గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

మేరీ లైఫ్‌, మేరా స్వ‌చ్ఛ ష‌హ‌ర్ ప్ర‌చారం

Posted On: 07 AUG 2023 12:58PM by PIB Hyderabad

 ప‌ర్యావ‌ర‌ణం, అట‌వీ, వాతావ‌ర‌ణ మార్పుల మంత్రిత్వ శౄఖ (ఎంఇఎప్‌సిసి) స‌హ‌కారంతో గృహ నిర్మాణం& ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ మేరీ లైఫ్‌, మేరా స్వ‌చ్ఛ ష‌హ‌ర్ (నా జీవితం, నా ప‌రిశుభ్ర‌మైన ప‌ట్ట‌ణం) ప్ర‌చారాన్ని 15 మే 2023 నుంచి ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వమైన 5 జూన్ 2023వ‌ర‌కు మూడు వారాల పాటు నిర్వ‌హించింది. ఈ ప్ర‌చారం  రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ (త‌గ్గించు, పున‌ర్వినియోగం, పున‌రుప‌యోగం - ఆర్ఆర్ ఆర్‌) కేంద్రాల‌ను పౌరుల‌కు, సంస్థ‌ల‌కు, వాణిజ్య సంస్థ‌ల‌కు ఉప‌యోగించ‌ని లేదా ఉప‌యోగించిన ప్లాస్టిక్ వ‌స్తువులు, దుస్తులు, చెప్పులు, పుస్త‌కాలు, బొమ్మ‌ల‌ను జ‌మ చేసేందుకు ఏక ప‌రిష్కారంగా ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల (యుఎల్‌బిలు) ఏర్పాటు చేసేందుకు తోడ్ప‌డ‌డం పై దృష్టి పెట్టింది.  ఆర్ఆర్ ఆర్ కేంద్రాల రాష్ట్ర‌వారీ  వివ‌రాలు ప‌బ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయి, వాటిని http://sbmurban.org/rrr-centers అన్న లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా పొంద‌వ‌చ్చు. 
మేరీ లైఫ్‌, మేరా స్వ‌చ్ఛ ష‌హ‌ర్ అన్న‌ది ఒక ప‌థ‌కం కాదు, అది ఎస్‌బిఎం-యు 2.0 కింద యుఎల్‌బిలు అమ‌లు చేస్తున్న ప్ర‌జల‌ను చేరుకుని, సామూహిక కార్య‌క్ర‌మం. ఈ ప్ర‌చారం కోసం భార‌త ప్ర‌భుత్వం కొత్త సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌లేదు. 
త‌మ రోజువారీ జీవితంలో రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్ (ఆర్ ఆర్ ఆర్‌)న‌ను అనుస‌రించ‌డం ద్వారా పరిశుభ్ర‌మైన‌, హ‌రిత ప‌ర్యావ‌ర‌ణానికి దోహ‌దం చేయ‌డం, వ‌న‌రుల ప‌రిర‌క్ష‌ణ‌ను ప్రోత్స‌హించ‌డం, వృధాల ఉత్ప‌త్తిని త‌క్కువ చేసేందుకు పౌరుల ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తేవ‌డం, మిష‌న్ లైఫ్ గురించి అవ‌గాహ‌న‌ను వ్యాప్తి చేయ‌డం ఈ ప్ర‌చారం ల‌క్ష్యం. ఈ ప‌ద్ధ‌తుల‌ను ప‌ట్ట‌ణ పారిశుద్ధ్య ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌తో అనుసంధానం చేయ‌డం ద్వారా, వ్య‌ర్ధాల‌ను త‌గ్గించి, వ‌న‌రుల వినియోగాన్ని గ‌రిష్టం చేసి, ప్ర‌స్తుత, భ‌విష్య‌త్ త‌రాల సంక్షేమానికి హామీ ఇచ్చే ఆవృత్త ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను సృష్టించాల‌న్న‌ది ఉద్దేశ్యం. 
పౌరుల స‌మీక‌ర‌ణ‌ను నిర్ధారించేందుకు, ఇంటిఇంటికీ తిరిగి అవ‌గాహ‌న‌ను క‌ల్పించ‌డం, సోష‌ల్ మీడియా ప్ర‌చారాలు, ప్ర‌భావితం చేయ‌గ‌ల వ్య‌క్తుల‌తో కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టారు. యుఎల్‌బిల‌కు ప్ర‌చార మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎంఒహెచ్‌యుఎ విడుద‌ల చేసింది. వీటిని http://sbmurban.org/storage/app/media/ Meri-LiFE-Mera-Swachh-Shehar-SOP-for-States-and-Cities-12th-May-2023.pdf అన్న లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా పొంద‌వ‌చ్చు. 
ఈ స‌మాచారాన్ని కేంద్ర గృహ‌నిర్మాణ & ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి శ్రీ కౌశ‌ల్ కిషోర్ సోమ‌వారం రాజ్య‌స‌భ‌కు ఇచ్చిన లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో వివ‌రించారు. 

 

***
 



(Release ID: 1946606) Visitor Counter : 143