్ర పోషిస్తుంది: శ్రీ సర్బానంద సోనోవాల్

జాతీయ ఆరోగ్య వ్యవస్థలో సాంప్రదాయ ఔషధాల వినియోగాన

Posted On: 17 AUG 2023 12:06PM by PIB Hyderabad

  గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జీ-20 ఆరోగ్య శాఖల మంత్రుల సమావేశంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా సాంప్రదాయ వైద్య విధానంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్,  ప్రపంచ ఆరోగ్య సంస్థ, డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తో కలిసి కేంద్ర  ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. ఆగస్టు 17 నుంచి  19 వరకు సదస్సు జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమంలో ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాలుభాయ్, గుజరాత్ ఆరోగ్య మంత్రి శ్రీ రుషికేష్ పటేల్, భూటాన్ ఆరోగ్య మంత్రి శ్రీమతి లోన్‌పో దాషో డెచెన్ వాంగ్మో, బొలీవియా సంప్రదాయ వైద్యం  జాతీయ డైరెక్టర్ శ్రీమతి వివియన్ టి. కమాచి హినో జోసా కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ మాండవీయ ప్రాచీన జ్ఞానం, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మేళవించి  'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు' అనే విధానం అమలు చేస్తూ  ఆరోగ్య సంబంధిత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు  సమిష్టి కృషి జరగాలన్నారు. గుజరాత్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు  లక్ష్య సాధనకు ఉపకరిస్తుందన్నారు. జీ-20 ఆరోగ్య శాఖల మంత్రుల సమావేశంలో భాగంగా ఏర్పాటైన సదస్సును ఆయుష్ మంత్రిత్వ శాఖ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తోంది.  

 "అందరికీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు వైపు" అనే ఇతివృత్తంతో  ఆగస్టు 17 నుంచి 18 వరకు జరిగే రెండు రోజుల శిఖరాగ్ర సమావేశం, ఒత్తిడితో కూడిన ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడం, ప్రపంచ ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి సాధించడంలో సాంప్రదాయ వైద్య విధానం పాత్ర,సమగ్ర వైద్య విధానాల పాత్రను చర్చిస్తుంది. 

సదస్సులో మాట్లాడిన డాక్టర్ మాండవీయ ' సాంప్రదాయ, పరిపూర్ణమైన వైద్య రంగం అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ సదస్సులో ఆలోచనల మార్పిడి, సహకారం, అంతర్జాతీయ భాగస్వామ్యం తదితర అంశాలపై  చర్చలు జరుగుతాయి. శతాబ్దాలుగా, సాంప్రదాయ  పరిపూరకరమైన వైద్యం వ్యక్తిగత,  సమాజ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. ఆధునిక కాలంలో కూడా  సహజ,   మూలికా ఆధారిత ఔషదాలు, సౌందర్య సాధనాల వినియోగం  సాంప్రదాయ వైద్యం పద్ధతుల యొక్క  ప్రాముఖ్యతను తెలియజేస్తుంది" అని అన్నారు. 

సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులను ఆహ్వానించిన డాక్టర్ మాండవీయ “ జాతిపిత మహాత్మా గాంధీ పేరును కలిగి ఉన్న గాంధీనగర్, ఈ ప్రతిష్టాత్మక శిఖరాగ్ర సమావేశానికి తగిన వేదికగా ఉంది  భారతదేశం  ఉక్కుమనిషి  సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి దిగ్గజాలు జన్మస్థలం  గుజరాత్ ఘనమైన  చరిత్ర , సంస్కృతి కలిగి ఉన్న కూడిన గొప్ప భూమి. స్వాతంత్ర్యం తర్వాత జాతీయ సమైక్యత పట్ల   సర్దార్ వల్లభాయ్ పటేల్    చూపిన అచంచలమైన స్ఫూర్తి, నిబద్ధత  దేశంపై చెరగని ముద్ర వేసింది." అని అన్నారు. 

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య  సంస్థ నెలకొల్పిన   గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ విజ్ఞాన కేంద్రంగా పనిచేస్తుందని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.   పనిచేస్తుంది, ప్రజలు,ప్రపంచం   అభివృద్ధి కోసం ఆధునిక విజ్ఞానం తో పురాతన జ్ఞానాన్ని కేంద్రం ఏకీకృతం చేస్తుందన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో  ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ ఔషధం అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. 

 శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ "సంప్రదాయ వైద్య విధానంపై  మొట్టమొదటి సారిగా ఏర్పాటైన అంతర్జాతీయ సదస్సు ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆరోగ్య సంరక్షణ రంగంలో   సరిహద్దులు దాటి ఆరోగ్య రంగం  భవిష్యత్తు కోసం దేశాలను  ఏకం చేస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణలో కొత్త శకానికి నాంది పలుకుతుంది" అని అన్నారు. సాంప్రదాయ ఔషధాలలో సహకారం, ఆవిష్కరణల కోసం అవకాశం ఉన్న  ప్రాంతాలను గుర్తించి సార్వత్రిక ఆరోగ్యలక్ష్యాలను సాధించడంలో సాంప్రదాయ వైద్యాన్ని ఉపయోగించడానికి సదస్సు అవకాశం కల్పిస్తుందని  ఆయన  చెప్పారు.

