సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
8వ, 9వ కమ్యూనిటీ రేడియో అవార్డులను ప్రదానం చేసిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్; ప్రాంతీయ కమ్యూనిటీ రేడియో సమ్మేళనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి
లైసెన్సింగ్ సమయం 4 ఏళ్ల నుంచి 6 నెలలకు, 13 ప్రక్రియలు ఎనిమిదికి
కుదించిన ప్రభుత్వం : అనురాగ్ ఠాకూర్
మూడవ ఇ-వేలం సందర్భంగా 284 నగరాల్లోని 808 చానళ్లను వేలం వేయనున్నట్లు ప్రకటించిన అనురాగ్ ఠాకూర్
కేవలం గత రెండు సంవత్సరాలలో 120 కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ఏర్పాటు;, ప్రస్తుతం మొత్తం 450 కి పైగా కమ్యూనిటీ రేడియో స్టేషన్లు : శ్రీ అపూర్వ చంద్ర
Posted On:
23 JUL 2023 2:00PM by PIB Hyderabad
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు 8వ , 9వ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులను ప్రదానం చేశారు.న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ లో రెండు రోజుల రీజనల్ కమ్యూనిటీ రేడియో సమ్మేళనం (నార్త్) ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి ఈ అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్ భాగీదారి సే జన్ ఆందోళన్ విజన్ ను సాకారం చేయడంలో కమ్యూనిటీ రేడియో స్టేషన్ లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ స్టేషన్లు ఆకాశవాణి సేవలకు అనుబంధంగా ఉంటాయని, విపత్తుల సమయంలో శ్రోతలకు సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. .
మానవ వనరుల కొరత, ఆర్థిక ఒత్తిళ్లు, బాహ్య మద్దతు లేకపోవడం వంటి అనేక సవాళ్ల మధ్య కమ్యూనిటీ రేడియో స్టేషన్లు తమ సేవలను అందిస్తున్నాయని, ఈ జాతి సేవా స్ఫూర్తికి వారిని అభినందించాలని శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. అవార్డులు స్టేషన్లను ప్రోత్సహిస్తుండగా, భారతదేశంలోని మారుమూల మూలల్లో విద్య, అవగాహన కల్పన , సమస్యా పరిష్కారంలో కమ్యూనిటీ రేడియో ప్రాముఖ్యతను కూడా వారు గుర్తించారని మంత్రి చెప్పారు. ఈ అవార్డులు ఇతరులు ఈ రంగంలో ప్రవేశించడానికి ప్రోత్సహిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి వివరించారు.ఇలాంటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ఏర్పాటుకు పట్టే సమయాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. గతంలో లైసెన్స్ పొందడానికి సుమారు నాలుగు సంవత్సరాలు పట్టే సమయం ఇప్పుడు ఆరు నెలలకు తగ్గిందని, అలాగే పదమూడు ప్రక్రియలు ఉంటే, నేడు ఎనిమిది ప్రక్రియలకు ప్రభుత్వం
కుదించిందని కేంద్రమంత్రి వివరించారు.
ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు మంత్రిత్వ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు బ్రాడ్ కాస్ట్ సేవా పోర్టల్లో ఆన్ లైన్ లో ఉంది. సరళ సంచార్ పోర్టల్ కు కూడా అనుసంధానించబడింది.
భారతదేశంలో రేడియో పరిధి విస్తరణ గురించి మంత్రి మాట్లాడుతూ, నేడు దేశంలోని భౌగోళిక విస్తీర్ణంలో 80%, జనాభాలో 90% పైగా రేడియో ద్వారా కవర్ చేయబడిందని, ఈ పరిధిని మరింత విస్తరించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, మూడవ బ్యాచ్ ఇ-వేలం కింద 284 నగరాల్లోని 808 ఛానళ్లను వేలం వేయడం ఆ దిశలో ఒక పెద్ద అడుగు అని అన్నారు.
కమ్యూనిటీ రేడియో స్టేషన్ల సంఖ్య పెరగడం వాటి పెరుగుతున్న ప్రజాదరణకు నిదర్శనమని శ్రీ ఠాకూర్ అన్నారు. ప్రతి జిల్లాలో ఒక కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఉండాలని, తరువాత ఇది ఇది ప్రతి బ్లాక్ లో ఒక కమ్యూనిటీ స్టేషన్ కు మారాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజన్ ను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్ల అనుభవాలను ఒకచోట చేర్చడానికి ఒక వేదిక ఆవశ్యకత గురించి శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, కమ్యూనిటీ సేవల రంగంలో వివిధ ప్రయోగాలు, ఆవిష్కరణలు భారతదేశం అంతటా ఉన్న ఈ రేడియో స్టేషన్ల ద్వారా ఒంటరిగా చేయబడుతున్నాయని చెప్పారు. ఈ స్టేషన్లు తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకునేలా ఒక నెట్వర్క్ నుసృష్టించవచ్చని, తద్వారా వీటిలో ఉత్తమమైన వాటిని దేశవ్యాప్తంగా
అనుసరించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్టేషన్ల ఆలోచనల నుండి ఒక పవర్ హౌస్ సృష్టించే సమాజాన్ని ఆయన ఆకాంక్షించారు.
