సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

1957 నుంచి నెలవారీగా ప్రచురిస్తున్న యోజన అభివృద్ధి సంచికలతో 'యోజన క్లాసిక్స్' పేరుతో ప్రత్యేక సంకలనం విడుదల చేసిన పబ్లికేషన్స్ విభాగం

Posted On: 01 AUG 2023 6:09PM by PIB Hyderabad

1957 నుంచి నెలవారీగా ప్రచురిస్తున్న యోజన అభివృద్ధి సంచికలతో  'యోజన క్లాసిక్స్' పేరుతో ప్రత్యేక సంకలనాన్ని  కేంద్ర ప్రభుత్వ పబ్లికేషన్స్ విభాగం  విడుదల చేసింది. అభివృద్ధి కార్యక్రమాలపై 'యోజన' ప్రతి నెలా ప్రచురితం అవుతోంది. 

 సంవత్సరాలుగా జర్నల్‌లో ప్రచురించబడిన అంశాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి 'యోజన క్లాసిక్స్' ను  పబ్లికేషన్స్ విభాగం రూపొందించింది.    ఈ పుస్తకం పాఠకులను భారతదేశ కళ, సంస్కృతి, వారసత్వం  సుసంపన్నమైన ప్రయాణంలో తీసుకువెళుతుంది. ఇది విద్యార్థులకు, కళ,సంస్కృతి ఔత్సాహికులకు, విద్యావేత్తలు, కళను పదాల ద్వారా వ్యక్తీకరించే ఉత్సాహం ఉన్న వారి వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన సంకలనంగా  'యోజన క్లాసిక్స్' రూపుదిద్దుకుంది.  'యోజన క్లాసిక్స్' ఒక అద్భుతమైన సేకరణగా ఉంటుంది   త్వరలో పబ్లికేషన్స్ డివిజన్ బుక్ గ్యాలరీ, సూచనా భవన్, ite www.publicationsdivision.nic.in.  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.

ఢిల్లీ పుస్తక ప్రదర్శన  2023లో పబ్లికేషన్స్ డివిజన్ స్టాల్‌ను సందర్శించిన  కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ఈరోజు   'యోజన క్లాసిక్స్' ను  విడుదల చేశారు. శ్రీ అపూర్వ చంద్ర తో పాటు పబ్లికేషన్స్ డివిజన్  డైరెక్టర్ జనరల్  శ్రీమతి అనుపమ భట్నాగర్  ఇతర సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

  ఢిల్లీ పుస్తక ప్రదర్శన  2023లో   పబ్లికేషన్స్ డివిజన్ ఏర్పాటు చేసిన  స్టాల్‌ను శ్రీ అపూర్వ చంద్ర సందర్శించారు. గొప్ప పుస్తకాలు సేకరించిన  పబ్లికేషన్స్ విభాగాన్ని ఆయన అభినందించారు.  భారతదేశ సాంస్కృతిక వారసత్వం, కళ, వాస్తు శిల్పం, అద్భుతమైన చరిత్ర, జాతీయ నాయకుల ముఖ్యమైన సమాచారాన్ని అందించేందుకు పబ్లికేషన్స్ విభాగం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. 

 ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ( ITPO), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ (FIP) సహకారంతో 27వ ఢిల్లీ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. 2023 జూలై 29 న ప్రారంభమైన ప్రదర్శన 2023  ఆగస్టు 2 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతుంది.  పబ్లికేషన్స్ విభాగం, సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ, ప్రగతి మైదాన్‌లోని స్టాల్ నంబర్ 12, హాల్ నంబర్ 11లో తన పుస్తకాలు, జర్నల్‌లను ప్రదర్శిస్తోంది.,

 స్టాల్‌లో సందర్శకులు దేశ నిర్మాణం, చరిత్ర, వారసత్వం,ప్రముఖుల  జీవిత చరిత్రలు, రిఫరెన్స్ పుస్తకాలు, బాలల సాహిత్యం వరకు వివిధ ఇతివృత్తాలకు సంబంధించిన పుస్తకాల  సేకరణ చూడ గలుగుతారు. రాష్ట్రపతి భవన్‌పై ప్రచురితమైన ముఖ్యమైన   పుస్తకాలు,  ప్రచురించిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతులు,  ప్రధాన మంత్రుల చేసిన ఉపన్యాసాల నుంచి ఎంపిక చేసి పబ్లికేషన్స్ విభాగం ప్రసంగాల సేకరణ కూడా స్టాల్ లో ఏర్పాటయింది. 

పుస్తకాలతో పాటు పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించి, పంపిణీ చేస్తున్న  యోజన, కురుక్షేత్ర, ఆజ్కల్, బాల్ భారతి వంటి జర్నల్‌లు కూడా స్టాల్‌లో అందుబాటులో ఉన్నాయి. సందర్శకులు డివిజన్ ప్రచురించిన జర్నల్‌లు, ఉపాధి వార్తలు / రోజ్‌గార్ సమాచార్‌ల వార్షిక సభ్యత్వాలను కూడా స్టాల్ లో స్వీకరిస్తున్నారు. 

 

***


(Release ID: 1944863) Visitor Counter : 183