బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 జూన్ నాటికి బొగ్గు ఉత్పత్తిలో 8.51% పెరుగుదల


దేశీయ ఉత్పత్తి మెరుగుపరచడం, అనవసరమైన దిగుమతిని తొలగించడంపై దృష్టి

Posted On: 07 AUG 2023 3:50PM by PIB Hyderabad

బొగ్గు గనులను మూసి వేయడం వల్ల  బొగ్గు కంపెనీల (కోల్ ఇండియా లిమిటెడ్/సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్) ఏ కార్మికుడిని కూడా విధుల నుంచి తొలగించలేదు.  తగినంత శిక్షణ ఇచ్చిన తర్వాత కార్మికులను  ఇతర యూనిట్లు/కేంద్రాలకు  బదిలీ చేయడం/పునర్ నియమించడం జరుగుతుంది. 

 స్వదేశీ ఉత్పత్తి/సరఫరా ద్వారా  దేశంలో బొగ్గు అవసరాలు చాలా వరకు తీరుతున్నాయి.   దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచడం,అనవసరమైన బొగ్గు దిగుమతి తగ్గించడానికి  ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది.  2022-23 సంవత్సరంలో,బొగ్గు ఉత్పత్తి గత సంవత్సరం కంటే 14.77% పెరిగింది.గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే దేశంలో  ప్రస్తుత సంవత్సరం జూన్  2023 నాటికి  బొగ్గు ఉత్పత్తి  8.51% పెరిగింది. బొగ్గు ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు క్రింది విధంగా ఉన్నాయి:

           i.   బొగ్గు బ్లాక్‌ల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ ద్వారా తరచూ  సమీక్షలు జరుగుతున్నాయి. 

          ii.   గనులు మరియు ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టం, 2021 నిబంధనల ప్రకారం  క్యాప్టివ్ గనుల యజమానులు (అణు ఖనిజాలు కాకుండా) వారి వార్షిక ఖనిజ (బొగ్గు తో సహా) ఉత్పత్తిలో 50% వరకు కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా గనితో అనుసంధానించబడిన తుది వినియోగ ప్లాంట్  అవసరాలు తీర్చిన తర్వాత బహిరంగ మార్కెట్‌లో విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. దీనికి కేంద్రం నిర్ణయించిన అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 

         iii.   బొగ్గు గనుల కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు బొగ్గు రంగానికి సింగిల్ విండో క్లియరెన్స్ పోర్టల్.

         iv.   బొగ్గు గనుల ముందస్తు కార్యాచరణ కోసం వివిధ అనుమతులు/క్లియరెన్స్‌లను పొందడం కోసం బొగ్గు బ్లాక్ కేటాయింపుదారుల హ్యాండ్‌హోల్డింగ్ కోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్.

          v.   ఆదాయ భాగస్వామ్య ప్రాతిపదికన సిఐఎల్ మూసివేసిన గనుల్లో తవ్వకాలు తిరిగి ప్రారంభించడం. ఎండీఓ ద్వారా సిఐఎల్ గనుల నిర్వహణ.

         vi.   సాధ్యమైనంత వరకు  కోల్ ఇండియా లిమిటెడ్ తన భూగర్భ గనుల్లో మాస్ ప్రొడక్షన్ టెక్నాలజీ ముఖ్యంగా నిరంతర మైనర్లుని అవలంబిస్తోంది.  వదిలివేయబడిన / నిలిపివేయబడిన గనుల లభ్యత దృష్ట్యా  కోల్ ఇండియా లిమిటెడ్ కూడా పెద్ద సంఖ్యలో హై వాల్స్ (HW) గనులను ప్రారంభించాలని నిర్ణయించింది.  కోల్ ఇండియా లిమిటెడ్  సాధ్యమైన చోట భారీ సామర్థ్యం గల భూగర్భ గనులు  ప్రారంభించాలని కోల్ ఇండియా లిమిటెడ్ నిర్ణయించింది.  

        vii.   Inits ఓపెన్‌కాస్ట్ (ఓసి ) గనులు, కోల్ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే అధిక సామర్థ్యం గల ఎక్స్‌కవేటర్లు, డంపర్లు మరియు సర్ఫేస్ మైనర్‌లలో అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది.

       viii.    కోల్ ఇండియా లిమిటెడ్   7 మెగా మైన్స్‌లోడిజిటలైజేషన్‌ను  ప్రయోగాత్మకంగా అమలు చేసి, దశల వారీగా అన్ని కేంద్రాలకు విస్తరించడానికి ప్రణాళిక రూపొందింది. 

         ix.   SCCL ప్రస్తుతం ఉన్న MT నుండి 2023-24 నాటికి 75 ఎంటీ బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఎస్సిసిఎల్  ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం  ఎస్సిసిఎల్ 67 ఎంటీ  బొగ్గు ఉత్పత్తి  చేస్తోంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ట్, ప్రస్తుతం పని చేస్తున్న ప్రాజెక్టుల పని తీరును  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

         కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(Release ID: 1946549) Visitor Counter : 176