ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జీ 20 ఇండియా అధ్యక్షత
జీ 20 ఆరోగ్య మంత్రిల సమావేశం ఆగస్టు 17 నుండి గాంధీనగర్‌లో ప్రారంభమవుతుంది
సాంప్రదాయ వైద్య రంగంలో భారతదేశ నాయకత్వాన్ని ప్రదర్శించడానికి జీ 20 ఒక ప్రత్యేకమైన అవకాశం. గత 9 సంవత్సరాలలో, భారతదేశం సాంప్రదాయ వైద్య రంగంలో 8 రెట్లు అభివృద్ధి చెందింది: కేంద్ర ఆయుష్ కార్యదర్శి
"సాంప్రదాయ వైద్యంపై ప్రపంచ సదస్సు ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడంలో మరియు ప్రపంచ ఆరోగ్యం మరియు సుస్థిరమైన అభివృద్ధిలో పురోగతిని సాధించడంలో సాంప్రదాయ, పరిపూరకరమైన మరియు సమగ్ర ఔషధం యొక్క పాత్రను అన్వేషిస్తుంది"
స్థోమత, అందుబాటు మరియు వినియోగంపై భారతదేశం దృష్టి కేంద్రీకరించడం ఆరోగ్య రంగంలో ప్రధాన అంశాలు. ఇవి ఆరోగ్య సంరక్షణపై ప్రపంచ స్థాయిని సాధించడంలో మనకు సహాయపడుతుంది: శ్రీ లవ్ అగర్వాల్
"అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023పై జీ 20 సహ-బ్రాండెడ్ ఈవెంట్ తట్టుకునే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిర్మించడానికి ప్రపంచ సహకారాలు మరియు భాగస్వామ్యాలపై దృష్టి పెడుతుంది"
"దక్షిణాది ప్రపంచం యొక్క ఆందోళనలను వినిపించడానికి భారతదేశం తన జీ 20 అధ్యక్షతని ఉపయోగించడం కొనసాగిస్తుంది"
ప్రపంచంలోని డిజిటల్ ఆ
Posted On:
16 AUG 2023 4:39PM by PIB Hyderabad
జీ 20 ఇండియా ప్రెసిడెన్సీలో జీ 20 ఆరోగ్య మంత్రుల సమావేశం 2023 ఆగస్టు 17 - 19 మధ్య గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతుంది. 1 డిసెంబర్ 2022న జీ 20 అధ్యక్ష పదవిని భారతదేశం చేపట్టింది మరియు ప్రస్తుతం ఇండోనేషియా, భారతదేశం మరియు బ్రెజిల్‌లతో కూడిన త్రైపాక్షిక జీ 20 లో భాగంగా ఉంది. భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ మొదటి సారిగా మూడు అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కలిసి ఉమ్మడి గా నిర్వహిస్తున్నాయి.
జీ 20 ఆరోగ్య మంత్రుల సమావేశం యొక్క దృష్టి జీ 20 ఆరోగ్య అంశం సదస్సు మూడు కీలక ప్రాధాన్యతలపై ఉంటుంది, ఇందులో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నివారణ, సంసిద్ధత మరియు ప్రతిస్పందనతో పాటు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ మరియు సమిష్టి ఆరోగ్యం ఫ్రేమ్‌వర్క్; సురక్షితమైన, సమర్థవంతమైన, నాణ్యమైన మరియు సరసమైన వైద్యపరమైన వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్ మరియు డయాగ్నోస్టిక్స్ అందుబాటు మరియు లభ్యతపై దృష్టి సారించి ఔషధ రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం; మరియు డిజిటల్ హెల్త్ ఆవిష్కరణలు మరియు సార్వత్రిక ఆరోగ్య కవరేజీకి మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడానికి పరిష్కారాలు వంటి అంశాలు ఉంటాయి.
