సహకార మంత్రిత్వ శాఖ

బహుళ రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు, 2022 పై ఈ రోజు లోక్ సభలో చర్చకు సమాధానమిచ్చిన కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా: చర్చ అనంతరం బిల్లుకు లోక్ సభ ఆమోదం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం బహుళ- రాష్ట్ర సహకార సంఘాలలో పారదర్శకత, జవాబుదారీతనం ,
లాభాలను పెంచే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.

బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలపడంతో దేశ సహకార ఉద్యమంలో కొత్త శకం ప్రారంభం కానుంది.

పి ఎ సి ఎస్ లను పునరుద్ధరించడానికి, వాటిని ఆచరణీయంగా, బహుముఖంగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

సభ్యుల ఎన్నికల ప్రక్రియను సంస్కరించడం, సమాజంలో పారదర్శకత తీసుకురావడం, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన సమగ్ర నిబంధనలను బిల్లులో పొందుపరిచారు.

కమిటీలలో ఒక షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగ, ఒక మహిళకు రిజర్వేషన్లు కల్పించే నిబంధనను ఈ బిల్లులో చేర్చారు: ఇది ఈ వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచుతుంది.

ఉద్యోగుల నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం, సెంట్రల్ రిజిస్ట్రార్ ఆమోదించిన ప్యానెల్ నుంచి ఆడిటర్ల నియామకం, నిర్దేశిత ప్రమాణాల ఆడిట్ అండ్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు కూడా బిల్లులో ఉన్నాయి.

వ్యాపారాన్ని సులభతరం చేయడానికి రిజిస

Posted On: 25 JUL 2023 7:59PM by PIB Hyderabad

బహుళ రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు, 2022 పై ఈ రోజు లోక్ సభ లో చర్చకు కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సమాధానమిచ్చారు. చర్చ అనంతరం లోక్ సభ  బిల్లును ఆమోదించింది.

లోక్ సభలో బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి సమాధానమిస్తూ, బహుళ రాష్ట్ర సహకార సంఘాల్లో పారదర్శకత, జవాబుదారీతనం, లాభాలను పెంచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలిపిందని తెలిపారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంస్కరణలను అమలు చేసేందుకు ఈ బిల్లులో ఎన్నికల అథారిటీకి అవకాశం కల్పించామని, ఎన్నికల కమిషన్ మాదిరిగానే అథారిటీ కూడా శక్తివంతంగా ఉంటుందని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఉండదని ఆయన అన్నారు. అంతేకాకుండా బోర్డులో మూడింట ఒక వంతు ఖాళీలు ఏర్పడితే ఖాళీగా ఉన్న పోస్టులకు మళ్లీ ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు కల్పించారు. వీటితో పాటు బోర్డు సమావేశాల్లో క్రమశిక్షణ, సహకార సంఘాల కార్యకలాపాలు సజావుగా సాగేందుకు నిబంధనలు ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీల సభ్యులు  మూడు నెలల్లో బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సహకార సంఘం పాలనలో పారదర్శకత తీసుకురావడానికి ఈక్విటీ షేర్ హోల్డర్లకు మెజారిటీ ఇచ్చేలా నిబంధన పెట్టినట్లు తెలిపారు.

ఈ బిల్లులో ఒక షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగ ఇంకా ఒక మహిళకు రిజర్వేషన్లు కల్పించామని, ఇది కమిటీలలో ఈ వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచుతుందని శ్రీ అమిత్ షా అన్నారు.

వివిధ రాజ్యాంగ నిబంధనలను పాటించకపోతే బోర్డు సభ్యులపై అనర్హత వేటు పడుతుందని ఆయన అన్నారు. ఉద్యోగుల నియామక ప్రక్రియలో రక్త సంబంధీకులు, దూరపు బంధువుల్లో ఎవరికీ ఉద్యోగం ఇవ్వబోమని స్పష్టం చేశారు. సమాచార హక్కును కూడా ఈ బిల్లులో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.

ఈ బిల్లును ఈ సభ ఆమోదించడంతో దేశ సహకార ఉద్యమంలో కొత్త శకం ప్రారంభమవుతుందని కేంద్ర హోం , , సహకార మంత్రి అన్నారు.

