వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ఎపెడా తాజా దానిమ్మ పండ్ల ఎగుమతి మొదటి ట్రయల్ షిప్‌మెంట్‌ను విమాన రవాణా ద్వారా అమెరికా కి ఎగుమతి చేస్తుంది


అమెరికాకి దానిమ్మ పండ్ల ఎగుమతులు పెరగడం వల్ల అధిక ధర లభించి రైతుల ఆదాయం పెరుగుతుంది

అమెరికాలోని దిగుమతిదారుల నుండి ప్రోత్సాహకరమైన ప్రతిస్పందన

Posted On: 08 AUG 2023 1:33PM by PIB Hyderabad

పండ్ల ఎగుమతుల అవకాశాలను పెంపొందించేందుకు, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపెడా), తాజా దానిమ్మపండును విమానాల ద్వారా అమెరికా కి మొదటి ట్రయల్ షిప్‌మెంట్‌ను ఎగుమతి చేయడానికి సులభతరం చేసింది. అమెరికాకి దానిమ్మపండు యొక్క మొదటి ఎగుమతి సరుకును  ఎపెడా చెందిన నేషనల్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ (NPPO), అమెరికా యొక్క యానిమల్ & ప్లాంట్ హెల్త్ ఇన్‌స్పెక్షన్ సర్వీస్ (అమెరికా-ఏ పీ హెచ్ ఐ ఎస్), మహారాష్ట్ర స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డ్ , ఐకార్ దానిమ్మపై జాతీయ పరిశోధన కేంద్రం, షోలాపూర్ (ఎన్ఆర్సీ-సోలాపూర్) మరియు ఇతరులు  సహకారంతో ప్రారంభించింది.

 

ఎపెడా చైర్మన్ శ్రీ అభిషేక్ దేవ్ మాట్లాడుతూ అమెరికాకి దానిమ్మపండు ఎగుమతులు పెరగడం వల్ల అధిక ధర లభిస్తుందని మరియు రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. దానిమ్మ షిప్‌మెంట్‌కు దిగుమతిదారుల నుంచి ప్రోత్సాహకరమైన స్పందన వస్తోంది.

 

భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల ఎగుమతి చేసే అగ్రగామిగా ఉన్న ఎపెడా రిజిస్టర్డ్ '. ఐ ఎన్ ఐ ఫార్మ్స్' ద్వారా దానిమ్మపండు యొక్క ట్రయల్ షిప్‌మెంట్ జరిగింది. ఇది నేరుగా రైతులతో పని చేయడం ద్వారా అరటి మరియు దానిమ్మ యొక్క విలువ గొలుసు వ్యవస్థ ను నిర్మించింది. ఆగ్రోస్టార్ గ్రూప్‌లో భాగమైన ఐ ఎన్ ఐ ఫార్మ్స్ ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలకు ఎగుమతి ఉత్పత్తులతో రైతులకు వ్యవసాయ శాస్త్రం, వ్యవసాయ-ఇన్‌పుట్‌లు మరియు ఆఫ్-టేక్  పూర్తి సేవలు అందిస్తోంది. సుదూర మార్కెట్ మరియు అధిక ధర తో కూడిన ఎగుమతి వాణిజ్య కార్యకలాపాల నేపథ్యంలో దానిమ్మపండు యొక్క ట్రయల్ షిప్‌మెంట్ ఎగుమతి నాణ్యమైన పండ్లను ఎగుమతి చేసేలా ద్వారా భారతీయ ఎగుమతిదారులు మరియు అమెరికా దిగుమతిదారులలో సామర్థ్యాలను పెంపొందించడంలో సహాయపడుతుంది.

 

అమెరికా మార్కెట్‌లలో భారతీయ మామిడి పండ్లకున్న గిరాకీ పట్ల ఉత్సాహంగా ఉన్న ఎగుమతిదారులు యుఎస్‌ఎలో దానిమ్మ కూడా విజయవంతమైన ఉత్పత్తి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానిమ్మ ఎగుమతి విలువ గొలుసులో ట్రేసబిలిటీని నిర్ధారించడం కోసం, ఎపెడా చే అభివృద్ధి చేయబడిన వ్యవస్థ అయిన అనార్ నెట్  కింద వ్యవసాయ క్షేత్రాలను నమోదు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎపెడా రోజూ ప్రచార చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అమెరికా మరియు ఆస్ట్రేలియాలో అధిక నాణ్యత గల భారతీయ దానిమ్మలను అనుమతించడానికి మార్గాన్ని సుగమం చేయడం ద్వారా మార్కెట్ యాక్సెస్‌ను పొందడంలో ఎపెడా గణనీయమైన పాత్ర పోషించింది.

 

అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ మరియు సూపర్ ఫ్రూట్ లక్షణాల కారణంగా, మహారాష్ట్ర నుండి 'భగ్వా' దానిమ్మ గణనీయమైన ఎగుమతి సామర్థ్యాన్ని కలిగి ఉంది. 'భగ్వా' రకానికి చెందిన దానిమ్మకు ఓవర్సీస్ మార్కెట్‌లో గణనీయమైన డిమాండ్ ఉంది. దేశం నుండి దానిమ్మ ఎగుమతిలో మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా దాదాపు 50 శాతం వాటాను అందిస్తుంది.

