సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టంచేసిన కేంద్ర ప్రభుత్వం.


ప్రస్తుత ఏడాదితోపాటు గత మూడు సంవత్సరాలలో (2020`2023) రూల్‌ 56(జె) కింద 122 మంది అధికారులకు నిర్బంధ పదవీవిరమణ ఇచ్చినట్టు తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద సింగ్‌.

Posted On: 09 AUG 2023 4:27PM by PIB Hyderabad

కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాద న ఏదీ పరిశీలనలో లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర శాస్త్ర , సాంకేతిక శాఖ సహాయ(స్వతంత్ర)మంత్రి, ప్రధానమంత్రి కార్యలయం, సిబ్బంది వ్యవహారాలు, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌, ప్రస్తుత ఏడాదితోపాటు గత మూడు సంవత్సరాలలో (2020`2023) నిబంధన 56 (జె) కింద 122 మంది అధికారులకు నిర్బంధ పదవీవిరమణ ఇచ్చినట్టు తెలిపారు.
ప్రొబిటి పోర్టల్‌లో ఇచ్చిన తాజా సమాచారం ఆధారంగా వివరాలు అందిస్తూ మంత్రి, 30.06.2023 నాటికి , వివిధ మంత్రిత్వశాఖలు, డిపార్టమెంట్‌లు, కేడర్‌ కంట్రోలింగ్‌ అథారిటీలు (సిసిఎ), ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ అధికారులపై ఫండమెంటల్‌ రూల్స్‌ (ఎఫ్‌.ఆర్‌) 56`జె, అలాగే ఇందుకు సంబంధించిన పలు ప్రొవిజన్ల కింద చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ఎఫ్‌.ఆర్‌. 56(జె) కింద సమీక్షా ప్రక్రియ లక్ష్యం, అలాగే ఇలాంటి నిబంధనల లక్ష్యం పాలనాయంత్రాంగంలో సమర్ధత పెంచడమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం డిజిటైజేషన్‌ ప్రక్రియపై నిరంతరం శ్రద్ద వహిస్తోందనేఇ, ఆఫీసు సామర్ధ్యాన్ని పెంచిందని, నిబంధనలను సరళతరం చేసిందని, ఎప్పటిప్పుడు కేడర్‌ పునర్‌ వ్యవస్థీకరిస్తోందని, పనికిరాని చట్టాలను రద్దు చేస్తూ వస్తోందని, ఫలితంగా పాలనాయంత్రాంగం సమర్ధత పెరుగుతోందని, మొత్తంగా ప్రభుత్వ పనితీరు , పాలనలో సమర్ధత పెరుగుతోందని చెప్పారు.

 

***

 



(Release ID: 1947347) Visitor Counter : 96