ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఓ ముఖ్యమైన మైలురాయిని దాటిన నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా: 2022 అక్టోబర్‌లో కార్యక్రమం ప్రారంభమైనప్పటినుండి టెలి మనస్ హెల్ప్‌లైన్‌కు 200,000 కాల్స్ వచ్చాయి
దేశవ్యాప్తంగా అందరికీ నాణ్యమైన మానసిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
31 రాష్ట్రాలు మరియు యూటీలలో 42కి పైగా టెలి మనస్ సెల్స్ పనిచేస్తున్నాయి. ఈ సేవ ప్రస్తుతం 20 భాషల్లో రోజుకు 1,300+ కాల్‌లను అందిస్తోంది.
1900 మంది శిక్షణ పొందిన కౌన్సెలర్లు ఈ సర్వీసులను అందిస్తున్నారు
పరీక్షల సీజన్‌లో పరీక్ష ఒత్తిడికి సంబంధించిన కాల్‌ల పెరుగుదల గమనించబడింది
Posted On:
22 JUL 2023 9:11AM by PIB Hyderabad
నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (దేశవ్యాప్తంగా టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ మరియు నెట్‌వర్కింగ్: టెలి మానస్, 'డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్'కు చెందిన డిజిటల్ విభాగం) దేశంలో మానసిక ఆరోగ్య సేవలను పటిష్టం చేయడానికి అక్టోబర్ 2022లో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పుడు ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. టోల్-ఫ్రీ సేవ ప్రారంభించినప్పటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 2,00,000 పైగా కాల్‌లను స్వీకరించింది. ఇది స్థిరమైన ప్రగతిశీల ధోరణిని చూపిస్తుంది. కేవలం 3 నెలల వ్యవధిలోనే అందుకున్న కాల్స్ సంఖ్య 1 లక్ష (ఏప్రిల్ 2023లో) నుండి 2 లక్షల కాల్‌లకు చేరింది.
కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చేసిన ట్వీట్‌లో ఈ ఘనత సాధించిన దేశవాసులను అభినందించారు.
31 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం 42 టెలి మనస్ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. 20 భాషల్లో రోజుకు 1300కంటే ఎక్కువ కాల్స్‌ను ఈ సెంటర్లు అందుకుంటున్నాయి. మొదటి లైన్ సేవలను నడుపుతున్న 1900 మంది కౌన్సెలర్లు ఈ మేరకు శిక్షణ పొందారు. మానసిక విచారం, నిద్ర భంగం, ఒత్తిడి మరియు ఆందోళన వంటివి ఎదుర్కొనే అత్యంత సాధారణ ఆందోళనలకు వీరు పరిష్కారం అందిస్తున్నారు. దాదాపు 7000 కాల్‌లను కౌన్సెలర్‌లు కాల్‌బ్యాక్‌ల ద్వారా అనుసరించారు. అక్కడ వారు లూప్ ఆఫ్ కేర్‌ను పూర్తి చేయడంలో విజయం సాధించారు. నిపుణుల సంరక్షణ అవసరమయ్యే కాలర్‌లు డిఎంహెచ్‌పి మరియు ఇతర సమీపంలోని ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల వంటి తగిన సేవలకు విజయవంతంగా లింక్ చేయబడుతున్నారు.
పరీక్షల సీజన్‌లో పరీక్ష ఒత్తిడికి సంబంధించిన కాల్స్ అధిక సంఖ్యలో వచ్చాయి.ఈ కాలర్‌లకు సపోర్టివ్ కౌన్సెలింగ్ మరియు సెల్ఫ్-హెల్ప్ స్ట్రాటజీలతో కౌన్సెలర్‌లు సహాయం అందించారు. వివిధ విద్యా సంస్థలలో ఎక్కువ మంది విద్యార్థులు/కౌమారదశకు చేరుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రింట్ మీడియా, రేడియో మరియు సోషల్ మీడియా వంటి విభిన్న మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టెలి మనస్ సేవల ప్రచారం జరుగుతోంది. టెలి మనస్ కాలర్‌లకు ప్రాథమిక కౌన్సెలింగ్ మరియు మానసిక ఆరోగ్య సేవలను అందించడం కొనసాగిస్తుంది. రాబోయే రోజుల్లో ఇ-సంజీవనితో ఏకీకరణతో సహా ఇప్పటికే ఉన్న ముఖ్యమైన సేవలు మరియు వనరులకు అనుసంధానం చేస్తుంది. టెలి మనస్ 9 నెలల్లో 2లక్షల కాల్స్ మార్కును చేరుకోవడంతో భారతదేశం అంతటా సమగ్ర డిజిటల్ మానసిక ఆరోగ్య నెట్‌వర్క్‌ను నిర్మించడం మరియు చేరుకోని వారిని చేరుకోవడం అనే దాని అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి ఇది ప్రయాణంలో ఉంది.
దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభానికి అంగీకారంగా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన టెలి మనస్ కార్యక్రమం ప్రజలకు అవసరమైన మానసిక సేవలను అందించడంద్వారా వారి మానసిక ఆరోగ్య సమస్యలకు మద్దతు పొందేలా చేస్తుంది. తద్వారా సాధారణంగా మానసిక ఆరోగ్య సమస్యల చుట్టూ ఉన్న సమస్యలను తగ్గించడం కోసం ఇది ఒక వినూత్న కార్యక్రమం.
నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా దేశంలోని మానసిక ఆరోగ్య శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారిస్తుంది. అదే సమయంలో మానసిక ఆరోగ్య సేవలు ప్రతి ఇంటికి మరియు ప్రతి వ్యక్తికి ఉచితంగా అందేలా చూస్తాయి. సమాజంలోని అత్యంత దుర్బలమైన మరియు చేరుకోని వర్గాలను లక్ష్యంగా చేసుకుంటాయి. టెలి మనస్ 6 నెలల్లో 1 లక్ష మార్కును చేరుకోవడంతో భారతదేశం అంతటా పటిష్టమైన డిజిటల్ మెంటల్ హెల్త్ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే దాని అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఇది కొత్త మార్గాన్ని సంతరించుకుంది.
టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌లు: 14416 లేదా 1-800-891-4416 బహుళ భాషా సదుపాయంతో కాలర్‌లు సేవలను పొందడం కోసం తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.
******
(Release ID: 1941805)
Visitor Counter : 162