కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“ప్రసారం, కేబుల్ సేవల నియంత్రణ వ్యవస్థ సమీక్ష”పై సంప్రదింపుల పత్రం విడుదల చేసిన ట్రాయ్

Posted On: 08 AUG 2023 2:43PM by PIB Hyderabad

 “ప్రసారం, కేబుల్ సేవల నియంత్రణ వ్యవస్థ  సమీక్ష”పై  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఈరోజు  సంప్రదింపుల పత్రం  విడుదల చేసింది.

 

కేబుల్ టీవీ రంగం  పూర్తి డిజిటలైజేషన్‌కు అనుగుణంగా 2017 మార్చి 3న  ప్రసారం,కేబుల్ సేవల  నియంత్రణ వ్యవస్థ మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్దర్శకాలను  మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు సమీక్షించి  చట్టపరమైన ఆమోదం తెలిపాయి. 2018 డిసెంబర్  29 నుంచి మార్గదర్శకాలు  అమల్లోకి వచ్చాయి. 

నియంత్రణ వ్యవస్థ 2017 అమలులోకి వచ్చిన  తర్వాత తలెత్తిన కొన్ని సమస్యలను పరిష్కరించడానికి  సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపిన ట్రాయ్ 2020 జనవరి 1న టారిఫ్ సవరణ ఆర్డర్ 2020, ఇంటర్‌కనెక్షన్ సవరణ నిబంధనలు,క్యూఓ ఎస్  2020 నియంత్రణలతో సవరించిన వ్యవస్థ  2020 ని విడుదల  చేసింది.

అయితే, కొంతమంది వాటాదారులు టారిఫ్ సవరణ ఆర్డర్ 2020, ఇంటర్‌కనెక్షన్ సవరణ నిబంధనలు 2020,క్యూఓ ఎస్  సవరణ నిబంధనలు 2020 లో పొందుపరిచిన నిబంధనలను బాంబే , కేరళ హైకోర్టుతో సహా వివిధ హైకోర్టులలో సవాల్ చేశారు. కొన్ని నిబంధనలు మినహా సవరించిన వ్యవస్థ  2020  చెల్లుబాటు అవుతుందని  హైకోర్టులు ప్రకటించాయి. 

నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (NCF),మల్టీ టీవీ హోమ్స్ ,దీర్ఘకాలిక సభ్యత్వాలకు సంబంధించి సవరించినవ్యవస్థ  2020 లో పొందుపరిచిన  నిబంధనలు అమలులోకి వచ్చాయి. 

 కొత్త టారిఫ్‌లను ప్రకటించిన తర్వాత ప్రసారకర్తలు,  పంపిణీ ప్లాట్‌ఫారమ్ ఆపరేటర్లు (DPOలు), స్థానిక కేబుల్ ఆపరేటర్ల సంఘం (LCOలు) మరియు వినియోగదారుల సంస్థల నుంచి ట్రాయ్ కు కొన్ని ప్రతిపాదనలు అందాయి.   తమ IT వ్యవస్థల్లో  కొత్త రేట్లు అమలు చేయడం,పెద్ద సంఖ్యలో వినియోగదారులను కొత్త టారిఫ్ పరిధిలోకి తీసుకు రావడంలో   ఎదురయ్యే సమస్యలను ప్రస్తావించారు.  పే ఛానల్స్ రేట్లు పెరుగుదల కారణంగా దాదాపు అన్ని బొకేల పై ప్రభావం చూపుతుంది. ప్రసారకర్తలు ప్రసార చార్జీలను కూడా పెంచడంతో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని  ట్రాయ్ దృష్టికి వచ్చింది.

సవరించినవ్యవస్థ  2020 అమలుకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించడానికి , ముందుకు వెళ్లే మార్గాన్ని సూచించడానికి ట్రాయ్ ఆధ్వర్యంలో  ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్ (IBDF), ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ (AIDCF) ,డిటిహెచ్  అసోసియేషన్ సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

సవరించిన వ్యవస్థ  2020 లో పొందు పరచిన  అంశాలను పరిశీలించిన కమిటీ వివిధ అంశాలతో  జాబితా రూపొందించింది.  అయితే, సవరించిన వ్యవస్థ  2020ని సజావుగా అమలు చేయడానికి అవరోధాలను సృష్టించగల క్లిష్టమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాటాదారులు ట్రాయ్ ని  అభ్యర్థించారు.

