సహకార మంత్రిత్వ శాఖ

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్) ద్వారా కామన్ సర్వీసెస్ సెంటర్ (సిఎస్ సి) సేవలను ప్రారంభించడంపై ఈ రోజు న్యూఢిల్లీలో జాతీయ మెగా కాన్ క్లేవ్ ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


పిఎసిఎస్ లు, సి ఎస్ సి ల విలీనంతో సహకార సంఘాల బలోపేతానికి, డిజిటల్ ఇండియాను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన రెండు సంకల్పాలు నేడు నెరవేరుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 300కు పైగా పథకాలను సి ఎస్ సి తో అనుసంధానం చేశాం; గ్రామంలోని పేద ప్రజలకు సి ఎస్ సి ని తీసుకెళ్లేందుకు పిఎసిఎస్ లను మించిన పెద్ద మార్గం మరొకటి ఉండదు

పిఎసిఎస్ లు, సి ఎస్ సి ల విలీనంతో పేదలకు సౌకర్యాలు పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి, బలం చేకూరుతుంది; ఇది దేశాభివృద్ధికి గరిష్ఠ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి దోహదపడుతుంది

సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయాలంటే దాని అతిచిన్న యూనిట్ అయిన పిఎసిఎస్ ను బలోపేతం
చేయాలి; పిఎసిఎస్ లు బలంగా లేకపోతే సహకార ఉద్యమం నిలబడదు.

పిఎసిఎస్ లను పారదర్శకంగా మార్చడంతోపాటు ప్రభుత్వ పథకాలను పిఎసిఎస్ లతో అనుసంధానం చేసేలా వాటిని ఆధునీకరించడం ద్వారా జవాబుదారీతనాన్ని మోదీ ప్రభుత్వం నిర్ధారిస్తోంది.

'కనీస ప్రభుత్వం, చివరి మైలు వరకు సేవలతో గరిష్ట పాలన, అవినీతి లేకుండా' అనే మంత్రాన్ని సాకారం చేయడానికి
సి ఎస్ సి ని మించిన మార్

Posted On: 21 JUL 2023 4:18PM by PIB Hyderabad

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పిఎసిఎస్) కామన్ సర్వీసెస్ సెంటర్ (సిఎస్ సి ) సేవలను ప్రారంభించడంపై కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో జాతీయ భారీ సమ్మేళనాన్ని (మెగా కాన్ క్లేవ్ ) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వే శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ బిఎల్ వర్మ, సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ జ్ఞానేష్ కుమార్ , ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అఖిలేష్ కుమార్ శర్మ, సిఎస్ సి-ఎస్ పివి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సంజయ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

 

కేంద్ర హోం ,  సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో, పిఎసిఎస్,  సిఎస్ సిల విలీనంతో, సహకార సంఘాలను బలోపేతం చేయడానికి,  డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన రెండు సంకల్పాలు నేడు నెరవేరుతున్నాయని అన్నారు. డిజిటల్ ఇండియా మిషన్ కింద సి ఎస్ సి ద్వారా పాలన నుంచి అవినీతిని రూపుమాపాలని, పేద ప్రజల ముంగిటకు సౌకర్యాలను తీసుకువెళ్లాలని, సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా పి ఎ సి ఎస్ నుంచి అపెక్స్ వరకు మొత్తం సహకార వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని మోదీ తీసుకున్న సంకల్పాలు నేడు ఏకీకృతమయ్యాయి.

 

శ్రీ అమిత్ షా మాట్లాడుతూ,  ప్ర ధాన మంత్రి శ్రీ మోదీ గొప్ప దార్శనికత తో

సహకార మంత్రిత్వ శాఖకు దిశానిర్దేశం చేశారని అన్నారు. సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయాలంటే దాని అతి చిన్న విభాగం అయిన పి ఎ సి ఎస్ ను బలోపేతం చేయాలన్నారు. పి ఎ సి ఎస్  లు పటిష్టం కానంత వరకు సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయలేమన్నారు.

