రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత సైన్యంలో మహిళల సంఖ్య

Posted On: 31 JUL 2023 3:53PM by PIB Hyderabad

భారత సైన్యంలో, వైద్య & వైద్యేతర విభాగాల్లో ఉన్న మహిళల సంఖ్య ఇది:

  • 01 జులై 2023 నాటికి భారత సైన్యంలోని వైద్య విభాగంలో మొత్తం మహిళల సంఖ్య:
  • ఆర్మీ మెడికల్ కార్ప్స్ (ఏఎంసీ) - 1,212
  • ఆర్మీ డెంటల్ కార్ప్స్ (ఏడీసీ) - 168
  • మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (ఎంఎన్‌ఎస్‌) - 3,841
  • 01 జనవరి 2023 నాటికి భారత సైన్యంలో (ఏఎంసీ, ఏడీసీ, ఎన్‌ఎన్‌ఎస్‌ మినహా) మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,733

 

భారత సైన్యంలో మహిళల సంఖ్యను పెంచడానికి తీసుకొచ్చిన ప్రధాన కార్యక్రమాలు:

  • పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మహిళా సైనిక అభ్యర్థుల కోసం సంవత్సరానికి 20 ఖాళీలు కేటాయిస్తున్నారు. 2022 జులై నుంచి ఇది అమలులోకి వచ్చింది.
  • షార్ట్ సర్వీస్ కమిషన్‌, మహిళల కోసం 90 ఖాళీలు కేటాయించింది. వీటిలో 10 అదనపు ఖాళీలు 2023 జూన్ నుంచి అందుబాటులోకి వచ్చాయి.
  • మహిళా అధికారులను ఈ కింది విభాగాల్లోకి తీసుకోవడానికి 2023 మార్చి నుంచి ఆమోదం లభించింది:
  • సాయుధ విభాగాలు
  • రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్
  • సైన్యంలో పైలట్లుగా మహిళా అధికారులను 2021 జూన్ నుంచి అనుమతిస్తున్నారు
  • భారత సైన్యంలోని మిలిటరీ పోలీస్ కార్ప్స్‌లో ఇతర ర్యాంకులుగా మహిళల నమోదు 2019 నుంచి ప్రారంభమైంది

 

రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు. 

 

*****



(Release ID: 1944487) Visitor Counter : 82