 కమిటీ గుర్తించిన సమస్యలను పరిష్కరించడానికి; సవరించినవ్యవస్థ  2020 ని పూర్తిగా  అమలు చేయడం  కోసం పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వాటాదారుల అభిప్రాయాలు ఆహ్వానిస్తూ 2022 మే 7న  "ప్రసారం, కేబుల్ సేవల కోసం కొత్త నియంత్రణ వ్యవస్థకు  సంబంధించిన సమస్యలు" అనే అంశంపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది.

 సంప్రదింపుల ప్రక్రియ తర్వాత 2022 నవంబర్ 22న ట్రాయ్  టెలికమ్యూనికేషన్ (బ్రాడ్‌కాస్టింగ్ మరియు కేబుల్) సేవలు (ఎనిమిదవ) (అడ్రస్ చేయదగిన సిస్టమ్స్) టారిఫ్ (మూడవ సవరణ) ఆర్డర్, 2022 , టెలికమ్యూనికేషన్ (బ్రాడ్‌కాస్టింగ్ మరియు కేబుల్ సిస్టమ్స్) సేవలను  (నాల్గవ సవరణ). నిబంధనలు, 2022 విడుదల చేసింది. ఈ కింది అంశాలకు సంబంధించి సవరణలు విడుదల అయ్యాయి.  సమస్యలను కవర్ చేసింది:

 

ఏ . టీవీ ఛానెల్‌ల ఎంఆర్పీ  కొనసాగింపు

 

బి.  . పుష్పగుచ్ఛం లో చేర్చడానికి టీవీ ఛానెల్  ఎంఆర్పీ ధరపై  రు. 19/- సీలింగ్ 

 

సి. బొకేను రూపొందించేటప్పుడు వ్యక్తిగత ఛానెల్‌ల ధర మొత్తంపై 45% తగ్గింపు

 

డి. బ్రాడ్‌కాస్టర్ ద్వారా 15% అదనపు ప్రోత్సాహకాలు బొకేలపై కూడా అనుమతించబడతాయి.

 

ట్రాయ్ నియమించిన కమిటీ   తదుపరి పరిశీలన కోసం   అనేక ఇతర సమస్యలను కూడా గుర్తించింది. బ్రాడ్‌కాస్టర్‌లు, ఎంఎస్ఓలు, డిటిహెచ్  ఆపరేటర్లు,ఎల్ఓసి  ప్రతినిధులతో ట్రాయ్ పలు సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వివిధ వాటాదారులు ఇచ్చిన కొన్ని సంబంధిత సూచనలను ట్రాయ్ ఆమోదించింది. 

 కమిటీ గుర్తించినఅంశాలు,  ఇతర వాటాదారులు సూచించిన  ప్రసార , కేబుల్ సేవల సుంకం, ఇంటర్‌కనెక్షన్, సేవల నాణ్యతకు సంబంధించిన మిగిలిన సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత వర్గాల అభిప్రాయాలూ కోరుతూ ట్రాయ్ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది.  సంప్రదింపు పత్రంపై వ్రాతపూర్వక అభిప్రాయాలను 2023 సెప్టెంబర్ 5 వరకు ట్రాయ్ స్వీకరిస్తుంది. . కౌంటర్ కామెంట్‌లు, ఏవైనా ఉంటే, 19 సెప్టెంబర్ 2023లోపు సమర్పించవచ్చు. అబిప్రాయాలు, కౌంటర్-కామెంట్‌లను ఎలక్ట్రానిక్ రూపంలో పంపవచ్చు,. ఇమెయిల్ ID advbcs- 2@trai.gov.in మరియు jtadvbcs-1@trai.gov.in ద్వారా అభిప్రాయాల పంపవచ్చు. 

ఏదైనా వివరణ/సమాచారం కోసం శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్, సలహాదారు (B&CS)  ఫోన్‌  నం. +91-11-23237922 లో సంప్రదించవచ్చు.

 

***

 


(Release ID: 1946715) Visitor Counter : 123