రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వంతెన‌లు, ఇత‌ర నిర్మాణాల రూప‌క‌ల్ప‌న & నిర్మాణాన్ని స‌మీక్షించేందుకు డిజైన్ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్ఎఐ

Posted On: 16 AUG 2023 2:24PM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా జాతీయ ర‌హ‌దారులు, ఆర్ఇ గోడ‌ల‌, సొరంగాలు, క‌ట్ట‌డాలు, వంతెల‌నల ప్ర‌ణాళిక‌, రూప‌క‌ల్ప‌న‌, నిర్మాణం, నిర్వ‌హ‌ణ కోసం విధానాన్ని, మార్గ‌ద‌ర్శ‌నాల‌ను రూపొందించి, వంతెన‌ల, ప్ర‌త్యేక క‌ట్ట‌డాలు లేదా నిర్మాణాల‌, సొరంగాల న‌మూనా, నిర్మాణాల‌ను స‌మ‌ర్ధ‌వంతంగా స‌మీక్షించేందుకు ఎన్‌హెచ్ఐఎ డిజైన్ డివిజ‌న్‌ను ఏర్పాటు చేసింది. 
ఈ విభాగం ప్రాజెక్టు సంసిద్ధ‌త‌, నూత‌న వంతెన‌ల నిర్మాణం, పాత‌/  దెబ్బ‌తిన్న వంతెన‌లు, కీల‌క వంతెన‌ల, నిర్మాణాల‌, సొరంగాలు, ఆర్ఇ గోడ‌ల‌ ఆరోగ్యాన్ని ప‌రీక్షించేందుకు సాధ‌నాల‌ను స‌మీక్షిస్తుంది. జూన్ 2023 త‌రువాత  డిపిఆర్‌లు ప్రారంభించి, డిపిఆర్ ద‌శ‌లో ఉన్న స్వ‌తంత్ర బ్రిడ్జిల‌ను, ప్ర‌త్యేక నిర్మాణాల‌ను కూడా ఇది స‌మీక్షిస్తుంది. 
ఇందుకు అద‌నంగా, నిర్మాణ ప‌ద్ధ‌తులు, తాత్కాలిక నిర్మాణాలు, లిఫ్టింగ్ అండ్ లాంచ్ ప‌ద్ధ‌తులు, 200 మీట‌ర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఎంపిక చేసిన వంతెన‌లు, నిర్మాణాల ప్రీస్ట్రెస్సింగ్ ప‌ద్ధ‌తులు ద్వారా యాదృచ్ఛిక ప్రాతిప‌దిక‌న ఈ విభాగం స‌మీక్షిస్తుంది. 
ఇదికాక‌,  సాగుతున్న ప్రాజెక్టుల‌లో 200 మీట‌ర్ల క‌న్నా ఎక్కువ ఎత్తు ఉన్న సాగుతున్న అన్ని వంతెన‌లు/  నిర్మాణాల న‌మూనాల స‌మీక్ష‌ను చేప‌డ‌తారు. వీటితోపాటుగా, 60 మీట‌ర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో గ‌ల ఇత‌ర వంతెన‌లు, 200 మీట‌ర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలోని నిర్మాణాలు & సొరంగాలు, 10 మీట‌ర్ల కంటే ఎక్కువ ఎత్తు గ‌ల ఆర్ఇ గోడ‌లు, ఇత‌ర ప్ర‌త్యేక నిర్మాణాల న‌మూనాల‌ను యాధృచ్ఛిక ప్రాతిప‌దిక‌న స‌మీక్షించ‌డం జ‌రుగుతుంది. 
భాగ‌స్వాముల‌ను చేసుకుంటుంది. 
ఇందుకు అద‌నంగా, ఇండియ‌న్ అకాడ‌మీ ఆఫ్ హైవే ఇంజ‌నీర్స్ (ఐఎహెచ్ఇ) ద్వారా వంతెన‌లు, సొరంగాలు, ఆర్ ఇ గోడ‌ల రూప‌క‌ల్ప‌న‌, నిర్మాణం, ప‌ర్య‌వేక్ష‌ణ‌& నిర్వ‌హ‌ణ వంటి వివిధ అంశాల‌పై ఎంఒఆర్‌టిహెచ్‌, ఎన్‌హెచ్ఎఐ, ఎన్‌హెచ్ఐడిసిఎల్ అధికారుల‌కు, కాంట్రాక్ట‌ర్లు/ క‌న్స‌ల్టెంట్ల సిబ్బందికి స‌ర్టిఫికేష‌న్ కోర్సుల‌ను నోయిడాలోని ఇండియ‌న్ అకాడెమీ ఆఫ్ హైవే ఇంజినీర్లు (ఐఎహెచ్ఇ), పూణెలోని ఇండియ‌న్ రైల్వేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ (ఐఆర్ఐసిఇఎల్‌)కు స‌ర్టిఫికేష‌న్ కోర్సుల‌ను విభాగం నిర్వ‌హిస్తుంది. 
వంతెన‌ల ఇన్వెంట‌రీ (ప‌ట్టిక‌), డ్రాయింగ్‌లు,  దెబ్బ‌తిన్న వంతెన‌ల గుర్తింపు కోసం, వాటి మ‌ర‌మ‌త్తు, నిర్మాణం కోసం వార్షిక ప్రణాళిక‌ను రూపొందించే నిమిత్తం డిజైన్ విభాగం ఐటి ఆధారిత ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేస్తుంది. వంతెన‌లు, నిర్మాణాలు, సొరంగాలు, ఆర్ఇ గోడ‌లు విఫ‌లం అయితే వాటి వివ‌ర‌ణాత్మ‌క విశ్లేష‌ణ‌, భ‌విష్య‌త్తులో ఇటువంటి వైఫ‌ల్యాల‌ను నివారంచేందుకు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసేందుకు నిపుణుల బృందాన్ని కూడా నియ‌మిస్తుంది. 
దేశ‌వ్యాప్తంగా పెద్ద సంఖ్య‌లో జాతీయ ర‌హ‌దారి మౌలిక స‌దుపాయాల అభివృద్ధి అమ‌లులో ఉన్నందున డిజైన్ విభాగం వంతెన‌లు, ఇత‌ర క్లిష్ట‌మైన నిర్మాణాల రూప‌క‌ల్ప‌న‌, ప్రూఫ్ చెకింగ్‌, వంతెన‌ల నిర్మాణం, ఇత‌ర కీల‌క నిర్మాణాల అంత‌ర్గ‌త సామ‌ర్ధ్యాన్ని పెంపొందించేందుకు సాయ‌ప‌డుతుంది. 

 

***


(Release ID: 1949690) Visitor Counter : 106