సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
2023 జూలై నెలలో డిఏఆర్‌పిజి విడుదల చేసిన సిపిజిఆర్‌ఏఎంఎస్‌పై రాష్ట్రాలు/యూటీల పనితీరుపై 12వ నివేదిక
2023 జూలైలో రాష్ట్రం/యూటీలు పరిష్కరించిన మొత్తం ఫిర్యాదులు 69,523; రాష్ట్ర/యూటీ ప్రభుత్వాల్లో పెండెన్సీ 1,79,077 ఫిర్యాదులకు తగ్గించబడింది
ఈశాన్య రాష్ట్రాలలో సిక్కిం ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది. తర్వాత అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి
పెద్ద రాష్ట్రాల్లోని ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం..తర్వాతి స్థానాల్లో నిలిచిన జార్ఖండ్ మరియు రాజస్థాన్
20,000 కంటే తక్కువ ఫిర్యాదులు ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ ప్రభుత్వం..తర్వాతి స్థానాల్లో నిలిచిన ఛత్తీస్‌గఢ్ మరియు కేరళ
Posted On:
16 AUG 2023 3:01PM by PIB Hyderabad
అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్‌మెంట్ (డిఏఆర్‌పిజి) జూలై, 2023కు సంబంధించి రాష్ట్రాల సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సిపిజిఆర్‌ఏఎంఎస్) 12వ నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రజల ఫిర్యాదుల రకాలు మరియు వాటిని పరిష్కరించిన విధానాలు మరియు స్వభావంపై వివరణాత్మక విశ్లేషణను అందిస్తుంది.
2023 జూలై నెలలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా మొత్తం 69,523 ఫిర్యాదులు పరిష్కరించబడ్డాయి. సిపిజిఆర్‌ఏఎంఎస్ పోర్టల్‌లో స్వీకరించిన రాష్ట్రాలు/యూటీల ఫిర్యాదుల పెండింగ్‌లు రాష్ట్రాలు/యుటిల ప్రభుత్వాలలో ఫిర్యాదుల సంఖ్య 1,79,077 తగ్గింది.
2023 మేనెల నుండి డిఏఆర్‌పిజి సిపిజిఆర్‌ఏఎంఎస్ పోర్టల్‌లో వారి పనితీరు ఆధారంగా రాష్ట్రాలు/యూటీల ర్యాంకింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం డిఏఆర్‌పిజి రాష్ట్రాలు/యూటీలను 4 కేటగిరీలలో ర్యాంక్ చేస్తుంది. వాటిలో ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఫిర్యాదుల రసీదు సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు మరో రెండు కేటగిరీలు విభజించబడ్డాయి. ఈ ర్యాంకింగ్ రాష్ట్రాలు/యూటీలు వారి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సమీక్షించడానికి మరియు క్రమబద్ధీకరించడానికి మరియు ఇతర రాష్ట్రాలు/యూటిలతో తులనాత్మక అంచనాను కలిగి ఉండటానికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగం. గ్రీవెన్స్ రిడ్రెసల్ ఇండెక్స్‌లో 2 కొలతలు మరియు 4 సూచికలు ఉంటాయి.
ర్యాంకింగ్‌లు 01.01.2023 నుండి 31.07.2023 వరకు రెండు కోణాలలో (నాణ్యత మరియు ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం) రాష్ట్రాలు/యూటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి. 4 కేటగిరీలలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో టాప్ 3 ప్రదర్శకులు క్రింద చూపిన విధంగా ఉన్నారు:
క్రమ సంఖ్య
|
సమూహం
|
రాష్ట్రాలు/యూటీలు
|
ర్యాంక్ 1
|
ర్యాంక్ 2
|
ర్యాంక్ 3
|
1
|
గ్రూప్ ఏ
|
ఈశాన్య రాష్ట్రాలు
|
సిక్కిం
|
అస్సాం
|
అరుణాచల్ ప్రదేశ్
|
2
|
గ్రూప్ బి
|
కేంద్రపాలిత ప్రాంతాలు
|
లక్షద్వీప్
|
అండమాన్ & నికోబార్
|
లడఖ్
|
3
|
గ్రూప్ సి
|
>= 20000
ఫిర్యాదులు ఉన్న రాష్ట్రాలు
|
ఉత్తర ప్రదేశ్
|
జార్ఖండ్
|
రాజస్థాన్
|
4
|
గ్రూప్ డి
|
< 20000
ఫిర్యాదులు ఉన్న రాష్ట్రాలు
|
తెలంగాణ
|
ఛత్తీస్‌గఢ్
|
కేరళ
|
డిఏఆర్‌పిజి ఏఐ ఆధారిత భాషా సాధనం భాషిని సిపిజిఆర్‌ఏఎంఎస్ పోర్టల్‌తో అనుసంధానించింది.ఈ అనుసంధానం ప్రాంతీయ భాషా ఫిర్యాదుల పాఠాలను ఆంగ్లంలోకి అనువదించడానికి ఫిర్యాదుల పరిష్కార అధికారులకు (జిఆర్‌ఓలు) సులభతరం చేస్తుంది మరియు సంబంధిత ఫిర్యాదుదారులు ఆంగ్లం మరియు అనువదించబడిన మాతృభాష రెండింటిలోనూ తుది ప్రత్యుత్తరాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఇది పౌరుల మధ్య మెరుగైన అవగాహన మరియు కమ్యూనికేషన్‌ని నిర్ధారిస్తుంది.
2023 జూలైలో బిఎస్‌ఎన్‌ఎల్ కాల్ సెంటర్ 1,00,186 మంది పౌరుల నుండి ఫీడ్‌బ్యాక్‌ను సేకరించింది. ఇది జూలై 2022లో ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక సంఖ్యలో ఫీడ్‌బ్యాక్‌లను సేకరించిందని నివేదిక పేర్కొంది. వీరిలో సుమారు 35% మంది పౌరులు అత్యుత్తమమైన / చాలా మంచివి అందించారు.
****
(Release ID: 1949559)
Visitor Counter : 134