ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సంస్థలను దాటి ముందుకుసాగుతున్న మానసిక ఆరోగ్యం పేరుతో జాతీయ సదస్సును ప్రారంభించిన కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్


మానసిక ఆరోగ్య సమస్యలపై అవసరమైన సహాయం పొందకుండా అడ్డుగా నిలుస్తున్న సామాజిక రుగ్మతను తొలగించడం అవసరం : డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

సాధారణ మానసిక జబ్బులకు తక్కువ ఖర్చుతో , వైద్యాన్ని అందుబాటులోకి తేవడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న మంత్రి

మానసిక ఆరోగ్యానికి సమగ్ర విధానం ,, ఆరోగ్య సంరక్షణ, విద్య, ప్రభుత్వ విధానాలు, సామాజిక మద్దతు వ్యవస్థ అవసరం : జస్టిస్ అరుణ్ మిశ్రా

Posted On: 26 JUL 2023 12:12PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ , సంస్థలకు మించి ముందుకుసాగుతున్న మానసిక ఆరోగ్యం పేరుతో ఒక సదస్సును ఈరోజు  ప్రారంభించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్.హెచ్ఆర్సి) ఛైర్పర్సన్
జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సదస్సు ముఖ్య  ఉద్దేశం, మానసిక ఆరోగ్య చట్టం 2017ను సమర్ధంగా అమలు జరపడంలో ఎదురయ్యే సవాళ్లను చర్చించడం.
అలాగే మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై  ముందుకు పోవడానికి తీసుకోవలసిన చర్యలను చర్చించడం.


ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ పవార్, మానసిక ఆరోగ్యం అనేది మన అంతర్గత ఆరోగ్యంలో భాగమని అన్నారు. ఇది మన జీవన అన్ని పార్శ్వాలనూ ప్రభావితం చేస్తుందని అన్నారు.
ప్రజలు మానసిక ఆరోగ్య  సమస్యలపై సహాయం కోరడానికి ముందుకు రాకుండా ఉంటున్నారని ఇందుకుకారణమైన సామాజిక రుగ్మతను తొలగించాలని ఆమె అన్నారు. ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర  మోదీ నాయకత్వంలో
మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఇందుకు  అనుగుణంగా చరిత్రాత్మక మానసిక ఆరోగ్య రక్షణ చట్టం 2017ను ఆమోదించడం జరిగిందని చెప్పారు.

మానసిక ఆరోగ్యానికి సంబంధించిన రంగంగలో సమస్యల పరిష్కార ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ డాక్టర్ పవార్, కేంద్ర ప్రభుత్వం మానసిక ఆరోగ్య రుగ్మతలకకు తక్కువ ఖర్చుతో వైద్యం అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.
మానసిక ఆరోగ్యాన్ని కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మన్ భారత్ కార్యక్రమం కింద చేపడుతున్నట్టు తెలిపారు. జాతీయ టెలి మానసిక ఆరోగ్య సేవలను  ప్రారంభించినప్పటి నుంచి 42 టెలి మనసస్ సెల్ లను

 


ఏర్పాటు చేశారని వీటికి సుమారు 2 లక్షల కాల్స్ వచ్చాయని తెలిపారు.
నూతన మానసిక ఆరోగ్య దృక్ఫథం అవసరమని కేంద్ర  మంత్రి అన్నారు. దీనిప్రకారం సంస్థల పరిమితులను  అధిగమించి, కమ్యూనిటీ ఆధారిత మద్దతు దిశగా ముందుకు సాగాలన్నారు. ఇండియాలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన  తక్షణ సమస్యలపై చర్చించాల్సిందిగా ఆమె కోరారు.
అలాగే మానసిక ఆరోగ్యం అందుబాటులో,చవకా, సమగ్రంగా , కరుణతో అందరికీ  అందేలా ఉజ్వల భవిష్యత్ కోసం  కృషి చేయాలని ఆమె  పిలుపునిచ్చారు.
ప్రతి పదిమందిలో ఒకరు ఏదో ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. మానసిక ఆరోగ్యానికి సమగ్ర దృక్పథం  ,
 ఆరోగ్య రక్షణ, విద్య, ప్రభుత్వ విధానం, సామాజిక మద్దతు వ్యవస్థలు అవసరమని ఆయన తెలిపారు.

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారి పట్ల సానుభూతి ఉండాలని ఆంటూ ఆయన, శారీరక ఆరోగ్యానికి ఇచ్చినప్రాధాన్యతను మానసిక ఆరోగ్యానికి ఇవ్వాలని సూచించారు.
మానసిక ఆరోగ్యం, సాధారణ మెడికల్ కేర్, హాస్పిటల్, కమ్యూనిటీకేర్ వంటివి సరిగా అనుసంధానం కావాలన్నారు.
మానసిక ఆరోగ్యం లేకుండా , ఆరోగ్యమే లేదని జస్టిస్ మిశ్రా అన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన  విద్యను మనం


పాఠశాలలు, కళాశాలలు,పనిప్రేదశాలలో తెలియజేయాలని ఆయన సూచించారు. ఆరోగ్యవంతమైన హద్దుల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు.

దేశంలో మానసిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ జస్టిస్ మిశ్రా మానసిక ఆరోగ్య సేవలను  మెరుగు పరచడం, పరిశోధనకు మరిన్ని నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని జస్టిస్ మిశ్రా అన్నారు.
మానసిక ఆరోగ్య కేంద్రాలలో ఉల్లాసాన్‌ని కలిగించే మౌలికసదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మానసిక ఆరోగ్య కోర్సులు, ప్రొఫెషనల్స్కు శిక్షణ ఇచ్చే సంస్థలలో ప్రస్తుతం ఉన్న
సీట్లను  పెంచాలన్నారు. ఈ సందర్భంగా మానసిక ఆరోగ్యం అందరి ఆందోళన పేరుతో ఒకపుస్తకాన్ని విడుదల చేశారు. దీనిని మానసిక ఆరొగ్య చట్టం 2017 నేపథ్యంలో తీసుకువచ్చారు. అలాగే  మానసిక ఆరోగ్య చట్టం 2017
అమలు స్థితిగతులపై నివేదికను విడుదల చేశారు.

మానసిక  ఆరోగ్యంపై  జరిగిన  ఈ జాతీయ సదస్‌సులో , మానసిక ఆరోగ్య చట్టం 2017 అమలులో ఎదురౌతున్న సవాళ్ల గురించి, మానసిక ఆరోగ్య సంస్థలలో మానవ వనరుల గురించి, మౌలిక సదుపాయాలు, మానసిక రుగ్మతలు కలిగిన ప్రజల హక్కుల గురించి
పునరావాసం,సాధికారత, మానసిక ఆరోగ్యం విషయమై కీలక చికిత్సలో ఆధునిక ధోరణలు, అంతర్జాతీయ దృక్ఫథం వంటి వాటిపై పలు సెషన్లలో చర్చిస్తారు.
ఎన్.హెచ్.ఆర్.సి సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, ఎన్.హెచ్.ఆర్.సి సభ్యుడుశ్రీ రాజీవ్ జైన్, ఎన్.హెచ్.ఆర్.సి సభ్యుడు డాక్టర్ డి.ఎం. మూలే, ఎన్.హెచ్.ఆర్.సి పూర్వ సభ్యుడు జస్టిస్  ఎం.ఎం. కుమార్,
ఎన్.హెచ్.ఆర్.సి సంయుక్త కార్యదర్శి శ్రీ డికె నిమ్,  వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,  కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాక సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

***(Release ID: 1943148) Visitor Counter : 83