అవార్డుల జ్యూరీ కృషికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.8, 9వ ఎడిషన్ లకు అవార్డు పొందిన స్టేషన్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఈ రంగంలో వారు కొనసాగిస్తున్న ప్రతిభకు ఇది గుర్తింపు అని మంత్రి అభినందించారు.
అంతకు ముందు కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ, కమ్యూనికేషన్ రంగం టెలివిజన్ ,తరువాత ఇంటర్నెట్ ఇప్పుడు ఓటిటి రూపంలో ఎంతో అనేక పురోగతిని చూసిం దని, కానీ అది రేడియో కు గల ప్రజాదరణ , పరిధిని దెబ్బతీయలేదని అన్నారు. కమ్యూనిటీ రేడియో ఇతర ప్లాట్ ఫారం ల ప్రభావానికి లోను కానంత దూరంలో తనదైన ఉనికిని కలిగి ఉందని, ఇంకా ఆధునిక మీడియా అందించని కనెక్టివిటీని అందిస్తుందని అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి ఈ అవార్డుల నిర్వహణను నిరోధించిందని, అందువల్ల ఈ సంవత్సరం మంత్రిత్వ శాఖ 8 , 9 వ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులను కలిపి ప్రదానం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
గత రెండు సంవత్సరాలలో 120 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు అదనంగా ఏర్పాటయ్యాయని, మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న 100 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్స్ తో కలిపి మొత్తం 450 కి పైగా పెరిగాయని ఆయన తెలియజేశారు.
8వ , 9వ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులనేవి ప్రజాప్రయోజనాల కోసం ద తమ రంగంలో ప్రశంసనీయమైన కృషి చేసిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు ఇచ్చే గుర్తింపు. 2023 జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా నిర్వహించే కమ్యూనిటీ రేడియో ప్రాంతీయ సమ్మేళనంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నారు.
తొమ్మిదవ జాతీయ కమ్యూనిటీ రేడియో అవార్డులకు నాలుగు కేటగిరీల్లో మొత్తం 12 అవార్డులను అందజేస్తున్నారు. అవార్డు పొందిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లు హర్యానా, బీహార్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్ ,త్రిపుర రాష్ట్రాల్లో ఉన్నాయి.
కమ్యూనిటీ రేడియోలో మెరుగైన కార్యక్రమాలను , కమ్యూనిటీ రేడియో స్టేషన్లను స్థానిక సమాజ ప్రయోజనాల కోసం కార్యక్రమాలను రూపొందించేలా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం నేషనల్ కమ్యూనిటీ రేడియో అవార్డులను ఏర్పాటు చేసింది. సమాజ కేంద్రీకృత కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీ రేడియో బ్రాడ్ కాస్టింగ్ రంగంలో విశేష కృషి చేసిన కమ్యూనిటీ రేడియో స్టేషన్లకు నేషనల్ కమ్యూనిటీ రేడియో అవార్డులు ప్రదానం చేస్తారు. వివిధ కేటగిరీల అవార్డులు కమ్యూనిటీ రేడియోలు వివిధ అంశాలపై కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ప్రేరణగా పనిచేశాయి. ఈ అవార్డులు సుస్థిరత, సృజనాత్మకత , పౌరుల భాగస్వామ్య సంస్కృతిని ప్రోత్సహించాయి.
పబ్లిక్ సర్వీస్ రేడియో బ్రాడ్ కాస్టింగ్, కమర్షియల్ రేడియో కంటే భిన్నంగా కమ్యూనిటీ రేడియో రేడియో బ్రాడ్ కాస్టింగ్ లో ఒక ముఖ్యమైన మూడవ అంచెగా ఉంది. కమ్యూనిటీ రేడియో స్టేషన్లు (సి ఆర్ ఎస్ లు) తక్కువ శక్తి గల రేడియో స్టేషన్లు. వీటిని కమ్యూనిటీ ఆధారిత సంస్థలు ఏర్పాటు చేసి, నిర్వహిస్తాయి.
కమ్యూనిటీ రేడియో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం మొదలైన అంశాలపై స్థానిక స్వరాలను ప్రసారం చేయడానికి కమ్యూనిటీలకు ఒక వేదికను అందిస్తుంది. కమ్యూనిటీ రేడియో తన సమగ్ర విధానం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారతదేశం వంటి దేశంలో, ప్రతి రాష్ట్రం దాని స్వంత భాష , విలక్షణమైన సాంస్కృతిక గుర్తింపును కలిగి ఉంది, సిఆర్ఎస్ లు స్థానిక జానపద సంగీతం , సాంస్కృతిక వారసత్వ భాండాగారంగా ఉన్నాయి. అనేక సి ఆర్ ఎస్ లు స్థానిక పాటలను భావితరాల కోసం రికార్డ్ చేసి భద్రపరుస్తాయి. స్థానిక కళాకారులకు వారి ప్రతిభను సమాజానికి ప్రదర్శించడానికి ఒక వేదికను ఇస్తాయి.