దేశంలో సహకార సంఘాల బలోపేతానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సహకార మంత్రిత్వ శాఖ తీసుకున్న వివిధ చర్యలను కేంద్ర సహకార మంత్రి లోక్ సభకు తెలియజేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో సహకార రంగానికి సంబంధించిన ప్రజలందరూ సహకార సంఘాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారని చెప్పారు. దశాబ్దాల  ఈ డిమాండ్ ను నెరవేరుస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని శ్రీ షా తెలిపారు.

భారతదేశంలో సహకార ఉద్యమం సుమారు 115 సంవత్సరాల నాటిదని, ఈ ఉద్యమం నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అమూల్, క్రిబ్కో, ఇఫ్కో వంటి అనేక ముఖ్యమైన సంస్థలను దేశానికి అందించిందని శ్రీ అమిత్ షా అన్నారు.

గత 75 ఏళ్లుగా సహకార సంఘాలపై దృష్టి పెట్టలేదని, జాతీయ, రాష్ట్ర స్థాయిలో, దేశ పార్లమెంటులో దీనిపై మేధోమథనం జరగలేదని ఆయన అన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడిన తర్వాత వచ్చే 25 ఏళ్లలో సహకార రంగం మరోసారి దేశాభివృద్ధికి బలంగా దోహదపడుతుందన్నారు.

శ్రీ మోదీ నాయకత్వంలో గత రెండేళ్లలో దేశంలోని సహకార రంగంలో అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర సహకార శాఖ మంత్రి తెలిపారు.

పి ఎ సి ఎస్ లను పునరుద్ధరించడానికి, వాటిని ఆచరణీయంగా, బహుముఖంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. రూ.2500 కోట్లతో దేశవ్యాప్తంగా 63 వేల పి ఎ సి ఎస్ లను కంప్యూటరీకరణ చేసే పనిని ప్రధాని మోదీ చేశారన్నారు. దీంతో పి ఎ సి ఎస్ లను జిల్లా సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, నాబార్డుతో అనుసంధానం చేయనున్నారు. కంప్యూటరీకరణ తర్వాత పి ఎ సి ఎస్ ల ఆడిట్ ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ లో ఉంటుందని, వారు అనేక రకాల వ్యాపారాలు చేయగలుగుతారని తెలిపారు. మోదీ ప్రభుత్వం పి ఎ సి ఎస్ లకు మోడల్ బైలాస్ రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపిందని, బెంగాల్, కేరళ మినహా అన్ని రాష్ట్రాలు వాటిని ఆమోదించాయని, నేడు దేశవ్యాప్తంగా

పి ఎ సి ఎస్ లు ఇదే చట్టం కింద నడుస్తున్నాయని తెలిపారు. ఇకపై

పి ఎ సి ఎస్  లు ఎఫ్ పి ఒ  పనులు కూడా చేయగలవని, ఇప్పటికే 1100

పి ఎ సి ఎస్  లు ఎఫ్ పి ఒ లుగా నమోదయ్యాయని తెలిపారు.

దేశంలోని కోట్లాది మంది ప్రజలకు శ్రీ మోదీ గ్యాస్ సిలిండర్లను అందించారని, ఇప్పుడు పిఎసిఎస్ లు కూడా ఎల్ పిజి పంపిణీ పనిని చేయగలవని శ్రీ అమిత్ షా అన్నారు. అదేవిధంగా, శ్రీ మోదీ దేశంలోని కోట్లాది మందికి ఉచిత ఆహార ధాన్యాలను అందిస్తున్నారని, ఇప్పుడు పిఎసిఎస్ లు కూడా రిటైల్ అవుట్ లెట్ లుగా పనిచేయగలవని, ఇకపై అవి కూడా జనౌషధి కేంద్రాలను నడపడంతో పాటు వాటర్ కమిటీగా నీటి పంపిణీ పనులను నిర్వహించగలవని శ్రీ షా తెలిపారు.

పిఎసిఎస్ లను శ్రీ మోదీ స్టోరేజీ వ్యవస్థకు అనుసంధానం చేశారని, ఇప్పుడు అవి కూడా స్టోరేజీలో నిమగ్నం కాగలవని ఆయన చెప్పారు. ఈ బడ్జెట్ లో శ్రీ మోదీ సహకార సంఘాలకు ఏళ్ల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని అంతం చేశారని, సహకార, కార్పొరేట్ పన్నులను సమానంగా తీసుకువచ్చారని అన్నారు.

మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ రైతులు తమ చెరకును సహకార చక్కెర మిల్లులకు విక్రయిస్తారని, కానీ దానిపై 30 శాతం ఆదాయపు పన్ను విధించారని,  అయితే  శ్రీ మోదీ రైతుల లాభాల పై పన్నును పూర్తిగా రద్దు చేశారని ఆయన చెప్పారు. అంతే కాదు గతంలో చెల్లించిన పన్నును తిరిగి చెల్లించే వెసులుబాటు కూడా కల్పించారని చెప్పారు.

సహకార సంఘాలను బలోపేతం చేయడానికి మోదీ ప్రభుత్వం కొత్తగా మూడు మల్టీ స్టేట్ సొసైటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కేంద్ర హోం,  సహకార శాఖ మంత్రి తెలిపారు. రైతుల ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి మొదటి సొసైటీ వేదికగా పనిచేస్తుంది.

రెండవ సొసైటీ చిన్న రైతులను విత్తనాల ఉత్పత్తితో అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా ఒక ఎకరం భూమి ఉన్న రైతులు కూడా విత్తన ఉత్పత్తితో సంబంధం కలిగి ఉంటారు. మూడవ సొసైటీ రైతుల సేంద్రియ ఉత్పత్తులను దేశ , ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేయడం ద్వారా వారి ఉత్పత్తులకు తగిన ధరను అందిస్తుంది. ఇది కాకుండా, రాబోయే రోజుల్లో సహకార విద్య కోసం ఒక సహకార విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని శ్రీ షా చెప్పారు.

జాతీయ సహకార డేటాబేస్ ను కూడా

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

త్వరలోనే ప్రారంభించనున్నారు. 2003 నుంచి 2020 వరకు దేశంలో ఎన్నడూ జాతీయ సహకార విధానం లేదని, అయితే ఈ ఏడాది దీపావళికి ముందు మోదీ నాయకత్వంలో కొత్త జాతీయ సహకార విధానాన్ని రూపొందిస్తామని, వచ్చే 25 ఏళ్ల పాటు సహకార పటాన్ని దేశం ముందు ఉంచుతామని చెప్పారు.

ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 9 సంవత్సరాల్లో దేశంలోని కోట్లాది మంది

ప్రజలను దారిద్ర్యం నుంచి విముక్తం చేయడానికి కృషి చేశారని అమిత్ షా అన్నారు. దేశంలో ఉపాధి కల్పనకు వ్యవసాయం, సహకార సంఘాలు ఒక్కటే మార్గమని, ఇందుకోసం ప్రధాని ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారన్నారు.

సభ్యుల ఎన్నికల ప్రక్రియను సంస్కరించడం, సమాజంలో పారదర్శకత తీసుకురావడం, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన వివరణాత్మక నిబంధనలను బిల్లులో పొందుపరిచారు.

సొసైటీ లోని సభ్యుల్లో క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం, డైరెక్టర్ల బోర్డులో బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం వంటి అంశాలను కూడా బిల్లులో పొందుపరిచారు. ఉద్యోగుల నియామక ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడం, సెంట్రల్ రిజిస్ట్రార్ ఆమోదించిన ప్యానెల్ నుంచి ఆడిటర్ల నియామకం, నిర్దేశిత ప్రమాణాల ఆడిట్ అండ్ అకౌంట్స్ ద్వారా ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు కూడా బిల్లులో ఉన్నాయి.

బిల్లులో, ఏకకాల ఆడిట్ ద్వారా సత్వర దిద్దుబాటు చర్యలు, సొసైటీ మోసపూరిత,  చట్టవ్యతిరేక కార్యకలాపాలలో సెంట్రల్ రిజిస్ట్రార్ క్రమశిక్షణ పాటించడం, దాని పనితీరు, ఆర్థిక పరిస్థితిపై దాని ఏర్పాటు ,దర్యాప్తు కూడా నొక్కి చెప్పబడింది. సులభ వ్యాపారం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియల్లో సవరణలు, దరఖాస్తుల సత్వర పరిష్కారం, దరఖాస్తులు, డాక్యుమెంట్ల ఎలక్ట్రానిక్ సమర్పణ, వాటి పరిశీలన తదితర అంశాలను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు.

 

ప్రభుత్వ ముందస్తు అనుమతితో ప్రభుత్వ వాటాల పునరుద్ధరణ, బహుళ రాష్ట్ర సహకార సంఘానికి అవకాశం కల్పించిన తర్వాత లిక్విడేషన్, సహకార బ్యాంకులపై బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949 అమలుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.

 

****



(Release ID: 1942657) Visitor Counter : 308