ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అహమదాబాద్ లోనిబావ్ లా-బగోదరా హైవే మీద జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకుసంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


బాధితుల కుపిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి పరిహారాన్ని ఆయన ప్రకటించారు

प्रविष्टि तिथि: 11 AUG 2023 3:34PM by PIB Hyderabad

అహమదాబాద్ లోని బావ్ లా-బగోదరా హైవే మీద జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున, మరి ఇదే ప్రమాదం లో గాయపడిన వ్యక్తుల కు 50,000 రూపాయల వంతున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుండి పరిహారం గా ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘అహమదాబాద్ జిల్లా లో బావ్ లా - బగోదరా హైవే మీద రహదారి దుర్ఘటన జరిగిన సంగతి తెలిసి బాధపడ్డాను. ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వ్యక్తులు త్వరలో పునఃస్వస్థులు అగుదురుగాక. బాధితుల కు చేతనైన అన్ని విధాలు గాను సహాయాన్ని స్థానిక పాలన యంత్రాంగం అందిస్తోంది.

ఈ దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల యొక్క దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతున పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రమాదం లో గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని తెలిపింది.

 


(रिलीज़ आईडी: 1948050) आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam