హోం మంత్రిత్వ శాఖ
'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో భాగంగా ఈ రోజు న్యూదిల్లీలోని తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేసి, సెల్ఫీ దిగిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు భారతదేశ గగనతలంలో ఎగురుతున్న కోట్లాది జెండాలు భారతదేశాన్ని గొప్పతనానికి చిహ్నంగా మళ్లీ మార్చాలన్న దేశ సమష్టి సంకల్పానికి ప్రతీకలు
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 'హర్ ఘర్ తిరంగ' ప్రచారం
భారతదేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలి, http://hargartiranga.comలో సెల్ఫీలను అప్‌లోడ్ చేయాలి, తోటి పౌరులను కూడా ప్రోత్సహించాలని హృదయ పూర్వక విజ్ఞప్తి
భారతదేశ ఐక్యత, సౌభ్రాతృత్వ స్ఫూర్తిని గౌరవిస్తూ ఈ రోజు న్యూదిల్లీలోని తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేసినట్లు తెలిపిన శ్రీ అమిత్ షా
Posted On:
14 AUG 2023 1:09PM by PIB Hyderabad
'హర్ ఘర్ తిరంగ' ప్రచారంలో భాగంగా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూదిల్లీలోని తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేసి, ఆ జెండాతో సెల్ఫీ దిగి, ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు భారతదేశ గగనతలంలో కోట్లాది జెండాలు ఎగురుతున్నాయని, భారతదేశాన్ని గొప్పతనానికి చిహ్నంగా మళ్లీ మార్చాలన్న దేశ సమష్టి సంకల్పానికి అవి ప్రతీకలు అని వరుస ట్వీట్ల ద్వారా శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'హర్ ఘర్ తిరంగ' ప్రచారం దేశవ్యాప్తంగా కొనసాగుతోందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. భారతదేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, ఆ జెండాతో సెల్ఫీలు దిగి http://hargartiranga.comలో అప్‌లోడ్ చేయాలని, జెండాలు ఎగురవేసేలా తోటి పౌరులను కూడా ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతదేశ ఐక్యత, సౌభ్రాతృత్వ స్ఫూర్తిని గౌరవిస్తూ ఈ రోజు న్యూదిల్లీలోని తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేసినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. ‘హర్ ఘర్ తిరంగ’ ప్రచారంలో పాల్గొన్నందుకు తాను అందుకున్న ప్రశంస పత్రాన్ని కూడా హోం మంత్రి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
*****
(Release ID: 1948847)
Visitor Counter : 144