అంతరిక్ష విభాగం
ఇస్రో రూపొందించిన చిన్న ఉపగ్రహ వాహకనౌకలను(ఎస్‌ఎస్‌ఎల్‌వి) ప్రయోగించేందుకు తమిళనాడులోని కులశేఖర పట్నంలో కొత్త స్పేస్ పోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు ప్రకటించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
భారత అంతరిక్ష విధానం 2023, ప్రభుత్వేతర సంస్థలు ఉపగ్రహ ప్రయోగాలు చేసేందుకు స్పేస్ పోర్టును. సాంకేతిక వెసులుబాటు, రేంజ్ భద్రతకు లోబడి , వాడుకునే సదుపాయం కల్పిస్తోంది.
Posted On:
10 AUG 2023 3:52PM by PIB Hyderabad
2023 అంతరిక్ష విధానం ప్రభుత్వ ఆమోదం పొందిందని, ప్రజలకోసంపబ్లిక్ డొమైన్‌లో ఉందని, కేంద్ర శాస్త్ర , సాంకేతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ (స్వతంత్ర):ప్రధానమంత్రి కార్యాలయం, ప్రజాఫిర్యాదులు, పెన్షన్‌లు, అణుఇంధనం, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ విధానం ప్రైవేటు రంగానికి ద్వారాలు తెరుస్తుందన్నారు.
ప్రభుత్వేతర సంస్థలు (ఎన్.జి.ఇ)లు , అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో మరింతగా పాల్గొనేందుకు, వివిధస్టేక్ హోల్డర్లు అంటే ఇన్`స్పేస్, ఇస్రో, ఎన్.ఎస్.ఐ.ఎల్, డిఒఎస్ లపాత్రను స్పష్టంగా నిర్వచిచండం జరిగింది.
ఇందుకు సంబంధించి రాజ్యసభలో డాక్టర్ జితేంద్రసింగ్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రభుత్వం, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్, ఆథరైజేషన్ సెంటర్ (ఇన్ `స్పేస్)ను సింగిల్ విండో ఏజెన్సీగా ఏర్పాటు చేసిందని చెప్పారు.
అంతరిక్ష కార్యకలాపాల ప్రోత్సాహకానికి , ఆథరైజేషన్‌కు దీనిని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇన్ స్పేస్ కు 2021`22లో 10 కోట్లు, 2022`23 లో 33 కోట్లు, 2023`24 లో 95 కోట్లరూపాయల బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలిపారు.
మరోవైపు రూ 2600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వం లేసర్ ఇంటర్‌ఫెరోమీటర్, గ్రావిటేషనల్ వేవ్ అబ్సర్వేటరీ `ఇండియా (లిగో` ఇండియా) ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించినట్టు డాక్టర్‌జితేంద్ర సింగ్ తెలిపారు.దీనికి డిపార్టమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లీడ్ ఏజెన్సీగా ఉంటుంది.బీప ఈ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత, లిగో ఇండియా ఒక జాతీయ సంస్థగా రూపుదిద్దుకుంటుంది. ఇది గ్రావిటేషన్ తరంగాలు వాటి పరిశోధన సంబంధింత అంశాలను చేపడుతుంది.
చంద్రయాన్ `3 గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ జితేంద్రసింగ్, స్పేస్ క్రాఫ్ట్‌ను విజయవంతంగా 2023 జూలై 12న ఎల్.వి.ఎం 3 ద్వారా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం, షార్ సెంటర్‌నుంచి మధ్యాహం 2.35 గంటలకు ప్రయోగించినట్టు తెలిపారు. ఇది ట్రాన్సులార్ ఆర్బిట్‌లో ఉందని, 2023ఆగస్టు 5న లూనార్‌ఆర్బిట్‌లోచేర్చే ప్రక్రియను నిర్దేశించినట్టు తెలిపారు.
***
(Release ID: 1947682)
Visitor Counter : 243