సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని 40 ప్రదేశాలు
प्रविष्टि तिथि:
24 JUL 2023 4:25PM by PIB Hyderabad
జాతీయ పరిరక్షణ విధానం 2014 ప్రకారం, కేంద్ర రక్షిత స్మారక చిహ్నాల పరిరక్షణ కోసం సొంత మార్గదర్శకాలను భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) అనుసరిస్తుంది. భారత పురావస్తు విభాగం పరిధిలో 3,696 కేంద్ర రక్షిత స్మారక చిహ్నాలు/ప్రాంతాలు ఉన్నాయి. అవసరం, వనరుల లభ్యత ప్రకారం స్మారక చిహ్నాలు/ప్రాంతాల పరిరక్షణ జరుగుతుంది.
ప్రస్తుతం, యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని 40 ప్రాంతాలు ఉన్నాయి. యునెస్కో తాత్కాలిక జాబితాలో 52 ప్రాంతాలు (2022లో 6 ప్రాంతాలు చేరాయి) ఉన్నాయి.
నిబంధన ప్రకారం, ఏదైనా ఒక ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడానికి ఒక ముందు తాత్కాలిక జాబితాలో చేరుస్తారు. తాత్కాలిక జాబితాను పెంచడం ఒక నిరంతర ప్రక్రియ. యూనెస్కో కార్యాచరణ మార్గదర్శకాలు 2021 ప్రకారం, ప్రతి సంవత్సరం ఒక సాంస్కృతిక లేదా సహజ ఆస్తిని మాత్రమే ప్రతిపాదించగలం. ఒక ప్రాంతాన్ని జాబితాలో చేర్చడానికి తగిన ప్రమాణాలను నెరవేర్చాలి.
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు లోక్‌సభలో ఈ సమాధానం ఇచ్చారు.
*****
(रिलीज़ आईडी: 1942289)
आगंतुक पटल : 206