స్థానిక ప్రజలు, సంప్రదాయ వైద్య విధానాలకు అవినాభావ సంబంధం ఉందని శ్రీ సోనోవాల్ అన్నారు.  "సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించడం, ప్రజలకు  సాధికారత కల్పించడం, దేశ  వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం  ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, సంక్షేమం  మెరుగుపరచడంలో సంప్రదాయ వైద్యం కీలక పాత్ర పోషిస్తుంది." అని  శ్రీ సోనోవాల్ అన్నారు. 

ఆయుష్మాన్ భారత్  పథకం కింద సార్వత్రిక ఆరోగ్య రక్షణ మెరుగుపరచడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల పట్ల  డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హర్షం వ్యక్తం చేశారు. సదస్సు ముందు రోజు  ఆయన హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ని సందర్శించి ప్రాథమిక ఆరోగ్య సేవల వివరాలు తెలుసు కున్నారు. భారతదేశం అమలు చేస్తున్న టెలిమెడిసిన్‌ ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెలిమెడిసిన్‌ వల్ల   ఆరోగ్య సేవల పరిధి విస్తరించిందని , రోగులకు సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని అన్నారు. 

సాంప్రదాయ ఔషధాలు  పర్యావరణం మధ్య ఉన్న సంబంధాన్నిడాక్టర్. ఘెబ్రేయేసస్ వివరించారు.    "సాంప్రదాయ వైద్యం మానవాళి అంత పురాతనమైనది, అన్ని దేశాలలోని ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో సంప్రదాయ వైద్యం పద్ధతులు ఉపయోగించారు." అని  డాక్టర్. ఘెబ్రేయేసస్ వ్యాఖ్యానించారు. జాతీయ ఆరోగ్య వ్యవస్థలో సాంప్రదాయ ఔషధాల వినియోగాన్ని ఏకీకృతంచేయడం,  సైన్స్ ద్వారా సాంప్రదాయ ఔషధం శక్తిని బహిర్గతం చేయడానికి గుజరాత్ ప్రకటన అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. 

వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్, డాక్టర్ న్గోజీ ఒకోంజో-ఇవేలా ఒక వీడియో సందేశంలో సాంప్రదాయ వైద్యం విరుద్ధం కాదని,  ఆధునిక వైద్యానికి అనుబంధమని అన్నారు. . సాంప్రదాయ వైద్యంపై అవగాహనను విస్తృతం చేసేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని, సదస్సులో  లేవనెత్తిన సమస్యలకు సమిష్టి  కృషి ద్వారా పరిష్కార మార్గాలు రూపొందించడానికి అవకాశం కలుగుతుందన్నారు.  

 గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ మాట్లాడుతూ సాంప్రదాయ వైద్యంపై మొట్టమొదటి అన్తరాజతీయ సదస్సు  నిర్వహించడం గుజరాత్‌కు ,భారతదేశానికి గర్వకారణమని అన్నారు.  "అందరూ సంతోషంగాఉండాలి. , అందరూ వ్యాధి నుండి విముక్తిపొందాలి అన్న స్ఫూర్తితో భారతదేశం పనిచేస్తుందన్నారు.

భూటాన్‌ ఆరోగ్య మంత్రి శ్రీమతి లోన్‌పో దాషో డెచెన్ వాంగ్మో, భూటాన్‌లో అమలు చేస్తున్న  సోవా రిగ్పాకార్యక్రమాన్ని వివరించారు. తమ దేశంలో  సాంప్రదాయ ఔషధాలు కేవలం వైద్యం చేసే వ్యవస్థగా  మాత్రమే కాకుండా  ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ నిర్మాణంలో కీలకంగా ఉన్నాయన్నారు. 

 రెండు రోజుల పాటు జరిగే సదస్సులో  ప్రపంచంలోని సాంప్రదాయ ఔషధ రంగానికి  వివిధ కోణాలపై వివరణాత్మక చర్చలు జరుగుతాయి. సంప్రదాయ వైద్య వ్యవస్థల వినియోగంపై అవసరం, ప్రభావం, ఆవిష్కరణ, సమాచారం, ప్రపంచవ్యాప్తంగా సాంప్రదాయ ఔషధం విలువ, వైవిధ్యాన్ని ప్రదర్శించే  ఒక ప్రత్యేక ప్రదర్శన కూడా నేడు శిఖరాగ్ర సమావేశంలో భాగంగాఏర్పాటు చేశారు. 

కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సుధాన్ష్ పంత్, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కొటేచా, ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ రీజినల్ డైరెక్టర్  డాక్టర్ హన్స్ క్లూగే,  ఆగ్నేయాసియా  రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ కూడా పాల్గొన్నారు. సదస్సులో ప్రపంచం వివిధ ప్రాంతాలకు చెందిన  శాస్త్రవేత్తలు, సాంప్రదాయ వైద్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలు, , ప్రజా సంఘాల  సభ్యులు పాల్గొననున్నారు.

 

***


(Release ID: 1949902) Visitor Counter : 214