ప్రధాన మంత్రి కార్యాలయం
మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్/సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రాతో ప్రధానమంత్రి భేటీ
Posted On:
28 JUL 2023 6:07PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్/సీఈవో శ్రీ సంజయ్ మెహ్రోత్రాతో సమావేశమయ్యారు. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థ బలోపేతం దిశగా ఆ సంస్థ ప్రణాళికలపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“శ్రీ సంజయ్ మెహ్రోత్రా @MicronTech ప్రెసిడెంట్/సీఈవో గాంధీనగర్‌లో ప్రధానమంత్రి @narendramodiని కలుసుకున్నారు. భారతదేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థ బలోపేతం చేసేదిశగా ఆ సంస్థ ప్రణాళికలపై వారు ఈ సందర్భంగా చర్చించారు” అని పేర్కొంది.
(Release ID: 1943866)
Visitor Counter : 168
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam