మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మహిళా సాధికారత కోసం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని వేగవంతం చేయడానికి అమలు చేయాల్సిన చర్యలు చర్చించిన మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖఆధ్వర్యంలో జరిగిన మంత్రుల స్థాయి సమావేశం
విద్య, వ్యవస్థాపక శక్తి, సాంకేతిక,ఆర్థిక రంగాల్లో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించిన సమావేశం
నాయకత్వం, ఏకాభిప్రాయం, కలిసి పని చేసి సంబంధాలు పటిష్టం చేసుకుని, విధాన నిర్ణయాలు తీసుకునే అంశంలో మార్పు కోసం కృషి చేయాలని తీర్మానించిన సమావేశం
Posted On:
07 AUG 2023 1:43PM by PIB Hyderabad
మహిళా సాధికారతపై జీ-20 మంత్రుల స్థాయి సమావేశం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 2023 ఆగస్టు 2 నుంచి 4 వరకు జరిగింది. సమావేశంలో జీ-20 దేశాలు, అతిథి దేశాలకు చెందిన మహిళా, లింగ సమానత్వ మంత్రులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతపై జరిగిన జీ-20, డబ్ల్యు -20 మంత్రుల స్థాయి సమావేశానికి నోడల్ అధికారిగా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వ్యవహరించింది. మహిళా సాధికారత కోసం మంత్రుల స్థాయి సమావేశం తో పాటు ఏడు అంతర్జాతీయ సమావేశాలు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. సదస్సులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, యూరోపియన్ యూనియన్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సౌదీ అరేబియా, టర్కియే, యునైటెడ్ కింగ్‌డమ్, 15 జీ-20 దేశాలకు చెందిన మొత్తం 138 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికాతో సహా 5 అతిథి దేశాలైన బంగ్లాదేశ్, మారిషస్, నెదర్లాండ్స్, సింగపూర్,యూఏఈ కి చెందిన . 60 మందికి పైగా ప్రతినిధులు సదస్సులో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి , మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, ఇండోనేషియా మహిళా సాధికారత , పిల్లల రక్షణ మంత్రి శ్రీ హర్షవర్ధన్ ష్రింగ్లా, బ్రెజిల్ మహిళా శాఖ మంత్రి గుస్తి ఆయు బింటాంగ్ ధర్మావతి, కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ ఇండెవర్ పాండే తదితరులు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు.
ప్రారంభ కార్యక్రమం తర్వాత జీ-20 సభ్య దేశాల ప్రతినిధులు తమ తమ దేశాల అభిప్రాయాలు తెలిపారు. సదస్సులో విద్య, డిజిటల్ నైపుణ్యం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, మహిళలు, అట్టడుగు స్థాయిలలో నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి భాగస్వామ్యం, సంస్కృతి , మహిళా వ్యవస్థాపకత అంశాలపై చర్చలు జరిగాయి.
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ ప్రసంగంతో సమావేశం ముగిసింది, బ్రెజిల్‌కు నాయకత్వ భాద్యతలు అప్పగించారు.కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ముగింపు ఉపన్యాసం చేశారు. లింగ సమానత్వం, మహిళా సాధికారత అంశంపై అమలు జరుగుతున్న చర్యలపై జీ-20 సభ్య దేశాలు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థల అభిప్రాయాలతో పొందుపరిచిన అధికార ప్రకటన వెలువడింది. లింగ సమానత్వం, మహిళా సాధికారత సాధించేందుకు కృషి కొనసాగిస్తామని ప్రతినిధులు ప్రకటించారు.
