ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ (ఐఇసిసి)ని , జూలై 26న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


విశాలమైన 123 ఎకరాల ప్రాంగణంలో రూ 2,700 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని అభివృద్ధి చేశారు.

ఇది భారతదేశపు అతిపెద్ద ఎం.ఐ.సి.ఇ ( సమావేశాలు, ప్రోత్సాహకాలు, సదస్సులు, ఎగ్జిబిషన్ల నిర్వహణకు) గమ్యస్థానం.

ప్రపంచంలోని ఉన్నతస్థాయి ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కాంప్లెక్స్ ల జాబితాలో ఇది చోటు సంపాదించుకుంది.

అధునాతన కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ హాలు, యాంఫీ థియేటర్ వంటి ఎన్నో అధునాతన సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

ఇదొక పెద్ద నిర్మాణ అద్భుతం. ఈ కన్వెన్షన్ సెంటర్ భారీ అంతర్జాతీయ సదస్సులు, ఎగ్జిబిషన్లకు ఆతిథ్యం ఇవ్వగలదు.

శంఖం ఆకృతిలో దీనిని నిర్మించారు. దీని నిర్మాణంలో భారతీయ సంప్రదాయ కళ,సంస్కృతితో పాటు పలు నిర్మాణ ప్రత్యేకలు ఉండేలా చూశారు.

నూతనంగా నిర్మితమైన ఈ భవన సముదాయం, భారతీయ అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలను మరింతగా ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Posted On: 24 JUL 2023 6:37PM by PIB Hyderabad

ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ (ఐసిసిసి) కాంప్లెక్స్ను ప్రధానమంత్రి  శ్రీ నరేంద్రమోదీ 2023 జూలై 26న న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జాతికి అంకితం చేయనున్నారు.
సమావేశాలు, సదస్సులు నిర్వహించడానికి దేశంలో అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు ఉండాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్ (ఐఇసిసి) రూపుదిద్దుకుంది.
ప్రగతి మైదాన్లోని కాలం చెల్లిన , పాత సదుపాయాల స్థానంలో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీనిని రూ 2700 కోట్ల వ్యయంతో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టారు.
సుమారు 123 ఎకరాల స్థలంలో  నెలకొల్పిన ఈ ఐఇసిసి కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్ద ఎం.ఐ.సి.ఇ గా ఉంటుంది.  సమావేశాలు,ప్రోత్సాహకాలు, సదస్సులు, ఎగ్జిబిషన్ల నిర్వహణ గమ్యస్థానంగా నిలుస్తుంది.
వివిధ ఈవెంట్ల నిర్వహణకు ఇక్కడ అందుబాటులో ఉన్న  స్థలం దృష్ట్యా చూసినపుడు ఐఇసిసి కాంప్లెక్స్ ప్రపంచంలోని అతిపెద్ద ఎగ్జిబిషన్, కన్వెన్షన్ కాంప్లెక్స్ ల జాబితాలో చోటు  సంపాదించుకుంది.
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నూతనంగా అభివృద్ధి చేసిన ఐఇసిసి కాంప్లెక్స్లో  ఎన్నో అత్యధునాతన సదుపాయాలు ఉన్నాయి. అవి ఆధునిక కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ హాళ్లు, యాంఫీ థియేటర్లు. 

ఈ కన్వెన్షన్  సెంటర్ను ప్రగతి మైదాన్ కాంప్లెక్స్కు కేంద్ర ఆకర్షణగా అభివృద్ధి చేశారు. ఇదొక మహాద్భుత నిర్మాణం. భారీ స్థాయి అంతర్జాతీయ ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫెయిర్లు, సదస్సులు,సమావేశాలు ఇతర ప్రతిష్ఠాత్మక  అంతర్జాతీయ  ఈవెంట్లు నిర్వహించుకునేందుకు
దీనిని నిర్మించారు. ఇందులో పలు సమావేశ మందిరాలు, లాంజ్లు, ఆడిటోరియంలు, యాంఫీ థియేటర్లు  , బిజినెస్ సెంటర్లు ఉన్నాయి.  ఇందులో ఏకకాలంలో పలు ఈ వెంట్లు నిర్వహించడానికి వీలు కలుగుతుంది.
ఇందులో నిర్మించిన అధ్బుత బహుళ ప్రయోజనకర హాల్, ప్లీనరీ హాలులో ఏడు వేల మంది సమావేశం కావడానికి వీలుంది. ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత సిడ్నీ ఒపెరా హౌస్ సీటింగ్ సామర్ధ్యానికన్నా ఇది పెద్దది.
ఇందులో భారీ యాంఫీ థియేటర్ లో మూడువేల మంది కూర్చోవడానికి సదుపాయం ఉంది.