అందువల్ల పి ఎ సి ఎస్ లను పారదర్శకంగా, జవాబుదారీతనం ఉండేలా కంప్యూటరీకరించాలని, ప్రభుత్వ డిజిటలైజ్డ్ పథకాలను పి ఎ సి ఎస్ లతో అనుసంధానం చేసేలా వాటిని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన 20 రోజుల్లోనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిఎసిఎస్ ల కంప్యూటరీకరణకు రూ.2,500 కోట్లు కేటాయించారని, దీనితో 65,000 పిఎసిఎస్ లను కంప్యూటరీకరణ చేస్తున్నామని శ్రీ షా తెలిపారు.

 

'కనీస ప్రభుత్వం, చివరి మైలు వరకు అవినీతి లేకుండా గరిష్ట పాలన ‘ అనే ఫార్ములాను అమలు చేయడానికి సి ఎస్ సి ని మించిన పెద్ద మార్గం మరొకటి ఉండదని కేంద్ర సహకార మంత్రి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 300కు పైగా చిన్న లబ్దిదారుల పథకాలను సి ఎస్ సి  లో విలీనం చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లోని నిరుపేదలకు, భూమిలేని వ్యవసాయ కూలీలకు, దళిత, గిరిజన వర్గాలకు

సి ఎస్ సి సేవలు అందించేందుకు పిఎసిఎస్ లను మించిన మార్గం మరొకటి ఉండదన్నారు. నేడు పి ఎ సి ఎస్ లు,

సి ఎస్ సి లు ఏకమవుతున్నాయని, దీనివల్ల పేదల సౌకర్యాలు పెరగడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త శక్తి, బలం చేకూరుతుందన్నారు. దీనితో పాటు దేశాభివృద్ధికి గరిష్ఠ సామర్థ్యాన్ని కూడా వినియోగించుకోగలుగుతామని అన్నారు.

 

ఇప్పటి వరకు 17,176 పి ఎ సి ఎస్ లు సి ఎస్ సి లో రిజిస్టర్ అయ్యాయని , రెండు నెలల స్వల్ప వ్యవధిలోనే 17 వేలకు పైగా పి ఎ సి ఎస్ లను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి తెలిపారు. ఈ గణనీయమైన విజయం సాధించినందుకు సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిని, మంత్రిత్వ శాఖ మొత్తం బృందాన్ని శ్రీ షా అభినందించారు. 17,176 పి ఎ సి ఎస్  లకు గాను 6,670 పి ఎ సి ఎస్ లు పనిచేయడం ప్రారంభించాయని, మిగిలిన పి ఎ సి ఎస్  లు కూడా మరో 15 రోజుల్లో పనిచేస్తాయని తెలిపారు. దీని ద్వారా సుమారు 14,000 మంది గ్రామీణ యువతకు ఉపాధి లభిస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామాల్లో సౌకర్యాల బలోపేతానికి ఈ యువత కృషి

చేస్తుందని అన్నారు. మన దేశ జనాభాలో 60-65% మంది గ్రామాల్లో నివసిస్తున్నారని, అందువల్ల "సహకార్ సే సమృద్ధి" మంత్రంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి,  వైవిధ్యపరచడానికి మనం ప్రయత్నించాలని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, గత 9 సంవత్సరాల్లో

భారత ప్రభుత్వం 60 కోట్ల మందికి

రూ.5 లక్షల వరకు ఉచితంగా రేషన్ , హౌసింగ్ , విద్యుత్ , నీరు, వంటగ్యాస్ , మరుగుదొడ్లు, ఆరోగ్య సదుపాయాలు అందించిందని అమిత్ షా తెలిపారు.

ఇప్పుడు 17 వేలకు పైగా పి ఎ సి ఎస్ లు కూడా ఈ సౌకర్యాలన్నింటికీ రిజిస్ట్రేషన్లు చేయడానికి, గ్రామీణ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మాధ్యమంగా మారనున్నాయి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డు, మొబైల్ ను అందించడమే కాకుండా, డిజిటల్ ఇండియా

కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, గ్రామ పంచాయితీల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసే బృహత్తర కార్యాన్ని

నిర్వహించారని ఆయన చెప్పారు.