మహిళల నాయకత్వంలో అభివృద్ధి ఈ విధంగా జరగాలి అన్న అంశాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రారంభ ఉపన్యాసంలో ప్రస్తావించారు. “మహిళలు అభివృద్ధి చెందినప్పుడు, ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. మహిళా ఆర్థిక సాధికారత వృద్ధికి సహకారం అందిస్తుంది. విద్యావంతులైన మహిళలు ప్రాప్యత ప్రపంచ పురోగతిని శాసిస్తారు. మహిళా నాయకత్వం చేరికను ప్రోత్సహిస్తుంది. మహిళల స్వరాలు సానుకూల మార్పులు తీసుకు వస్తాయి" అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
జీ-20 అధ్యక్ష హోదాలో మహిళా సాధికారత అంశానికి మాత్రమే కాకుండా జీవన విధానంలో సమూల మార్పు తెచ్చే అంశానికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తోంది. మహిళల-నేతృత్వంలోని అభివృద్ధి విధానం కేవలం మహిళా సాధికారత పై వచ్చిన మార్పును సూచిస్తుంది. ప్రపంచ వేదికపై ఏకాభిప్రాయాన్ని మహిళా సాధికారత అంశంపై ప్రపంచ దేశాల అభిప్రాయంలో మార్పు తీసుకురావడానికి భారతదేశం కృషి ప్రారంభించింది. దీనికోసం భారతదేశం నిర్వహించిన సమావేశాల్లో 18 జీ-20 దేశాలు , 7 అతిథి దేశాలకు చెందిన 300 మంది ప్రతినిధులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఏడు వ్యక్తిగత సమావేశాలు, 86 అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మహిళల పురోగతి కోసం భారతదేశం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. స్థానిక లేదా సమాజ స్థాయిలో మహిళా సాధికారత, గుర్తింపుపై భారతదేశం ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. సమాజ అభివృద్ధికి మహిళల అభివృద్ధి కీలకం అని గుర్తించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ అంశాన్ని పలుమార్లు ప్రముఖంగా ప్రస్తావించారు. మహిళల సాధికారత మన సమాజ అభివృద్ధికి పునాది అని, వారి నాయకత్వం, ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో, మన సమగ్ర మరియు స్థిరమైన పురోగతికి కీలకం అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం గుర్తించిన ప్రాధాన్యతా అంశాల వివరాలను సదస్సు ప్రారంభ సమావేశంలో మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ప్రస్తావించారు. విద్య, మహిళల సాధికారత ఆలోచనలో మార్పు, మహిళా వ్యవస్థాపకత, సమానత్వం, ఆర్థిక వ్యవస్థ కోసం క్షేత్ర స్థాయిలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి అవకాశాలు కల్పించడం లాంటి అంశాలను మంత్రి ప్రస్తావించారు. ఈ లక్ష్యాలు సాధించడానికి డిజిటల్ సాంకేతితక కీలకంగా ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో మహిళా సాధికారత సాధించే అంశంలో భారతదేశం సాధించిన విజయాలను మంత్రి వివరించారు. మహిళల నాయకత్వం, ప్రజల సహకారం, వాతావరణ మార్పుల స్థితిస్థాపకత అంశాలను శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల వల్ల అభివృద్ధి పధంలో పయనిస్తున్న మహిళలు తమ అభిప్రాయాలు వివరించారు.మహిళా సాధికారత, విద్య కోసం కృషి చేసి పద్మశ్రీ పురస్కారం అందుకున్న హీరాబాయి ఇబ్రహీం లోడి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫారెస్ట్ గార్డ్, ప్రస్తుతం సింహాల సంరక్షణ పై దృష్టి సారించే గిర్ నేషనల్ పార్క్ రెస్క్యూ విభాగానికి అధిపతి అయిన రసిలా బెన్ తదితరులు తమ అభిప్రాయాలు తెలిపారు. ఒక అంతర్జాతీయ సదస్సులో ఈ స్ఫూర్తిదాయక మహిళలు మాట్లాడడం ఇదే తొలిసారి.
విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం జీ-20 అధ్యక్ష హోదాలో ' స్టెమ్' కార్యక్రమం అమలుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. టెక్ ఈక్విటీ కార్యక్రమం ద్వారా బాలికలు, మహిళలకు డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత, ఇతర సాంకేతిక అంశాల్లో నైపుణ్యం కల్పించడానికి, నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తోంది. కార్యక్రమం అమలుకు జీ-20 సభ్య దేశాలు సహకారం అందిస్తున్నాయి. 120కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషలలో కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది బాలికలు, మహిళలను అక్షరాస్యులుగా మార్చాలని భారతదేశం లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీనివల్ల లింగ అసమానతలు తగ్గుతాయి. సమావేశంలో ప్రసంగించిన ఇండోనేషియా మహిళా సాధికారత, శిశు రక్షణ మంత్రి శ్రీమతి I గుస్తీ అయు బింటాంగ్ దర్మావతి విద్య ప్రాముఖ్యత, సాంకేతిక-సంబంధిత విద్య లో బాలికలు, మహిళలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మహిళా నాయకులు ఆదర్శంగా ఉండే భవిష్యత్తుకు విద్య కీలకమని ఆమె పేర్కొన్నారు. బ్రెజిల్ మంత్రి శ్రీమతి మరియా హెలెనా గ్వరేజీ తన ప్రసంగంలో లింగ వేతన వ్యత్యాసాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
19 జీ-20 దేశాల నుంచి అందిన 149 మోడల్ కార్యక్రమాలు జీ-20 సాధికారిత ఉత్తమ అభ్యాసాలజాబితాలో చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు చెందిన పరిశ్రమలు, వ్యాపార రంగాలకు చేసిన నిపుణులు రూపొందించిన అంశాలు మహిళా సాధికారత కోసం జరుగుతున్న ప్రయత్నాలకు సహకారం అందిస్తాయి. అందిరికీ అందుబాటులో ఉండేలా విధంగా జాబితా డిజిటలైజ్ చేయబడింది. గతంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ప్లేబుక్‌లో 3 ప్రాధాన్యతా అంశాలు ఉన్నాయి. అట్టడుగు స్థాయి మహిళలకు సహకారం అందించేందుకు భారతదేశం కొత్త అధ్యాయాన్ని జోడించింది.
అన్ని స్థాయిలలో మహిళల నాయకత్వం ప్రాముఖ్యతను కేంద్ర మహిళా,శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇండెవర్ పాండే వివరించారు. భారతదేశ రాష్ట్రపతిగా మహిళ ఉండటంతో పాటు \ భారతదేశంలో ఆరోగ్య రంగంలో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
మొట్టమొదటిసారిగా G20 EMPOWER కోసం ఏర్పాటైన KPI డ్యాష్‌బోర్డ్ చిన్న,మధ్య తరహా సంస్థలలో మహిళల పాత్రను పరిశీలిస్తుంది.
మహిళల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్న అన్ని వర్గాలకు చెందిన వారిని (సీఈఓ లు, అసోసియేషన్ హెడ్‌లు, ఇతర నాయకులు ) గుర్తించి జాబితాలో చేర్చింది. మహిళా సాధికారత కోసం కృషి చేస్తూ గుర్తింపు పొందిన వారి సంఖ్య 380 నుండి 544 కి చేరింది. జాబితాలో భారతదేశం కొత్తగా 100 మందిని చేర్చింది. . లింగ సమానత్వానికి సంబంధించిన కట్టుబాట్లను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న ప్రతిజ్ఞ కూడా నవీకరించబడింది.
9 జీ-20 దేశాల నుంచి అందిన 73 స్పూర్తిదాయక కథనాలను G20 EMPOWER వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
ప్రతిజ్ఞ లో మెరుగైన నిర్ణయాధికారం కోసం లింగ వివక్ష డేటా అవసరం, అలాగే ప్రభావం కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పాత్రను ప్రస్తావించారు. మహిళా సాధికారత కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో దాదాపు300,000 మంది ప్రజలు పాల్గొన్నారు. . మహిళా సంఘం నాయకులు, చేతివృత్తులవారు, స్వయం సహాయక బృందాలు, కార్పొరేట్ సంస్థలు, వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపార సంస్థలు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ హర్ష్ వర్ధన్ ష్రింగ్లా వివరించారు.
కేంద్ర మహిళా,శిశు అభివృద్ధి సహాయ మంత్రి, డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ 'లింగ సమానత్వం' కోసం భారతదేశం చేస్తున్న కృషిని వివరించారు.