ఈ కన్వెన్షన్ సెంటర్ డిజైన్, భారతీయ సంప్రదాయాల నుంచి  ప్రేరణ పొందినది.  ఆధునిక సదుపాయాలు, ఆధునిక సౌకర్యాలు, జీవనవిధానాన్ని స్వీకరించడంలో గతంపట్ల విశ్వాసం,  నమ్మకాన్ని ప్రతిబింబించచేలా దీనిని రూపొందించారు.
ఈ సెంటర్ శంఖం  ఆకారంలో రూపుదిద్దుకుంది. ఇందులోని గోడలు, ఇతర పార్శ్వాలు భారతీయ కళలు, సంస్కృతిని ప్రతిబింబించేవిగా  ఉన్నాయి. సౌర విద్యుత్  ఉత్పత్తికి ఇండియా చేస్తున్న గణనీయ  కృషిని
సూర్య శక్తిని ఇందులో ప్రముఖంగా ప్రదర్శించారు. అంతరిక్షరంగంలో మనం సాధించిన  ప్రగతిని సున్నానుంచి ఇస్రో వరకు పేరుతో ఈ నిర్మాణంలో కనిపించేట్టు చేశారు. అలాగే పంచమహాభూతాలను ప్రతిబింబించేలా
వివిధ భవనాల బ్లాక్లకు ఆకాశ్, వాయు, అగ్ని, జల్, పృథ్వి వంటి పేర్లను పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన కళారూపాలు,పెయింటింగ్స్ను ఈ సెంటర్లో అందంగా అలంకరించారు.

ఈ కన్వెన్షన్ సెంటర్లో 5జి ఆధారిత సేవలు, క్యాంపస్ అంతటా వైఫై సదుఉపాయం, 10 జి ఇంటర్నెట్ అనుసంధానత ఉన్నాయి. 16 భాషలలో ప్రసంగాలను తర్జుమా చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి.
అధునాతన ఎవి వ్యవస్థ, పెద్దసైజు వీడియో  గోడలు, ఇంధన సమర్థత  కలిగిన వ్యవస్థలు, లైట్ మేనేజ్ మెంట్ వ్యవస్థలు, ఆక్యుపెన్సీ సెన్సర్లు, అత్యధునాతన డాటా కమ్యూనికేషన్ నెట్ వర్క్ వ్యవస్థ, సమీకృ నిఘా వ్యవస్థ
కేంద్రీకృత ఎయిర్  కండిషనింగ్ ఏర్పాటు ఉన్నాయి.
దీనికి  తోడు, ఐఇసిసి కాంప్లెక్స్ లో మొత్తం ఏడు ఎగ్జిబిషన్ హాళ్లు ఉన్నాయి. ఇవన్నీ విశాలమైనవి . వీటిలో ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫెయిర్ లు ,బిజినెస్ ఈవెంట్లు నిర్వహించుకోవచ్చు. ప్రపంచం  నలుమూలల నుంచి వివిధ ఉత్పత్తులను ప్రదర్శనకు  పెట్టడానికి,
వివిధ పరిశ్రమల కార్యకలాపాలను తెలియజేయడానికి వీలు కలిగిస్తుంది. అధునాతన ఇంజినీరింగ్,ఆర్కిటెక్చరల్ సమర్ధతకు , అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి  ఇది నిలువెత్తు  నిదర్శనంగా  నిలుస్తుంది.

ఐఇసిసి వెలుపలి  ఆవరణను కూడా ఆలోచనాత్మకంగా  , అందంగా తీర్చిదిద్దారు. ఇది ప్రధాన భవనానికి అందం  తెస్తోంది. ఈ ప్రాజెక్టును  ఎంత జాగ్రత్తగా ప్రణాళికా బద్దంగా చేపట్టారో దీనిని చూస్తే అర్ధమవుతుంది.
భారతీయ అద్భుత  సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబింబించేలా శిల్పాలు, చిత్రాలు ఏర్పాటు చేశారు. మ్యూజికల్ ఫౌంటెయిన్ చూపరులకు  కన్నుల పండుగగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న
నీటి కొలనులు, సరస్సులు, కృత్రిమ జలపాతాలు ఈ ప్రాంతానికి వన్నెతెస్తున్నాయి.
సందర్శకులకు అనువుగా ఉండేట్టు చూడడం ఐఇసిసి ప్రాధాన్యత. ఇక్కడ 5500 వాహనాల పార్కింగ్కు సదుపాయం ఉంది. సిగ్నల్స్ అవసరం  లేని  రోడ్ల కారణంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రాంగణానికి చేరుకునే వీలుంది.
మొత్తంగా దీని నిర్మాణం అంతా సమావేశాలకు, ఎగ్జిబిషన్లకు వచ్చే వారికి అత్యంత అనువుగా ఉండేట్టు చూశారు.

ప్రగతి మైదాన్లో నూతన ఐఇసిసి కాంప్లెక్స్ అభివృద్ధి, ఇండియా అంతర్జాతీయ వ్యాపార గమ్యస్థానంగా ఎదగడానికి ఉపకరిస్తుంది.  వ్యాపారం,వాణిజ్యాన్ని పెంపొందించడానికి కూడా ఇది కీలకంగా పనిచేస్తుంది. ఫలితంగా ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడానికి,
ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు  తమ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడానికి ఇది తోడ్పడుతుంది.
 పరస్పరం విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి, అత్యుత్తమ విధానాలను ప్రదర్శించడానికి, అలాంటి వాటిని స్వీకరించడానికి, సాంకేతిక పురోగతికి, పరిశ్రమల ధోరణులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, ఉపకరిస్తుంది.
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో గల ఐఇసిసి, భారతదేశపు ఆర్ధిక,   సాంకేతిక ప్రతిభాపాటవాలకు, ఆత్మనిర్భర్ స్ఫూర్తికి, నవ భారత నిర్మాణం దిశగా పురోగమనానికి నిదర్శనంగా నిలుస్తోంది.


(Release ID: 1942401) Visitor Counter : 141