17 ఆగస్టు, 2023న జీ 20 డిప్యూటీల సమావేశం మరియు 18-19 ఆగస్టు, 2023లో జీ 20 ఆరోగ్య మంత్రుల సమావేశం కాకుండా, ఒకే ప్రపంచం ఒకే ఆరోగ్యం ప్రయోజనం పై వన్ ఎర్త్ వన్ హెల్త్ అడ్వాంటేజ్ హెల్త్ కేర్ - ఇండియా 2023తో సహా నాలుగు సైడ్ ఈవెంట్‌లు ఉంటాయి. డబ్ల్యూ హెచ్ ఓ సంప్రదాయ వైద్యం పై ప్రపంచ సదస్సు; ఇండియా మెడ్‌టెక్ ఎక్స్‌పో 2023; మరియు ' ఆగ్నేయ ఆసియా లో టీ బీ ని నివారించడానికి నిలకడైన, వేగవంతమైన వైద్యం పై ప్రాంతీయ సదస్సు' లు జరుగుతాయి.
జీ 20 ఆరోగ్య మంత్రుల సమావేశం ప్రధాన ఈవెంట్‌గా 19 ఆగస్టు 2023న ఉమ్మడి ఆర్థిక - ఆరోగ్య మంత్రుల సమావేశం కూడా నిర్వహించబడుతుంది. జీ 20 ఆరోగ్య మంత్రుల సమావేశం సందర్భంగా జీ 20 మరియు సైడ్ ఈవెంట్‌ల సంయుక్త సెషన్‌లు కూడా ఉంటాయి. గాంధీనగర్‌లో రేపటి నుండి ప్రారంభమయ్యే మూడు రోజుల ఈవెంట్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ ఈ విషయాన్ని తెలిపారు. ఆయుష్ సెక్రటరీ శ్రీ రాజేష్ కొటేచా మాట్లాడుతూ, “సాంప్రదాయ వైద్య రంగంలో భారతదేశ నాయకత్వాన్ని ప్రదర్శించడానికి జీ 20 ఒక ప్రత్యేకమైన అవకాశం. గత 9 సంవత్సరాలలో, భారతదేశం సాంప్రదాయ వైద్య రంగంలో 8 రెట్లు అభివృద్ధి చెందింది. సంవత్సరం చివరి నాటికి, దేశవ్యాప్తంగా 12,500 కంటే ఎక్కువ ఆయుష్ ఆధారిత హెల్త్ & వెల్నెస్ సెంటర్లు పనిచేస్తాయి, వాటిలో 8,500 ఇప్పటికే ఉన్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్‌ఓ ఏర్పాటు చేసిన సంప్రదాయ వైద్యం కేంద్రం అభివృద్ధి చెందుతున్న దేశంలోనే మొదటిదని కేంద్ర ఆయుష్ సెక్రటరీ హైలైట్ చేశారు. 2023 ఆగస్టు 17 మరియు 18 తేదీల్లో గాంధీనగర్‌లో ఆయుష్ మంత్రిత్వ శాఖ డబ్ల్యూ హెచ్ ఓ సహ-నిర్వహణ లో సాంప్రదాయ ఔషధ ప్రపంచ సదస్సును ఏర్పాటు చేస్తుందని, ఇది ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో సాంప్రదాయ, పరిపూరకరమైన మరియు సమగ్ర వైద్యం యొక్క పాత్రను అన్వేషిస్తుంది. ప్రపంచ ఆరోగ్యం మరియు సుస్థిరమైన అభివృద్ధిలో పురోగతిని ముందుకు నడిపిస్తుంది. మెడికల్ వాల్యూ ట్రావెల్, జీ 20 సహ-బ్రాండెడ్ అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2023 ఈవెంట్ లో సైడ్ ఈవెంట్. ఇది తట్టుకునే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను నిర్మించడం కోసం ప్రపంచ సహకారాలు మరియు భాగస్వామ్యాలపై దృష్టి సారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మెడికల్ వాల్యూ ట్రావెల్ కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చే అతిపెద్ద ఈవెంట్ ఇది. భారతదేశం మెడ్‌టెక్ ఎక్స్‌పో 2023ని ఫార్మాస్యూటికల్స్ విభాగం, రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. భారతదేశాన్ని మెడ్‌టెక్ యొక్క ప్రపంచ వేదిక గా మార్చడానికి మరియు ఈ దిశలో మేధో మథనం చేయడానికి వైద్య పరికరాల రంగం యొక్క గణనీయమైన సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుంది.