డబ్ల్యు 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ వాతావరణ మార్పుల స్థితిస్థాపకతలో మహిళల పాత్రపై దృష్టి సారించింది, దీని కోసంప్రత్యేక వ్యవస్థ ఏర్పాటయింది. భారతదేశం అనుసరిస్తున్న పర్యావరణహిత జీవనశైలికి అనుగుణంగా వ్యవస్థ పనిచేస్తుంది. . మహిళలు మిషన్ లైఫ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు. వ్యర్థాలను తగ్గించడం, పునర్వినియోగం చేయడం, పునర్వినియోగం కార్యక్రమాల్లో మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు.
మంత్రుల స్థాయి సమావేశంలో భాగంగా జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్న జీ-20 సభ్య దేశాల ప్రతినిధులు పోషకాహార సేవలు పర్యవేక్షించడానికి, గర్భిణీ స్త్రీల తో సహా దాదాపు 100 మిలియన్ల మంది నమోదిత లబ్ధిదారులకు బాల్య సంరక్షణ సేవలను అందించడానికి ఒక గవర్నెన్స్ సాధనంగా అభివృద్ధి చేయబడిన ఒక ప్రత్యేకమైన ICT ప్లాట్‌ఫారమ్ పోషన్ ట్రాకర్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. 1.4 మిలియన్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలిచ్చే తల్లులు, 6 ఏళ్లలోపు పిల్లలు , కౌమారదశలో ఉన్న బాలికల అభివృద్ధి కోసం రూపొందించి అమలు చేస్తున్న పోషణ్ ట్రాకర్ ను తమ దేశాల్లో అమలు చేయడానికి వన్ ఎర్త్ వన్ ఫామిలీ వన్ ఫ్యూచర్ నినాదం స్పూర్తితో సభ్య దేశాలకు అందించడానికి భారతదేశం సంసిద్ధత వ్యక్తం చేసింది.
భారత అధ్యక్షతన జరిగిన జీ-సాధికారత, డబ్ల్యు 20 సమావేశాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, విహార యాత్రలు నిర్వహించారు. భారతీయ వంటకాల రుచి చూసిన ప్రతినిధులు భారతదేశ సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు,చరిత్రను తెలుసుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల అభివృద్ధి చాటి చెప్పేందుకు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాల నాయకులు, కళాకారులు, స్వయం సహాయక బృందాలు, పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.
మంత్రుల స్థాయి సమావేశంలో భాగంగా భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ ) భాగస్వామ్యంతో మహిళా , శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఎగ్జిబిషన్‌ను శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ప్రారంభించారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'ఇండియా@75: మహిళల సహకారం' పేరుతో జరిగిన ఎగ్జిబిషన్ ఆరోగ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, క్రీడలు, రక్షణ రంగం లో సాధించిన విజయాలు ఆధారంగా ప్రదర్శన ఏర్పాటయింది. ఎగ్జిబిషన్‌లో ఎఐ , రోబోటిక్స్ వంటి కొత్త రంగాలలో మహిళలు చేసిన ఆవిష్కరణలు ,ఉత్పత్తులను ప్రదర్శించారు, అలాగే 100% మహిళా ఉద్యోగులతో నడుస్తున్న ఉన్న ఫ్యాక్టరీలలో కార్ల తయారీలో వారి పనిని ప్రదర్శించారు.
మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మార్గదర్శక కాంతిగా జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం విద్య, వ్యవస్థాపకత, సాంకేతిక, ఆర్థిక తదితర రంగాలలో రూపొందించిన కార్యక్రమాలు సదస్సులో చర్చకు వచ్చాయి. సదస్సు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహకరించింది.
ప్రస్తుత కాలంలో కీలకంగా మారిన లింగ సమానత్వం సాధన కోసం జీ-20 అధ్యక్ష హోదాలో భారతదేశం చేసిన కృషిని సభ్య దేశాలు ప్రసంసించాయి.
***
(Release ID: 1946543)
Visitor Counter : 907