సి ఆర్ ఎస్ ప్రత్యేక స్థానం సానుకూల సామాజిక మార్పు కు సాధనం, ఇది కమ్యూనిటీ సాధికారతకు అనువైన సాధనంగా చేస్తుంది. కమ్యూనిటీ రేడియో ప్రసారాలు స్థానిక భాషలు , మాండలికాలలో ఉన్నందున, ప్రజలు దానితో తక్షణమే సంబంధం కలిగి ఉండగలుగుతారు.
భారతదేశంలో కమ్యూనిటీ రేడియో ఉద్యమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు ఇస్తోంది, తద్వారా ఈ రకమైన మాస్ మీడియా ప్రధాన స్రవంతి మీడియా ఉనికి తక్కువగా ఉన్న చివరి మైలు వరకు చేరుకుంటుంది. గత కొన్నేళ్లలో కమ్యూనిటీ రేడియో స్టేషన్లు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం, దేశంలో మొత్తం 449 కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ఉన్నాయి, వీటిలో 70% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కమ్యూనిటీ రేడియో స్టేషన్ల ఏర్పాటుకు సుమారు 100 సంస్థలకు అనుమతి ఇచ్చారు. వారిని ప్రధాన స్రవంతి అభివృద్ధి ప్రక్రియలోకి తీసుకురావడానికి కమ్యూనిటీ సాధికారత పరివర్తన దిశగా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం.
నేషనల్ కమ్యూనిటీ రేడియో అవార్డ్స్ 1, 2, 3వ బహుమతి వరుసగా రూ.1 లక్ష, 75,000/, 50,000/=లను కలిగి ఉంటాయి. అవార్డు గ్రహీతల వివరాలు ఇలా ఉన్నాయి:-
థీమాటిక్ అవార్డులు
• ప్రథమ బహుమతి: రేడియో మైండ్ ట్రీ, అంబాలా, హర్యానా; ప్రోగ్రామ్ పేరు: హోప్ జీనే కీ రాహ్
• ద్వితీయ బహుమతి: రేడియో హీరాఖండ్, సంబల్పూర్, ఒడిశా; ప్రోగ్రామ్ పేరు: అధర్ ఓ పోషణ్ బిగ్యాన్
• తృతీయ బహుమతి: గ్రీన్ రేడియో, సబౌర్, బీహార్; ప్రోగ్రామ్ పేరు:
పోషణ్ శ్రింఖ్లా
మోస్ట్ ఇన్నోవేటివ్ కమ్యూనిటీ
ఎంగేజ్మెంట్ అవార్డులు
• ప్రథమ బహుమతి : రేడియో ఎస్డీ, ముజఫర్ నగర్, ఉత్తరప్రదేశ్; ప్రోగ్రామ్ పేరు: హిజ్రా ఇన్ బిట్వీన్
• ద్వితీయ బహుమతి: కబీర్ రేడియో, సంత్ కబీర్ నగర్, ఉత్తర ప్రదేశ్; ప్రోగ్రామ్ పేరు: సెల్ఫీ లే లేరే
•మూడవ అవార్డు: రేడియో మైండ్ ట్రీ, అంబాలా, హర్యానా , ప్రోగ్రామ్ పేరు: బుక్ బగ్స్
స్థానిక సంస్కృతి ప్రోత్సాహక పురస్కారాలు
*ప్రథమ బహుమతి: వాయిస్ ఆఫ్ ఎస్ఓఏ, కటక్, ఒడిశా; ప్రోగ్రామ్ పేరు: అస్మిత
*ద్వితీయ బహుమతి: ఫ్రెండ్స్ ఎఫ్ఎం, త్రిపుర, అగర్తలా; కార్యక్రమం పేరు: అంతరించిపోతున్న కళ పునరుద్ధరణ: మాస్క్ అండ్ పిఓటి
*తృతీయ బహుమతి: . పంతునగర్ జనవాణి, పంతునగర్ , ఉత్తరాఖండ్; ప్రోగ్రామ్ పేరు: దాదీ మా కా బటువా
సస్టెయినబిలిటీ మోడల్ అవార్డులు
•ప్రథమ బహుమతి: రేడియో హీరాఖండ్, సంబల్పూర్, ఒడిశా
*ద్వితీయ బహుమతి: వయలగవనోలి, మదురై, తమిళనాడు
*మూడవ బహుమతి: వగడ్ రేడియో "90.8", బన్స్వారా, రాజస్థాన్
***
(Release ID: 1941977)
Visitor Counter : 153