 

గడచిన తొమ్మిదేళ్లలో దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 250 శాతం పెరిగిందని, ఒక్కో జీబీ డేటా ధర 96 శాతం తగ్గిందని, దీనివల్ల పేదలు, నిరుపేదలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలుగుతున్నారని శ్రీ అమిత్ షా తెలిపారు. పి ఎ సి ఎస్ లను కంప్యూటరీకరణ చేయడం ద్వారా ప్రభుత్వం వాటిని బహుళార్థసాధకంగా మార్చిందని, ఎఫ్ పి ఒ (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ) లుగా పనిచేసేలా అధికారం కల్పించిందన్నారు.

వీటితోపాటు విత్తనోత్పత్తి, సేంద్రియ వ్యవసాయ మార్కెటింగ్, రైతుల ఉత్పత్తుల ఎగుమతుల కోసం మూడు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకం కూడా ప్రారంభమైంది. వచ్చే అయిదేళ్లలో దేశంలోని 30 శాతం ఆహార ధాన్యాలను చిన్న పి ఎ సి ఎస్ లు నిల్వ చేస్తాయని చెప్పారు.

 

ఇప్పుడు పి ఎ సి ఎస్ లు ఎల్ పిజి, డీజిల్ , పెట్రోల్ పంపిణీ పనులను ప్రారంభించవచ్చని శ్రీ అమిత్ షా చెప్పారు. చౌక ధరల దుకాణం, జన ఔషధి కేంద్రం, ప్రధాన మంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం, ఫర్టిలైజర్ షాపులను కూడా తెరవవచ్చునని, . ఈ పనుల ద్వారా పి ఎ సి ఎస్ లు గ్రామ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారతాయన్నారు.

 

పి ఎ సి ఎస్ లు సుభిక్షంగా ఉంటే రైతు సుభిక్షంగా ఉంటాడని, దాని లాభం నేరుగా రైతు ఖాతాలో జమ అవుతుందన్నారు. సహకార రంగంలో ప్రభుత్వం అనేక చట్టపరమైన, పరిపాలనా సంస్కరణలు చేపట్టిందని, ఆర్థిక కార్యకలాపాలను బహుముఖంగా ప్రోత్సహిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వ సహకార పథకాలు, నిరంతర సంస్కరణలు అట్టడుగు స్థాయికి చేరుకుంటే సహకార ఉద్యమం బలపడకుండా ఎవరూ ఆపలేరన్నారు.

పి ఎ సి ఎస్  లను బలోపేతం చేయడం ద్వారా గ్రామ సౌభాగ్యం ‘ అనే మంత్రాన్ని అవలంబించి పి ఎ సి ఎస్ లు లను బలోపేతం చేసి ముందుకు తీసుకు

వెడతామని ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, సహకార మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక కొత్త చొరవ తీసుకుందని, సహారా గ్రూప్ సహకార సంఘాలలో చిక్కుకున్న డిపాజిటర్ల డబ్బును తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించిందని కేంద్ర హోం , సహకార మంత్రి తెలిపారు.

సహకార మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని,  ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు సహారా గ్రూప్ లోని సహకార సంఘాల నిజమైన డిపాజిటర్లకు చట్టబద్ధమైన బకాయిల చెల్లింపు కోసం "సహారా-సెబీ రీఫండ్ ఖాతా" నుండి సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సిఆర్ సిఎస్) కు రూ .5000 కోట్లు బదిలీ చేయాలని ఆదేశించిందని

ఆయన చెప్పారు.  ఈ క్రమంలోనే 2023 జూలై 18న ' సిఆర్ సిఎస్ -సహారా రిఫండ్' పోర్టల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఐదు  లక్షల మంది పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్నారని, నిజమైన డిపాజిటర్లకు డబ్బును తిరిగి ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని అమిత్ షా తెలిపారు. ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తే అత్యంత సంక్లిష్టమైన సమస్యలను సైతం పరిష్కరించవచ్చనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని శ్రీ అమిత్ షా అన్నారు.

 

*****



(Release ID: 1941577) Visitor Counter : 148