గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహణలోని స్వతంత్ర సంస్థ గిరిజన విద్యార్థుల జాతీయ ఎడ్యుకేషన్ సొసైటీ (నెస్ట్స్) ఇఎంఆర్ఎస్ కోసం బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపడుతోంది. టిజిటిలు, హాస్టల్ వార్డెన్ల పోస్టులు 6329 భర్తీ కోసం ఇఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ పరీక్షలు (ఇఎస్ఎస్ఇ)-2023కి నోటిఫికేషన్ జారీ చేసింది
ఇఎంఆర్ఎస్ లలో విద్యాప్రమాణాల మెరుగుదలకు అవసరమైన నాణ్యమైన మౌలిక వసతులను అందుబాటులోకి తేవడానికి ఈ చర్య దోహదపడుతుంది.
Posted On:
19 JUL 2023 6:03PM by PIB Hyderabad
సిబిఎస్ఇ సమన్వయంతో నెస్ట్స్ ఇఎస్ఎస్ఇ-2023 పరీక్షలు ‘‘ఒఎంఆర్ ఆధారిత (పెన్ను-పేపర్)’’ నమూనాలో నిర్వహిస్తుంది. ఇఎంఆర్ఎస్ లో బోధన (టిజిటి) బోధనేతర (హాస్టల్ వార్డెన్లు) సిబ్బంది ఖాళీలు ఈ దిగువ విధంగా ఉన్నాయి.
పోస్టు
|
ఖాళీలు
|
టిజిటి
|
5660
|
హాస్టల్ వార్డెన్
|
669
|
మొత్తం
|
6329
|
ఆన్ లైన్ దరఖాస్తుల ప్రాసెస్, అర్హత ప్రమాణాలు, ప్రతీ పోస్టుకు సిలబస్, ఇతర వివరాలు ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు. emrs.tribal.gov.in.
రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇఎంఆర్ఎస్ ఖాళీల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ప్రారంభమయింది. దరఖాస్తులు అందుకోవడానికి వీలుగా ఈ పోర్టల్ ను 19-07-2023 నుంచి 18-08-2023 వరకు తెరిచి ఉంచుతారు.
ఎస్ టి విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో నాణ్యమైన విద్యను అందించడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహణలోని ప్రధాన కార్యక్రమమే ఇఎంఆర్ఎస్.
***
(Release ID: 1941286)
Visitor Counter : 888