 

2022-23లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, బహ్రెయిన్, ఒమన్ వంటి దేశాలకు 58.36 మిలియన్ డాలర్ల విలువైన 62,280 మెట్రిక్ టన్నుల దానిమ్మ ఎగుమతి చేయబడింది. ఉద్యాన పంటల ఉత్పత్తిలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. 2021-22లో, భారతదేశం మొత్తం 333.20 మిలియన్ మెట్రిక్ టన్నుల  ఉద్యాన పంటల ఉత్పత్తిని నమోదు చేసింది, అందులో పండ్లు మరియు కూరగాయల వాటా 90%. 2021-22లో పండ్ల మొత్తం ఉత్పత్తి 107.10 ఎం ఎం టీ మరియు దానిమ్మ సుమారు 3 ఎం ఎం టీ. ప్రపంచంలో దానిమ్మ ఉత్పత్తిలో భారతదేశం ఏడవ స్థానంలో ఉంది మరియు మొత్తం సాగు విస్తీర్ణం 2,75,500 హెక్టార్లు. భారతదేశంలో, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రధాన దానిమ్మ పండించే రాష్ట్రాలు. ఎపెడా దానిమ్మ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందించడానికి మరియు సరఫరా గొలుసులోని అడ్డంకులను తొలగించడానికి దానిమ్మ కోసం ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్‌(ఈ పీ ఎఫ్) లను  ఏర్పాటు చేసింది. ఈ పీ ఎఫ్ లో వాణిజ్య శాఖ, వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రిఫరల్ లేబొరేటరీలు మరియు ఉత్పత్తి యొక్క తొలి పది ప్రముఖ ఎగుమతిదారుల ప్రతినిధులు ఉన్నారు.  ఎపెడా దానిమ్మపండు విలువ గొలుసుకు ముందు ఉత్పత్తి, ఉత్పత్తి, పంట అనంతర, లాజిస్టిక్స్, బ్రాండింగ్ నుండి మార్కెటింగ్ కార్యకలాపాల వరకు సమస్యలను పరిష్కరించడానికి నిరంతర ప్రక్రియలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. అంతేకాకుండా, ప్రైవేట్ రంగంలో 250 కంటే ఎక్కువ ఎగుమతి ఆధారిత యూరోపియన్ యూనియన్ కంప్లైంట్ ప్యాక్ హౌస్‌లను స్థాపించడంతోపాటు, ఎగుమతుల కోసం ఉమ్మడి మౌలిక సదుపాయాల అభివృద్ధి  కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం కూడా అందించబడింది. ఎపెడా నిర్దిష్టదేశం లో ఎగుమతి ప్రచార కార్యక్రమాల కోసం వ్యూహాలను రూపొందించింది. కొత్త మార్కెట్లలో ఎగుమతి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు యురోపియన్ దేశాలు, మధ్యప్రాచ్యం మరియు ఆగ్నేయాసియా దేశాల కోసం అంతర్జాతీయ కొనుగోలుదారుల అమ్మకందారుల సమావేశాలను నిర్వహించింది. వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతుల కోసం వివిధ దేశాలలో బీ 2 బీ ప్రదర్శనలు నిర్వహించడం, ఉత్పత్తి-నిర్దిష్ట మరియు సాధారణ మార్కెటింగ్ ప్రచారాల ద్వారా కొత్త సంభావ్య మార్కెట్‌లను అన్వేషించడం వంటి వ్యవసాయ మరియు ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి ప్రమోషన్ కోసం భారత రాయబార కార్యాలయాల క్రియాశీల ప్రమేయం ద్వారా ఎపెడా తీసుకున్న వివిధ కార్యక్రమాల ఫలితం.  ఎపెడా అస్సాంలోని గౌహతిలో ఈశాన్య రాష్ట్రాల నుండి సహజ, సేంద్రీయ మరియు జీ ఐ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యాన్ని పెంచడంపై ఒక సమావేశాన్ని కూడా నిర్వహించింది. అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాలను సృష్టించడం ద్వారా అస్సాం మరియు పొరుగు రాష్ట్రాల్లో పండించే సహజ, సేంద్రీయ మరియు జీ ఐ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడం ఈ సదస్సు యొక్క లక్ష్యం.

లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం సహకారంతో, ఎపెడా ఇటీవల ఒక అంతర్జాతీయ కొనుగోలుదారుల అమ్మకందారుల సమావేశాన్ని నిర్వహించింది. లడఖ్ నుండి నేరేడు పండ్లు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. లడఖ్ మరియు జమ్మూ మరియు కాశ్మీర్‌లోని యూ టీ లకు చెందిన పద్దెనిమిది మంది వ్యవస్థాపకులు ఆప్రికాట్లు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భారతదేశం, అమెరికా, బంగ్లాదేశ్, ఒమన్ మరియు యూ ఏ ఈ నుండి 20 మంది కొనుగోలుదారులు పాల్గొన్నారు. 

***



(Release ID: 1946716) Visitor Counter : 138