జీ 20 చొరవ కింద 'ఆగ్నేయాసియా ప్రాంతంలో టీ బీ ని నివారించే అంశంపై మంత్రివర్గ సమావేశం టీ బీ కి వ్యతిరేకంగా పోరాటాన్ని వేగవంతం చేయడం మరియు దాని నిర్మూలనను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ 20 భారతదేశ అధ్యక్షత అందరినీ కలుపుకొని, కార్యాచరణ ఆధారితంగా మరియు నిర్ణయాత్మకంగా ఉంటుందని పేర్కొన్నారు. గౌరవ ప్రధాన మంత్రి ఆవిష్కరించిన ఇతివృత్తం: 'వసుధైవ కుటుంబం' అనే భారతదేశ తత్వశాస్త్రం ఆధారంగా 'ఒకే భూమి, ఒక కుటుంబం, ప్రపంచ భవిష్యత్తు' అనేది మహమ్మారి అనంతరం పునర్ నిర్మాణానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం సమిష్టిగా కృషి చేయడానికి మార్గదర్శక సూత్రం.
ఇండియా జీ 20 ప్రెసిడెన్సీ కింద గుర్తించబడిన మూడు కీలక ఆరోగ్య ప్రాధాన్యతలపై శ్రీ లవ్ అగర్వాల్ విశదీకరించారు. స్థోమత, ప్రాప్యత మరియు వినియోగంపై భారతదేశం దృష్టి కేంద్రీకరించడం ఆరోగ్య రంగంలో ప్రపంచ స్థాయిని సాధించడంలో మాకు సహాయపడే ప్రధాన అంశాలు అని ఆయన పేర్కొన్నారు, దక్షిణాది ప్రపంచం యొక్క ఆందోళనలను వినిపించడానికి భారతదేశం తన జీ 20 ప్రెసిడెన్సీని ఉపయోగించడం కొనసాగిస్తుందని ఆయన తెలియజేశారు.
సమ్మిళిత విధానం ద్వారా తయారీ, పరిశోధన మరియు అభివృద్ధి కోణాలను విస్తరించడంపై దృష్టి సారిస్తామని శ్రీ లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ క్రింద, 19 ఆగస్టు, 2023న ప్రారంభించనున్న డిజిటల్ ఆరోగ్యం కోసం ప్రపంచ పూనిక ప్రపంచంలోని డిజిటల్ ఆరోగ్యం కోసం ప్రయత్నాలను ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.
గాంధీనగర్‌లో జరిగే 4వ హెచ్‌డబ్ల్యుజి సమావేశంలో 19 జి20 సభ్య దేశాలు, 10 ఆహ్వానించబడిన దేశాలు మరియు 22 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. 'అతిథి దేవో భవ' అనే భారతీయ సంప్రదాయం ఆధారంగా భారతదేశ వైవిధ్యం మరియు సంస్కృతిని ప్రదర్శించడానికి గుజరాతీ సంస్కృతి పరిమళాలు రుచులతో కూడిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ఈవెంట్ కోసం ప్లాన్ చేయబడ్డాయి. ప్రతినిధులు గుజరాత్ యొక్క పాక సంస్కృతిని కూడా అనుభవించగలరు, దాని సుందరమైన అందం మరియు ఉదారమైన ఆతిథ్యాన్ని ఆస్వాదించగలరు.
జీ 20 ప్రెసిడెన్సీ అధ్యక్షుడిగా, భారతదేశం ఆరోగ్య ప్రాధాన్యతలను కొనసాగించడం మరియు ఏకీకృతం చేయడం మరియు మునుపటి అధ్యక్షుల నుండి కీలకమైన సందేశాలను బలోపేతం చేయడం అవసరమయ్యే క్లిష్టమైన అంశాలను హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశం ఆరోగ్య సహకారంలో నిమగ్నమై ఉన్న వివిధ బహుపాక్షిక వేదికల మధ్య చర్చలలో కలయికను సాధించడం మరియు సమీకృత చర్య కోసం పని చేయడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
ఢిల్లీలోని పీఐబీ ఏడీజీ డాక్టర్ మనీషా వర్మ, గాంధీనగర్ పీఐబీ ఏడీజీ శ్రీ ప్రకాష్ మగ్దూం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
***
(Release ID: 1949688)
Visitor Counter : 282