ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

దక్షిణ ఆఫ్రికాఅధ్యక్షుని తో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


భారతదేశం మరియు దక్షిణ ఆఫ్రికా ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 30 సంవత్సరాలు అయిన సందర్భం లో నేతలు ఇద్దరూ ద్వైపాక్షిక సహకారం లో ప్రగతి ని గురించి స్పష్టం చేశారు

బ్రిక్స్ శిఖర సమ్మేళనం కోసం కొనసాగుతున్న సన్నాహాల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించిన అధ్యక్షుడు శ్రీ రామఫోసా

బ్రిక్స్ శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం జోహాన్స్ బర్గ్ కు వెళ్లడం కోసం ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి

జి20 కి భారతదేశం యొక్క అధ్యక్షత కు అధ్యక్షుడు శ్రీ రామఫోసా తన పూర్తి సమర్థన ను తెలియ జేశారు

Posted On: 03 AUG 2023 8:28PM by PIB Hyderabad

దక్షిణ ఆఫ్రికా గణతంత్రం అధ్యక్షుడు శ్రేష్ఠుడు శ్రీ మాటెమేలా సిరిల్ రామఫోసా తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫొన్ లో మాట్లాడారు.

 

ద్వైపాక్షిక సహకారం లో పురరోగతి ని గురించి ఇరువురు నేత లు సకారాత్మకమైన రీతి లో మదింపు చేశారు. ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2023 వ సంవత్సరానికి ముప్ఫయ్ ఏళ్లు అయిన అంశం కూడా ఈ సందర్బం లో ప్రస్తావన కు వచ్చింది.

 

దక్షిణ ఆఫ్రికా ఆతిథేయి గా వ్యవహరిస్తున్న బ్రిక్స్ శిఖర సమ్మేళనం ఈ సంవత్సరం లో ఆగస్టు 22వ తేదీ మొదలుకొని 24వ తేదీ వరకు జరుగనుందని, ఆ సమావేశాల కు తరలి రండి అంటూ ప్రధాన మంత్రి ని అధ్యక్షుడు శ్రీ రామఫోసా ఆహ్వానించి, ఆ సమ్మేళనానికి సంబంధించినటువంటి సన్నాహాల ను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు. ప్రధాన మంత్రి ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. సదరు శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడం కోసం జోహాన్స్ బర్గ్ ను సందర్శించాలని తాను ఉత్సాహం తో ఉన్నానని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

పరస్పర హితం ముడిపడివున్నటువంటి అనేక ప్రాంతీయ అంశాల మరియు ప్రపంచ అంశాల పట్ల వారు వారి వారి ఆలోచనల ను ఒకరి కి మరొకరు తెలియజేసుకొన్నారు.

 

 

జి-20 కి ప్రస్తుతం అధ్యక్ష హోదా లో భారతదేశం చేపడుతున్న కార్యక్రమాల కు అధ్యక్షుడు శ్రీ రామఫోసా తన పూర్తి సమర్థన ను వ్యక్తం చేశారు. జి-20 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొనేందుకు భారతదేశాన్ని సందర్శించాలని తాను ఆశపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

 

 

ఒకరితో మరొకరు పరస్పరం సంప్రదింపుల ను కొనసాగించేందుకు అంగీకారాన్ని తెలియజేశారు.

 

 

***(Release ID: 1945691) Visitor Counter : 92